Ex-Housemates : బిగ్ బాస్ 11వ వారంలో మాజీల సునామీ.. హీట్‌ను పెంచిన నామినేషన్స్
Ex-Housemates : బిగ్ బాస్ 11వ వారం నామినేషన్స్‌లో మాజీ కంటెస్టెంట్లు డిక్టేటర్లుగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు. షాలినీ, అపూర్వ, దక్షి ఎంట్రీతో హౌస్‌లో జరిగిన వాగ్వాదాలు, ఎవరు నామినేట్ అయ్యారు చూడండి..
Ex-Housemates
బిగ్ బాస్ హౌస్‌లో 11వ వారం నామినేషన్ల పర్వం ఊహించని విధంగా సాగింది. మాజీ కంటెస్టెంట్లు(Ex-Housemates) డిక్టేటర్ల రూపంలో రీఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్‌ను ఆట ఆడుకున్నారు. షాలినీ, దక్షి, ఝాన్సీ, మిథిలేష్, అపూర్వ వంటి మాజీ కంటెస్టెంట్లు(Ex-Housemates) హౌస్‌లోకి వచ్చి వీరి వీక్నెస్‌లను ఎత్తిచూపుతూ నామినేట్ చేశారు. దీనిలో భాగంగా జరిగిన వాగ్వాదాలు, మాటల యుద్ధం హౌస్‌లో హీట్ పెంచాయి.
షాలినీ ఎంట్రీ ఇస్తూ నీతూను ఫస్ట్ టార్గెట్ చేసింది. ఏడ్చే నీతూ, పిరికి నీతూ అంటూ ఆమె గేమ్‌ను తప్పుబట్టింది. వంట బాగా చేశారనే రీజన్‌తోనే కెప్టెన్‌ని చేస్తారా అని ప్రశ్నించడంతో.. దీనికి నీతూ గట్టిగానే బదులిచ్చింది. బయట వాళ్లకి నచ్చేలా ఉండలేదు, హౌస్‌లోనూ ప్రూవ్ చేసుకోలేక బయటకు వెళ్లి నన్ను నామినేట్ చేయడమేంటని నీతూ ఫైర్ అయింది.
చివరకు షాలినీ ఇచ్చిన డ్యాగర్‌తో త్రిగుణ్ సీన్లోకి దిగి శివ్‌ను నామినేట్ చేశాడు. గోట్ టాస్క్‌లో త్యాగం చేశాననడంలో అర్ధం లేదని, రివెంజ్ కోసమే తన నేమ్ రాశారంటూ త్రిగుణ్ గుర్తు చేస్తూ ఫైర్ అయ్యాడు. ఇమ్యూనిటీ కంటే తన ఓటింగ్ తెలుసుకోవాలని అనుకోవడంతోనే ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్లు శివ్ క్లారిటీ ఇచ్చాడు.
ఇక హౌస్‌లోకి వచ్చిన మిథిలేష్ ..ముకేష్‌ను నామినేట్ చేస్తూ సుధీర్ విషయంలో తప్పు జరిగిందని చెప్పాడు. అమన్‌ను నామినేట్ చేస్తూ మబ్బు ముకేషా అంటూ సరదాగా కవితలు చదివినా, సపోర్ట్ విషయంలో అమన్ చేసిన మోసాన్ని అందరి ముందూ బయటపెట్టాడు. మరోవైపు దక్షి ఎంట్రీ ఇచ్చి నీతూ కామెంట్లపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తోటి కంటెస్టెంట్లను ఉద్దేశించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పింది. ఆ తర్వాత త్రిగుణ్ చేతికి డ్యాగర్ ఇవ్వగా, అతను వంశీని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ టైమ్‌లో వంశీ మరింత స్ట్రిక్ట్‌గా ఉండాల్సిందని అభిప్రాయపడగా.. వీరిద్దరూ కలిసి ప్లాన్ చేశారంటూ రాంప్రసాద్, నరేష్ సెటైర్లు పేల్చారు.
అపూర్వ ఎంట్రీ ఇస్తూనే వర్షిణి గేమ్ ప్లాన్‌ను బయటపెట్టింది. వర్షిణి మాట్లాడిన కొన్ని మాటలతో పాటు, త్రిగుణ్ వీక్‌నెస్ మీద కొడదామన్న ప్లాన్‌ను అందరి ముందు ఎక్స్‌పోజ్ చేసింది. సుధీర్‌ను సాక్ష్యం అడిగినా అతను డిప్లొమాటిక్‌గా ఆన్సర్ దాటవేశాడు. ఇక అపూర్వ ఇచ్చిన డ్యాగర్‌తో శివ్.. దేబ్జానీకి కెప్టెన్ అయ్యే ఛాన్స్ వచ్చినా సపోర్ట్ చేయలేదన్న పాయింట్‌ను లేవనెత్తి రాంప్రసాద్‌ను నామినేట్ చేశాడు.
చివరిగా వచ్చిన ఝాన్సీ.. అవసరానికి తగ్గట్టు మాట మార్చడంతో పాటు ఉమెన్ కార్డ్ వాడటం మానుకోవాలని చెబుతూ దేబ్జానీని నామినేట్ చేసింది. ఇక ముకేష్ సుధీర్‌ను టార్గెట్ చేశాడు. మరోవైపు ముకేష్ నామినేషన్‌లో బాగా డిజప్పయింట్ అయిన సుధీర్.. తప్పు తనదే అయితే హౌస్ నుంచి బయటకు వెళ్లడానికైనా రెడీ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇలా మాజీల ఎంట్రీతో నామినేషన్ల ప్రాసెస్ హౌస్‌లో పెద్ద మంటను రాజేసింది.





