Bigg Boss Nominations : అగ్ని పరీక్ష టీమ్‌కు బిగ్ షాక్.. పక్కా ప్లాన్‌తో పగ తీర్చుకున్న సెలెబ్రిటీ గ్యాంగ్
Bigg Boss Nominations : చరణ్ ముకేష్‌ను నామినేట్ చేస్తూ ఆచితూచి మాట్లాడాలని చెబుతూ ఉంటే.. డిఫెండ్ చేసుకోకుండా బాగా మాట్లాడావ్ చప్పట్లు కొట్టండని ముకేష్ సింపుల్‌గా ముగించాడు.
Bigg Boss Nominations
బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్ల(Bigg Boss Nominations) రోజు వచ్చిందంటే చాలు.. అప్పటివరకు ఉన్న ఫ్రెండ్షిప్ మాస్క్‌లన్నీ తీసేసి కంటెస్టెంట్స్ అంతా అసలు సిసలైన మైండ్ గేమ్‌లు బయటపెడతారు. ఈసారి ఐదో వారం నామినేషన్ల పర్వం అయితే వేరే లెవెల్లో హీటెక్కిపోయింది. ఒకరి ప్లాన్లను మరొకరు పసిగట్టడం, పర్సనల్ విషయాలను తీసి మరీ కౌంటర్లు వేయడం, నన్ను నామినేట్ చేస్తే నీకేంటని ఎదురు తిరగడం..ఇలా హౌస్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఈ వారం నామినేషన్ల(Bigg Boss Nominations) ప్రాసెస్ ముగిసేసరికి మైండ్ గేమ్‌లతో ముందుకు సాగిన అగ్ని పరీక్ష టీమ్ మొత్తం డేంజర్ జోన్లోకి వెళ్లిపోవడం ఈ వీక్‌కే పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. తమ టీమ్ మొత్తం నామినేషన్స్‌లోకి వస్తుందని రోహిత్ గెస్ చేసి, సెలెబ్రిటీ గ్యాంగ్‌ను కూడా నామినేషన్స్‌లోకి లాగడానికి మాస్టర్ ప్లాన్ వేసినా, నరేష్ దాన్ని చాలా తెలివిగా రివర్స్ అటాక్ ఇచ్చి తిప్పికొట్టాడు.
ఈ నామినేషన్లలో సుధీర్ మొదటగా షాలినీ, రోహిత్‌ను టార్గెట్ చేసి హీట్ పెంచాడు. రోహిత్ వల్ల నీ గేమ్ పాడవుతోందని, తెల్లవారుజాము 4 గంటల వరకు కూర్చుని ఏం మాట్లాడుకుంటున్నారని సుధీర్ పాయింట్ లాగితే.. అది నా పర్సనల్ నీకెందుకు అని షాలినీ తిప్పికొట్టింది.
ఇక నామినేషన్ల మధ్యలో సెలెబ్రిటీ టీమ్ అంతా చప్పట్లు కొడుతుంటే దానికి షాలినీ వేసిన సెటైర్లు, దానికి వంశీ పవర్ స్టార్‌తోనే చేశా అంటూ ఇచ్చిన పంచ్‌లు హౌస్‌లో మామూలుగా మంటలు పుట్టించలేదు. త్రిగుణ్ కూడా ఈ గొడవలో కాస్త ఆజ్యం పోసే ప్రయత్నం చేశాడు.
ఆ తర్వాత చరణ్ ముకేష్‌ను నామినేట్ చేస్తూ ఆచితూచి మాట్లాడాలని చెబుతూ ఉంటే.. డిఫెండ్ చేసుకోకుండా బాగా మాట్లాడావ్ చప్పట్లు కొట్టండని ముకేష్ సింపుల్‌గా ముగించాడు. కానీ అపూర్వ .. ముకేష్‌ను తనను నక్క, ట్రయాంగిల్ ట్రాక్ అన్నావంటూ పాయింట్లు తీసి, నువ్వు తోపు అయితే నీకు నేను బాపు అని అనడంతో.. నువ్వు నాకు తండ్రివా అని ముకేష్ రివర్స్ అటాక్ చేశాడు.
అంతటితో ఆగకుండా అపూర్వ .. ఝాన్సీని కూడా నామినేట్ చేసింది. అందరి మాటలు విని ఇన్ఫ్లూయెన్స్ అయ్యావని, నీ కత్తులను వంశీకి ఎందుకు ఇచ్చావని నిలదీస్తే.. జనాలు ఉంచాలనుకుంటే ఉంచుతారని, ఇమ్యూనిటీ కంటే ఆట ఆడటమే ఇంపార్టెంట్ ఝాన్సీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
మరోవైపు నరేష్ .. చరణ్‌ను నామినేట్ చేస్తూ నాగార్జున చెబుతున్నా నీలో మార్పు రావట్లేదు అంటే.. నేను మారను, ఇలాగే ఉంటానని చరణ్ తన యాటిట్యూడ్ చూపించాడు. ఇక ఝాన్సీ .. రోహిత్‌ను నామినేట్ చేస్తూ మాటలు తూలుతున్నావని, చిన్నపిల్లాడివి అని అమన్‌ను నామినేట్ చేస్తూ ఆటగాడిలా ఆడు.. పోటుగాడిలా కాదని కౌంటర్ ఇచ్చింది. దేబ్జానీ .. రోహిత్ ప్రవర్తన నచ్చలేదని నామినేట్ చేస్తూ, బిందు మాధవి నీళ్ల చల్లితే రెస్పాండ్ అవలేదు కానీ ఇక్కడేంటని పాయింట్ లాగింది.

చివర్లో రోహిత్.. నరేష్, రామ్ ప్రసాద్‌ను నామినేట్ చేయడానికి ట్రై చేయగా.. మీ దగ్గర పాయింట్లేవీ లేవని, మా అందరినీ నామినేట్ చేయడానికి మాత్రమే ఫిక్స్ అయ్యారని నరేష్ వారి ప్లాన్ బయటపెట్టాడు. ఆ తర్వాత వంశీ కూడా వచ్చి రోహిత్‌ను నామినేట్ చేయడంతో ప్రాసెస్ ముగిసింది.
చివరికి కెప్టెన్ వర్షిణి, ఇమ్యూనిటీ దక్కించుకున్న వంశీ, సుధీర్ తప్ప.. ముకేశ్, రోహిత్, అమన్, రామ్ ప్రసాద్, త్రిగుణ్ అపూర్వ, ఝాన్సీ, నరేష్, షాలినీ, చరణ్ ఇలా ఏకంగా పది మంది నామినేషన్లలోకి వచ్చేశారు. ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసినా కూడా అగ్ని పరీక్ష టీమ్ మొత్తం డేంజర్ జోన్లోకి వెళ్లిపోయింది. దీంతో ఈ వీక్ వారి గ్యాంగ్ నుంచే ఒక వికెట్ డౌన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.





