Just SpiritualJust Andhra PradeshLatest News

TTD Srivari Saree Auction : శ్రీవారి కానుకలు పొందే అరుదైన అవకాశం..నవంబర్ 23- 25 వరకు టీటీడీ వస్త్రాల ఈ-వేలం

TTD Srivari Saree Auction : శ్రీవారి ఆలయానికి శ్రీనివాసుని భక్తులు సమర్పించిన న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను టీటీడీ ఈ-వేలం ద్వారా విక్రయించబోతోంది. ఆంధ్రప్రదేశ్ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా పాల్గొనే విధానం గురించి సమాచారం ఇక్కడ చూడండి.

TTD Srivari Saree Auction

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి అలాగే టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు భక్తిశ్రద్ధలతో కానుకగా సమర్పించిన నూతన ఆర్ట్ సిల్క్ చీరలను ఆన్‌లైన్ ద్వారా విక్రయించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా నవంబర్ 23వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు ఈ-వేలం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజాసంబంధాల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

మొత్తం 115 లాట్లలో ఉన్న న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను ఈ వేలంలో భక్తులకు అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ-వేలం ఐడీ నెంబర్లు 28814 నుంచి 28819 వరకు కేటాయించిన ఈ వస్త్రాలను ఆన్‌లైన్ పద్ధతిలో వేలాన్ని వేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో ముందుగా నేమ్‌ను నమోదు చేసుకున్న అంటే రిజిస్టర్ అయిన ఆసక్తిగల వ్యక్తులు లేదంటే వ్యాపారులు ఈ ఆన్‌లైన్ బిడ్డింగ్ ప్రాసెస్‌లో పాల్గొనొచ్చు.

ఈ వేలానికి సంబంధించి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి లేదంటే పూర్తిస్థాయి నియమాలు నిబంధనలను తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్నవారు తిరుపతిలోని హరేకృష్ణ మార్గ్‌లో ఉన్న టీటీడీ జనరల్ మేనేజర్ (Auctions) ఆఫీస్ లేదా సహాయ కార్యనిర్వహణాధికారి (AEO) కార్యాలయాన్ని డైరెక్టుగా సంప్రదించవచ్చు.

అంతేకాకుండా డిజిటల్ మీడియా(Digital media) ద్వారా వివరాలు పొందాలనుకునే వారు ఏపీ ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ [https://konugolu.ap.gov.in](https://konugolu.ap.gov.in) లేదా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org ని సందర్శించొచ్చు.

ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకోవాలనుకునే భక్తులు 0877-2264429 నెంబర్‌ను సంప్రదించొచ్చని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి వెల్లడించారు.

Blood Relation : రక్త సంబంధీకులు దూరమవుతున్నారు..బయటివాళ్లే మనవాళ్లలా మారుతున్నారు..

Related Articles

Back to top button