Gold Price : పుత్తడి తగ్గినా వెండి మాత్రం తగ్గనంటోంది.. ఒక్కరోజే కిలోపై రూ. 5,000 జంప్
Gold Price : మొన్నటి వరకు భయపెట్టిన గోల్డ్ రేట్(Gold Price) ఇప్పుడు మళ్లీ కుప్పకూలడంతో కొనుగోలుదారులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు.
Gold Price
పసిడి కొనాలనుకునే వాళ్లకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. రెండు రోజులుగా తగ్గుతూ మళ్లీ పెరుగుతూ వచ్చిన బంగరం ధరలు శుక్రవారం రోజు ఒక్కసారిగా కిందకి దిగివచ్చాయి. మొన్నటి వరకు భయపెట్టిన గోల్డ్ రేట్(Gold Price) ఇప్పుడు మళ్లీ కుప్పకూలడంతో కొనుగోలుదారులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు.
హైదరాబాద్‌లో ధరలను చూస్తే.. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర (Gold Price)రూ. 1లక్ష59వేల490 దగ్గర నడుస్తోంది. గురువారంతో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ. 440 కిందకి దిగొచ్చింది.
అలాగే మగువలు ఎక్కువగా ఇష్టపడే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం రేటు తులం రూ. 1లక్ష46వేల200 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్న ఇది రూ. 1లక్ష46వేల600 వద్ద ఉండగా.. ఈరోజు రూ. 400 తగ్గింది.
ఇక ఎప్పుడూ రేట్లు ఎక్కువగా ఉండే చెన్నైలో కూడా ఇవాళ సీన్ రివర్స్ అయింది. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 430 తగ్గి ప్రస్తుతం రూ. 1లక్ష61వేల240 కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం కంటే రూ. 300 తగ్గి రూ. 1,47,800 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఎప్పుడూ భారీగా ఉండే బంగారం రేట్లు ఈరోజు ఒక్కసారిగా పడిపోయాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 590 పతనమై రూ. 1లక్ష59వేల640 కి పడిపోయింది. అలాగే 22 క్యారెట్ల రేటు కూడా రూ. 500 తగ్గి రూ. 1లక్ష46,250 వద్ద నడుస్తోంది.

అయితే గోల్డ్ ధరలు తగ్గాయి కదా అని సంతోషపడే లోపే సిల్వర్ మాత్రం కొనుగోలుదారులకు గట్టి షాక్ ఇచ్చింది. గురువారంతో పోలిస్తే ఈరోజు కిలో వెండిపై ఏకంగా రూ. 5,000 వరకు పెరిగింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు చెన్నై, బెంగళూరు నగరాలలో కేజీ సిల్వర్ ధర రూ. 5 వేలు జంప్ అయ్యి ప్రస్తుతం రూ. 2 లక్షల 95 వేల మార్కుకు చేరుకుంది. ఢిల్లీలో మాత్రం కిలో వెండి ధర రూ. 2 లక్షల 85 వేల వద్దే కొనసాగుతోంది.
Kashi Vishwanath: కాశీ వెళుతున్నారా? అయితే కాశీ విశ్వనాథునితో పాటు కాలభైరవుడి దర్శించుకోండి..





