Bigg Boss :కొద్ది గంటల్లోనే బిగ్ బాస్ సీజన్ 9.. కంటెస్టెంట్స్ వీళ్లే..
Bigg Boss: ఎప్పటిలాగే, ఈ సీజన్లో బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ల పేర్లపై సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది.

Bigg Boss
బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్(Bigg Boss)’ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తొమ్మిదో సీజన్ మరికొన్ని గంటల్లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఎప్పటిలాగే, ఈ సీజన్లో బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ల పేర్లపై సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది.
ఈ సీజన్ మునుపటి సీజన్లకు భిన్నంగా ఉండబోతోంది. బిగ్ బాస్(Bigg Boss) నిర్వాహకులు ఈసారి ‘సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్’ అనే కొత్త ఫార్మాట్‌ను ప్రవేశపెట్టారు. సాధారణంగా సెలబ్రిటీలతోనే షో నడిచేది. కానీ ఇప్పుడు సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు. ఇప్పటికే చాలా మంది కామనర్స్‌ను ఎంపిక చేసి వారికి అగ్నిపరీక్షలు నిర్వహించారు.
బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 9లో మొత్తం 15 మంది పాల్గొంటున్నట్లు సమాచారం. వీరిలో 9 మంది సెలబ్రిటీలు కాగా, మిగిలిన ఆరుగురు కామన్ మ్యాన్ కోటాలో అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ జాబితాలో కొన్ని ఆసక్తికరమైన పేర్లు ఉన్నాయి.
సంజనా గల్రానీ: ‘బుజ్జిగాడు’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ నటి బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు.
రీతూ చౌదరి: యాంకర్, నటిగా ప్రేక్షకులకు దగ్గరైన ఈమె, జబర్దస్త్ సహా పలు టీవీ షోలలో సందడి చేశారు.
తనూజ గౌడ: పలు తెలుగు సీరియల్స్‌లో నటించి తన నటనతో మంచి పేరు తెచ్చుకున్న నటి ఈమె.
ఆశా షైనీ: బాలకృష్ణతో ‘నరసింహ నాయుడు’, వెంకటేష్‌తో ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి సినిమాల్లో నటించిన సీనియర్ నటి.
శ్రష్ఠి వర్మ: గతంలో ఆమె తన గురువు జానీ మాస్టర్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు పెద్ద వివాదం సృష్టించాయి. ‘పుష్ప 2’ సినిమాకు కూడా పనిచేసింది.
భవాణి శంకర్: సీరియల్ నటుడిగా తెలుగువారికి సుపరిచితుడైన ఇతను కూడా ఈ జాబితాలో ఉన్నారు.

సుమన్ శెట్టి: ‘జయం’, ‘7/G బృందావన్ కాలనీ’ వంటి సినిమాల్లో తన కామెడీతో నవ్వించిన ఈ కమెడియన్ బిగ్ బాస్‌లో ఎలా ఉంటాడో చూడాలి.
రాము రాథోడ్: ‘రాను ముంబైకి రాను’, ‘సొమ్మసిల్లి పోతున్నవే’ వంటి జానపద పాటలతో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఈ ఫోక్ సింగర్ కూడా హౌస్‌లోకి అడుగుపెడుతున్నారని తెలుస్తోంది.
ఇమ్మానుయేల్: జబర్దస్త్ కామెడీ షోలో తనదైన టైమింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న ఇతను, హౌస్‌లో కూడా అదే ఫన్ క్రియేట్ చేస్తాడని భావిస్తున్నారు.
ఈసారి కొత్త ఫార్మాట్ తో బిగ్ బాస్ సీజన్ 9 ప్రేక్షకులకి కావాల్సినంత వినోదాన్ని అందిస్తుందని, టీఆర్పీ రేటింగ్‌లు కూడా భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్లు ఎలా ప్రవర్తిస్తారో, టాస్క్‌లలో ఎలా పోటీ పడతారో తెలుసుకోవడానికి అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
One Comment