Just Andhra PradeshJust PoliticalLatest News

Visakhapatnam : విశాఖ దశ మార్చిన గూగుల్..విశాఖ చరిత్రలో నిలిచిపోయే అద్భుత ఘట్టం

Visakhapatnam: గూగుల్ డేటా సెంటర్ వల్ల సుమారు లక్షా 88 వేల మందికి పైగా యూత్‌కు డైరెక్ట్‌గా , ఇన్ డైరెక్ట్‌గా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనాలున్నాయి.

Visakhapatnam

విశాఖపట్నం చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలయింది. నిన్నటి వరకు కేవలం స్టీల్ సిటీగా, పోర్ట్ సిటీగా వెలిగిపోయిన విశాఖ, ఇప్పుడు గ్లోబల్ టెక్ మ్యాప్‌లో డేటా పవర్ హౌస్‌గా తన జైత్రయాత్రను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును సమూలంగా మార్చివేసే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్, ఏకంగా 15 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 1.25 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న ఏఐ (AI) డేటా సెంటర్ హబ్‌కు ఈరోజు విశాఖలో అంకురార్పణ జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌, మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా తర్లువాడలో జరిగిన ఈ భూమి పూజ కార్యక్రమం కేవలం ఒక భవన నిర్మాణానికి పునాది మాత్రమే కాదు, వచ్చే తరాల ఐటీ కలలకు బలమైన పునాదిగా నిలిచింది.

Related Articles

ఈ ప్రాజెక్టు వైశాల్యం, సామర్థ్యం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. విశాఖపట్నం(Visakhapatnam), అనకాపల్లి జిల్లాల పరిధిలో దాదాపు 600 ఎకరాలకు పైగా విస్తీర్ణం గల భూమిలో, 1 గిగావాట్‌కు పైగా సామర్థ్యంతో మూడు భారీ డేటా సెంటర్లను గూగుల్ నిర్మిస్తోంది. దీని కోసం తర్లువాడలో 266 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, రాంబిల్లి వద్ద 174 ఎకరాలను కూటమి ప్రభుత్వం కేటాయించింది.

2028 నాటికి ఈ నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా గూగుల్ అడుగులు వేస్తోంది. దీనివల్ల విశాఖ పట్నం కేవలం దేశీయ ఐటీ నగరాలైన బెంగళూరు, హైదరాబాద్ సరసన చేరడమే కాకుండా, ఆసియా ఖండానికే క్లౌడ్ , ఏఐ సేవలకు ప్రధాన ద్వారం (Gateway)గా నిలవబోతోంది. సముద్ర గర్భం నుంచి వేసే అంతర్జాతీయ సబ్‌సీ కేబుళ్ల ద్వారా విశాఖ సిటీ నేరుగా ప్రపంచ దేశాలతో డిజిటల్ కనెక్ట్ కాబోతోంది.

ఉపాధి అవకాశాల పరంగా ఇది ఒక పెను మార్పును తీసుకురాబోతోంది. ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల సుమారు లక్షా 88 వేల మందికి పైగా యూత్‌కు డైరెక్ట్‌గా , ఇన్ డైరెక్ట్‌గా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనాలున్నాయి. కేవలం ఉద్యోగాలే కాకుండా, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్చర్ వంటి లేటెస్ట్ రంగాల్లో స్థానిక నైపుణ్యం మెరుగుపడటానికి ఇది గొప్ప వేదిక కాబోతోంది.

విశాఖపట్నం(Visakhapatnam) పరిసరాల్లో ఏఐ హబ్ ఏర్పడటం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ రంగాల్లో పనిచేసే వందలాది స్టార్టప్ కంపెనీలు ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉంది. డేటా స్టోరేజీ , అతివేగవంతమైన కమ్యూనికేషన్ సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల గ్లోబల్ టెక్ కంపెనీలన్నీ విశాఖ వైపు దృష్టి సారిస్తున్నాయి.

Visakhapatnam
Visakhapatnam

మరోవైపు ఇప్పుడు గూగుల్‌తో పాటు అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా వంటి కార్పొరేట్ కంపెనీలు కూడా భాగస్వాములు కావడంతో విశాఖలో ఒక సమగ్రమైన ఏఐ ఎకోసిస్టమ్ రూపుదిద్దుకుంది. దీనికి తోడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వంటి మౌలిక వసతులు తోడవ్వడం వల్ల రవాణా, లాజిస్టిక్స్ రంగాలు కూడా ఊపందుకున్నాయి.

పర్యావరణ హితంగా గ్రీన్ ఎనర్జీ ఆధారంగా ఈ డేటా సెంటర్లను నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. సెమీకండక్టర్ డిజైన్ నుంచి స్టార్టప్ ఇంక్యుబేషన్ వరకు అన్ని రంగాల్లోనూ విశాఖపట్నం ఇప్పుడు విశ్వనగరంగా అవతరించింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ఏపీ ఇప్పుడు టెక్నాలజీ రంగంలో టాప్‌గా నిలిచింది.

Partner:మాటిచ్చి ఎందుకు తప్పుతారు? భాగస్వామి కోసం మారడం అంత కష్టంగా ఎందుకు అనిపిస్తుంది?

Related Articles

Back to top button