HealthJust LifestyleLatest News

Creatinine : ప్రోటీన్, ఉప్పు తగ్గించండి.. క్రియాటినిన్ 1.8ని అదుపులోకి తీసుకురావడానికి చిట్కాలు!

Creatinine: రక్తంలో క్రియాటినిన్ సాధారణ స్థాయి (పురుషుల్లో 0.6–1.2 mg/dL, మహిళల్లో 0.5–1.1 mg/dL)ని మించి 1.8 mg/dL కి చేరుకోవడం అంటే, మీ కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గిందని, వాటిపై ఒత్తిడి పడుతోందని స్పష్టమైన సంకేతం.

Creatinine

మన కిడ్నీలు (మూత్రపిండాలు) శరీరంలోని విషపదార్థాలను నిరంతరం వడపోసి బయటకు పంపుతాయి. వాటిలో ప్రధానమైన వ్యర్థ పదార్థం క్రియాటినిన్(Creatinine), ఇది కండరాల పనితీరు వల్ల ఉత్పత్తి అవుతుంది. రక్తంలో క్రియాటినిన్ సాధారణ స్థాయి (పురుషుల్లో 0.6–1.2 mg/dL, మహిళల్లో 0.5–1.1 mg/dL)ని మించి 1.8 mg/dL కి చేరుకోవడం అంటే, మీ కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గిందని, వాటిపై ఒత్తిడి పడుతోందని స్పష్టమైన సంకేతం. ఈ స్థాయి జాగ్రత్త అవసరమని సూచిస్తుంది.

ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు తగినంత నీరు తాగకపోవడం (డీహైడ్రేషన్), అధిక ప్రోటీన్ లేదా మాంసాహారం తీసుకోవడం, అలాగే బీపీ, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో లేకపోవడం. కొన్ని మందుల దుష్ప్రభావాలు లేదా మూత్రనాళంలో అడ్డంకులు కూడా కారణం కావచ్చు.

ఈ స్థాయిలో, కిడ్నీలు రక్తం వడపోసే వేగం (GFR) సాధారణంగా 30–45 మధ్య ఉంటుంది, అంటే మోస్తరు కిడ్నీ పనితీరులో తగ్గుదల ఉన్నట్లు లెక్క. ఈ పరిస్థితి తీవ్రమైతే రక్తంలో విషపదార్థాలు పేరుకుపోయి, గుండె, మెదడుపై ఒత్తిడి పెరిగి, కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీయవచ్చు. అందుకే తక్షణమే అప్రమత్తం కావాలి.

క్రియాటినిన్(Creatinine) పెరిగినప్పుడు అలసట, కాళ్లు-ముఖం ఉబ్బడం, తక్కువ మూత్రం రావడం, ఆకలి తగ్గడం, శ్వాస తీసుకోవడంలో కష్టం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని విస్మరించకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించి, రీనల్ ప్రొఫైల్ (క్రియాటినిన్, యూరియా) మరియు HbA1c (మధుమేహం నియంత్రణ) వంటి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.

Creatinine
Creatinine

Deepika Padukone: నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ? వాళ్ళను అడగరెందుకు ?

నివారణ కోసం, జీవనశైలిలో కీలక మార్పులు చేసుకోవాలి.నీరు అధికంగా తాగాలి. రోజుకు 2–3 లీటర్ల నీరు, అలాగే కొబ్బరి నీరు, దోసకాయ వంటి హైడ్రేటింగ్ పండ్లు తీసుకోవడం చాలా ముఖ్యం.ఉప్పును పూర్తిగా తగ్గించండి. అలాగే, అధిక ప్రోటీన్, మాంసాహారం తీసుకోవడం వైద్యుల సలహా మేరకు మాత్రమే పరిమితం చేయాలి. జిమ్ సప్లిమెంట్లు (క్రియాటిన్) వాడకండి.డయాబెటిస్, బీపీని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి.

డాక్టర్ సలహా లేకుండా NSAID నొప్పి మందులు, పొగాకు, మద్యపానం పూర్తిగా మానండి. తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామం, మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా కిడ్నీలకు విశ్రాంతిని ఇవ్వాలి.

క్రియాటినిన్(Creatinine) 1.8 అంటే కిడ్నీలు మీకు పంపుతున్న హెచ్చరిక. సరైన జాగ్రత్తలు, వైద్య సలహాలతో దీన్ని నియంత్రించవచ్చు. సమయానికి స్పందించడం ప్రాణాలను కాపాడుతుంది.

Nobel Peace Prize 2025: ట్రంప్ కు కాదు మచాడోకు.. నోబెల్ శాంతి బహుమతి ప్రకటన

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button