Just LifestyleHealthLatest News

Indoor plants:ఈ ఇండోర్ ప్లాంట్స్.. మనసు, ఇంటి ఆరోగ్యం కాపాడే అద్భుతాలు!

Indoor plants:ఇండోర్ ప్లాంట్స్ కేవలం అందాన్ని మాత్రమే కాదు, అవి మన ఆరోగ్యం, మానసిక స్థితి , ఇంటి వాతావరణంపై సానుకూల ప్రభావం చూపుతాయి.

Indoor plants

ఆధునిక ఫ్లాట్ కల్చర్‌లో, మనం ప్రకృతికి చాలా దూరంగా ఉంటున్నాం. కానీ, మన ఇంటి లోపల కొన్ని మొక్కలను పెంచడం ద్వారా ఆ లోటును భర్తీ చేయొచ్చు. ఇండోర్ ప్లాంట్స్ కేవలం అందాన్ని మాత్రమే కాదు, అవి మన ఆరోగ్యం, మానసిక స్థితి , ఇంటి వాతావరణంపై సానుకూల ప్రభావం చూపుతాయి.ఇండోర్ ప్లాంట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అందరూ వాటికే ఓటేస్తారు.

గాలి శుద్ధి… మన ఇళ్లలో ఫర్నిచర్, రంగుల నుంచి విడుదలయ్యే రసాయనాలను (ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటివి) కొన్ని మొక్కలు గ్రహిస్తాయి. దీనివల్ల ఇల్లు, గాలి శుభ్రంగా ఉంటుంది. నాసా (NASA) పరిశోధన ప్రకారం, స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, పోతోస్ (మనీ ప్లాంట్) వంటివి గాలిని శుభ్రం చేయడంలో అగ్రస్థానంలో ఉన్నాయి.

Indoor plants
Indoor plants

ఒత్తిడి తగ్గింపు.. మొక్కల దగ్గర ఉన్నప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. అందుకే ఆఫీసులలో, మరియు ఇంట్లో ఉండే గదుల్లో మొక్కలు పెట్టుకుంటారు.

సృజనాత్మకత, ఏకాగ్రత.. మొక్కల దగ్గర పనిచేయడం వల్ల లేదా చదువుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఇవి మన మెదడును ఉత్తేజితం చేసి, సృజనాత్మకతను పెంచుతాయి.

మంచి నిద్ర.. కొన్ని మొక్కలు రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఉదాహరణకు, స్నేక్ ప్లాంట్ (మదర్-ఇన్-లాస్ టంగ్) రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇది గదిలోని గాలిని శుద్ధి చేసి, మనకు మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.

Indoor plants
Indoor plants

సులభంగా పెంచే కొన్ని మొక్కలు:

  • స్నేక్ ప్లాంట్.. దీనికి తక్కువ నీరు, తక్కువ సూర్యరశ్మి సరిపోతుంది. ఇది గాలిని శుద్ధి చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
  • మనీ ప్లాంట్.. తక్కువ వెలుతురులో కూడా పెరుగుతుంది. త్వరగా పెరిగి, ఇంటికి పచ్చదనాన్ని ఇస్తుంది.
  • స్పైడర్ ప్లాంట్.. దీనికి కూడా తక్కువ నీరు అవసరం. ఇది గాలిలోని టాక్సిన్స్ (toxins) ను తొలగించడంలో సహాయపడుతుంది.
  • పీస్ లిల్లీ.. ఇది గాలిని శుద్ధి చేయడంతో పాటు, అందమైన పూలతో ఇంటికి అదనపు అందాన్నిస్తుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button