BP: మూడే మూడు ఆసనాలతో బీపీకి చెక్ పెట్టొచ్చు..
BP: రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా బీపీని తగ్గించుకోవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు.

BP
ఆధునిక జీవనశైలిలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక రక్తపోటు (బీపీ BP). దీనిని అదుపులో ఉంచడానికి మందులతో పాటు, ప్రాచీన భారతీయ దివ్యౌషధమైన యోగా ఎంతగానో సహాయపడుతుంది. రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా బీపీని తగ్గించుకోవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. బీపీని తగ్గించేందుకు తోడ్పడే కొన్ని ముఖ్యమైన ఆసనాలు ఇక్కడ ఉన్నాయి.
1. విరాసనం (వీరయోగి భంగిమ)..విరాసనం అత్యంత ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇది శ్వాసపై దృష్టి పెడుతుంది, నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది.

మొదట నేలపై మోకాళ్లపై కూర్చోవాలి.మీ తుంటిని చీలమండల మధ్య ఉంచి, మోకాళ్ల మధ్య దూరాన్ని తగ్గించాలి.రెండు చేతులను మోకాళ్లపై ఉంచి, నాభిని లోపలికి లాగాలి.ఈ స్థితిలో కొంత సమయం పాటు ప్రశాంతంగా ఉండాలి.
2. బాలాసనం (శిశు భంగిమ)..బాలాసనం చేయడం ద్వారా శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది, ఇది బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, తుంటి మరియు వెన్నెముక ఎముకలకు ప్రయోజనం చేకూరుతుంది.

యోగా మ్యాట్‌పై వజ్రాసనంలో కూర్చోండి.నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులను పైకెత్తాలి.నెమ్మదిగా ఊపిరి వదులుతూ ముందుకు వంగి, నుదురు నేలపై ఆనించాలి. చేతులను నేలపైకి చాచాలి.ఈ స్థితిలో 30 సెకన్ల పాటు ఉండి, ఆపై నెమ్మదిగా పూర్వస్థితికి రండి.
3. శవాసనం..శవాసనం పేరుకు తగ్గట్టే శరీరాన్ని పూర్తి విశ్రాంతి స్థితిలోకి తీసుకువస్తుంది. ఈ ఆసనం అధిక బిపి స్థాయిలను నియంత్రించి, మెదడును శాంతపరుస్తుంది.

యోగా మ్యాట్‌పై వెల్లకిలా పడుకోవాలి.కాళ్లను చాచి, పాదాలను రిలాక్స్ చేయాలి.రెండు చేతులను శరీరానికి రెండు వైపులా దూరంగా ఉంచాలి. అరచేతులు ఆకాశం వైపు ఉండేలా చూసుకోండి.కళ్లు మూసుకుని నెమ్మదిగా, లోతైన శ్వాస తీసుకోవాలి.30 సెకన్ల నుండి 2 నిమిషాల వరకు ఈ స్థితిలో ఉండాలి.
ఈ ఆసనాలను ఉదయం , సాయంత్రం వేళల్లో, ఖాళీ కడుపుతో ప్రశాంతమైన వాతావరణంలో సాధన చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ ఆసనాలు బీపీ (BP) సమస్య నుండి మీకు విముక్తిని ఇవ్వడమే కాకుండా, శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతాయి.