Just EntertainmentLatest News

Actor Sridevi : శ్రీదేవి కుటుంబానికి సుప్రీంకోర్టు బిగ్ షాక్..బోనీ, జాన్వీలకు నోటీసులు

Actor Sridevi : సుప్రీంకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించి, బోనీ కపూర్ ఫ్యామిలీకి నోటీసులు పంపడమే కాకుండా.. ఆ భూమిపై ప్రస్తుతమున్న పరిస్థితినే కొనసాగించాలని చెప్పింది.

Actor Sridevi

దివంగత నటి శ్రీదేవి పేరు వినగానే ఆమె యాక్షన్, గ్లామర్ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు ఆమె ఫ్యామిలీకి చెందిన ఒక పాత ఆస్తి వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని శ్రీదేవి ల్యాండ్ ప్రాపర్టీపై తలెత్తిన ఒక లీగల్ వార్‌లో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన ఆదేశాలను జారీ చేసింది.

ఆ స్థలానికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితి ఉందో దాన్నే అలాగే (Status Quo) కొనసాగించాలని తేల్చి చెప్పింది. అంతేకాదు చెన్నై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ కె.వి.విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లీ ధర్మాసనం.. శ్రీదేవి(Actor Sridevi) భర్త బోనీ కపూర్, ఆమె కుమార్తెలైన జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌కు నోటీసులు పంపడంతో ఈ వ్యవహారం టాలీవుడ్, బాలీవుడ్‌లలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఇది ఇప్పటి గొడవ కాదు, సుమారు 1988 నాటి సేల్ డీడ్‌కి సంబంధించిన గొడవ. అప్పట్లో శ్రీదేవి(Actor Sridevi), ఆమె సోదరి శ్రీలత, తల్లి రాజేశ్వరి కలిసి ఎం.సి. నిత్యానంద ముదలియార్ అనే వ్యక్తి నుంచి చెన్నైలో ఈ ల్యాండ్‌ను కొనుగోలు చేశారు. అయితే, ఆ ల్యాండ్ అసలు ఓనర్ తమ తాతగారైన సంబంధ ముదలియార్ అని, తమ తండ్రి చంద్రశేఖరన్ ద్వారా దానిలో 1/5వ వంతు వారసత్వ వాటా తమకు రావాల్సి ఉందని ఎం.సి. శివకామి, ఆమె సోదరుడు నటరాజన్ రంగంలోకి దిగారు. ఆ సేల్ డీడ్‌ను రద్దు చేయాలని వారు చెంగల్పట్టు కోర్టు మెట్లు ఎక్కారు.

ఈ కేజీల కొద్దీ కాగితాల డ్రామాపై గతంలోనే చెన్నై హైకోర్టు విచారణ జరిపి తీర్పు కూడా ఇచ్చింది. పిటిషనర్ల తండ్రి చంద్రశేఖరన్ మొదటి భార్య బతికి ఉన్న టైమ్‌లోనే ఈ సంబంధం ఏర్పడిందని, అందుకే వీరికి ఆ ఆస్తిపై ఎలాంటి వారసత్వ హక్కులు చెల్లవంటూ హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. కేవలం శ్రీదేవి ఫ్యామిలీ ఆస్తిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ లేట్ వ్యాజ్యం వేశారని చెబుతూ ఆ దావాను కొట్టివేసింది.

Actor Sridevi
Actor Sridevi

అయితే హైకోర్టు కొట్టేసినా కూడా ఆ పిటిషనర్లు వదలకుండా అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ 1988 నాటి కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించి, బోనీ కపూర్ ఫ్యామిలీకి నోటీసులు పంపడమే కాకుండా.. ఆ భూమిపై ప్రస్తుతమున్న పరిస్థితినే కొనసాగించాలని చెప్పడంతో ఈ భూమి ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరి సుప్రీంకోర్టు నోటీసులపై బోనీ కపూర్ టీమ్ ఎలా రియాక్టవుతుందో.. ఈ మూడు దశాబ్దాల నాటి ఆస్తి వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

AI Consume Water : 80s ఏఐ ఇమేజ్ వెనుకున్న చేదు నిజం.. ఒక్క ఫోటో ఏఐ సర్వర్లకు ఎంత దాహాన్ని పెంచుతోందో తెలుసా?

Related Articles

Back to top button