Gold Rates : దసరా వేళ షాకిచ్చిన గోల్డ్ రేట్లు.. మళ్లీ పసిడి పరుగులు..
Gold Rates : గ్లోబల్ మార్కెట్లో కూడా పుత్తడికి డిమాండ్ పెరగడంతో, అక్కడ ఔన్స్ గోల్డ్ కాస్ట్ ఏకంగా 4,183 డాలర్ల మార్క్‌ను టచ్ చేసింది.
Gold Rates
విజయదశమి సమయంలో పసిడిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఈరోజు ధరలు షాక్ ఇస్తున్నాయి. గత వారంలో కొంత వరకూ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు, మళ్లీ పరుగులు పెడుతున్నాయి. సోమవారం ఉదయం పసిడి ధరలు మరోసారి పైకి కదిలాయి. గ్లోబల్ మార్కెట్లో కూడా పుత్తడికి డిమాండ్ పెరగడంతో, అక్కడ ఔన్స్ గోల్డ్ కాస్ట్ ఏకంగా 4,183 డాలర్ల మార్క్‌ను టచ్ చేసింది.
దీని ప్రభావం మన దేశీయ మార్కెట్లపై గట్టిగానే పడింది. ఈరోజు లెక్కల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్‌పై ఏకంగా రూ. 380 పెరగగా..జ్యువెలరీ తయారీకి ఎక్కువగా వాడే 22 క్యారెట్ల పసిడిపై రూ.350 వరకు పెరిగింది. మరోవైపు గోల్డ్ బాటలోనే(Gold Rates పరుగులు పెడుతున్న సిల్వర్ ధరలు మాత్రం కాస్త స్థిరంగా కొనసాగుతుండటం కొంచెం ఊరటనిచ్చే అంశం.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పసిడి ధరలు(Gold Rates) భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 1లక్ష48వేల40 వద్ద ట్రేడ్ అవుతుండగా.. 22 క్యారెట్ల జ్యువెలరీ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 1లక్ష35వేల700 వద్ద కొనసాగుతోంది.
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1లక్ష48వేల190 ఉండగా, 22 క్యారెట్ల రేటు రూ. 1లక్ష35వేల850 వద్ద ఉంది. ఇక ముంబై, కోల్‌కతా, చెన్నై లాంటి నగరాల్లో చూస్తే 24 క్యారెట్ల తులం బంగారం రూ. 1లక్ష48వేల40 పలకగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1లక్ష35వేల700 వద్ద కొనసాగుతుంది.
అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో సిల్వర్ ధర రూ. 2,40,000 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, బెంగళూరులో కిలో వెండి రేటు రూ. 2లక్షల30వేలు ఉండగా, చెన్నైలో మాత్రం కిలో వెండి రూ. 2లక్షల40వేల వద్ద ట్రేడ్ అవుతూ ఊహించని రేంజ్లో రికార్డ్ సృష్టిస్తోంది.





