Lose weight: బరువు తగ్గితే బోనస్.. పెరిగితే ఫైన్..ఎక్కడో తెలుసా?
Lose weight: చైనాలోని షెంజెన్ నగరానికి చెందిన ప్రముఖ టెక్ కంపెనీ Insta360 తమ ఉద్యోగుల ఆరోగ్యం, ఫిట్నెస్ పెంచడం కోసం ఒక విచిత్రమైన, కానీ ఆకర్షణీయమైన ఛాలెంజ్ ప్రకటించింది.

Lose weight
సాధారణంగా ఉద్యోగులు ఆఫీసులో ప్రమోషన్లు, జీతాలు పెంచుకోవడానికి కష్టపడతారు. కానీ చైనాలోని షెంజెన్ నగరానికి చెందిన ప్రముఖ టెక్ కంపెనీ Insta360 (అరాషి విజన్) ఒక డిఫనెంట్ కాన్సెప్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ సంస్థ తమ ఉద్యోగుల ఆరోగ్యం, ఫిట్నెస్ పెంచడం కోసం ఒక విచిత్రమైన, కానీ ఆకర్షణీయమైన ఛాలెంజ్ ప్రకటించింది. అదే, బరువు తగ్గితే(lose weight) బోనస్, పెరిగితే జరిమానా అనే ఛాలెంజ్.
Insta360 కంపెనీ ఏకంగా 1.1 కోటి రూపాయల (1 మిలియన్ యువాన్) బోనస్ పూల్తో ఈ ఛాలెంజ్‌ను మొదలుపెట్టింది. ఇందులో ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనొచ్చు. ఈ ఛాలెంజ్‌లో బరువు తగ్గితే (lose weight)ప్రతి అర కిలోకు రూ. 5,800 (500 యువాన్) బోనస్ ఉంటుంది. అయితే, ఎవరైనా బరువు పెరిగితే ప్రతి అర కిలోకు రూ. 9,300 (800 యువాన్) జరిమానా చెల్లించాల్సిందే.

ఈ ప్రోగ్రామ్‌లో ఒబేసిటీ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తూ ..30 మందితో కూడిన బ్యాచ్‌లుగా, మూడు టీమ్‌లుగా విడదీశారు. ఈ విధానం వల్ల ఒక వ్యక్తి బరువు పెరిగితే మొత్తం టీమ్ బోనస్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ రూల్ వల్ల ఉద్యోగులు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, పరస్పరం బాధ్యతగా ఉండటం పెరిగింది. ఈ టీమ్ స్పిరిట్ వల్ల ప్రోగ్రామ్ మరింత సక్సెస్ అయింది.
ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఉద్యోగులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఈ ఏడాది ఒక Gen-Z ఉద్యోగి షే యాకీ కేవలం 90 రోజుల్లో 20 కిలోల బరువు తగ్గి(lose weight) సుమారు రూ. 2.5 లక్షల బోనస్ గెలుచుకున్నారు. మొత్తంగా ఐదు బ్యాచ్‌లలో 150 మంది ఉద్యోగులు కలిసి 800 కిలోల బరువు తగ్గారు. కంపెనీ ఏకంగా 2 కోట్లకు పైగా బోనస్ పంపిణీ చేసింది.
ఈ కార్యక్రమంపై మిశ్రమ స్పందనలు వచ్చినా, కార్పొరేట్ కల్చర్‌లో ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి పెడుతూ, మోటివేషన్ కోసం ఒక వినూత్న మార్గాన్ని చూపించింది. ముఖ్యంగా, టెక్ కంపెనీలలో ఉండే అధిక ఒత్తిడిని అధిగమించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. Insta360 ఈ ప్రోగ్రామ్‌తో తమ ఉద్యోగులకు బెస్ట్ వర్క్‌ప్లేస్ కల్చర్‌ను అందిస్తున్నామని చాటిచెప్పింది.