Bigg BossJust EntertainmentLatest News

Krishnudu Eliminated : కృష్ణుడు ఔట్..నాగార్జున క్లాస్‌తో షేక్ అయిన బిగ్ బాస్ హౌస్..

Krishnudu Eliminated : కెప్టెన్సీ టాస్క్ టైమ్‌లో రోహిత్, వంశీ మధ్య నడిచిన హడావుడిని రీవైండ్ చేసిన నాగార్జున.. అక్కడ రోహిత్‌దే తప్పు ఉందని జడ్జిమెంట్ ఇచ్చేశారు.

Krishnudu Eliminated

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హ్యాంగోవర్ మామూలుగా ఉండటంలేదు. వీకెండ్ ఎపిసోడ్స్ అంటేనే హోస్ట్ నాగార్జున ఇచ్చే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, దానికి తోడు కంటెస్టెంట్‌ల మైండ్ గేమ్‌ల లెక్కలు తేల్చే అసలైన పంచాయితీ అని ఆడియన్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు.

ఈసారి వీకెండ్ ఎపిసోడ్ స్టార్టవడమే ఒక ఎమోషనల్ అట్మాస్ఫియర్‌తో స్టార్ట్ అయింది. దివంగత లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా తండ్రిని గుర్తుచేసుకుంటూ నాగ్ పంచుకున్న జ్ఞాపకాలు ఆడియన్స్ హార్ట్స్‌ను టచ్ చేశాయి.

ఆ తర్వాత హౌస్‌మేట్స్‌తో సరదా కబుర్లు, ఆటపాటలు, కాస్త సీరియస్ వార్నింగ్‌లతో ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ముఖ్యంగా లాస్ట్ వీక్ నుంచి నడుస్తున్న మ్యానిప్యులేటర్-పప్పెట్ గేమ్‌ను కంటిన్యూ చేసిన నాగ్.. హౌస్‌లో ఉన్నవాళ్ల ముసుగులను ఒక్కొక్కటీ బయటపెడుతున్నారు.దీనిలో నరేష్ .. త్రిగుణ్ మ్యానిప్యులేట్ చేస్తుంటే, వంశీ అతనికి పప్పెట్‌లా మారాడని చెప్పేశాడు.

ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే షాలినిపై నాగ్ బాగా ఫైర్ అయ్యారు. ప్రతిసారి కూడా ఆలస్యంగా రెడీ అవుతున్నావంటూ ..ఇంకోసారి ఇలాగే మేకప్ వంకతో లేట్ చేస్తే వన్ వీక్‌ అసలు మేకప్ వాడే ఛాన్సే లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.

ఆ తర్వాత వంశీ వంతు రాగా, వర్షిణి చేతిలో సుధీర్ పప్పెట్‌గా మారాడని తన అభిప్రాయం చెప్పాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ టైమ్‌లో రోహిత్, వంశీ మధ్య నడిచిన హడావుడిని రీవైండ్ చేసిన నాగార్జున.. అక్కడ రోహిత్‌దే తప్పు ఉందని జడ్జిమెంట్ ఇచ్చేశారు.

ఇక ఎలిమినేషన్స్ విషయానికి వస్తే.. వర్షిణి, సుధీర్, సృష్టి, త్రిగుణ్, కృష్ణుడు, రోహిత్ నామినేషన్స్‌లో ఉండగా.. మొదటగా రోహిత్ సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్లు నాగ్ చెప్పారు. ఆ తర్వాత అమన్ .. వర్షిణి మ్యానిప్యులేటర్ అని, సుధీర్ పప్పెట్ అని కామెంట్ చేయగా, ముకేశ్ .. త్రిగుణ్ తోలుబొమ్మలా వంశీని ఆడిస్తున్నాడని చెప్పాడు.

తర్వాత నామినేషన్స్ నుంచి వర్షిణి కూడా సేవ్ అయిపోయి ఊపిరి పీల్చుకుంది. అలాగే సుధీర్ త్రిగున్-వంశీ జంటపైనే వేలు చూపిస్తే, త్రిగుణ్ మాత్రం రివర్స్‌లో ముకేశ్ వెనక వర్షిణి ఆడుతోందని అన్నాడు

కెప్టెన్సీ టాస్క్ టైమ్‌లో ప్లే చేసిన సింహం-నక్కలు పాట టాపిక్ రాగా, త్రిగుణ్ గురించి నరేష్ సరదా రివ్యూ ఇచ్చి హౌస్‌లో నవ్వులు పూయించాడు. ఈ గ్యాప్‌లోనే ముకేశ్, రోహిత్ కలిసి త్రిగుణ్ హౌస్‌లో పెద్ద శకుని అని సీక్రెట్‌గా ప్రచారం మొదలుపెట్టేశారు. ఆ తర్వాత కృష్ణుడు తాను గేమ్ ఆడతానని చెప్పగా, వెంటనే నాగ్ స్పాట్‌ల్‌నే రోహిత్‌కి, కృష్ణుడికి నచ్చిన వాళ్లే నిజమైన శకునులు అంటూ ట్విస్ట్ ఇచ్చారు.

నామినేషన్స్ గండం నుంచి సృష్టి, కృష్ణుడు, సుధీర్, త్రిగుణ్ ముగ్గురిలో ముందు త్రిగుణ్ సేఫ్ అవ్వడంతో ఎలిమినేషన్ రేస్ మరింత ఆసక్తికరంగా మారింది.

ఆ తర్వాత హౌస్ అట్మాస్పియర్ మారడానికి నాగ్ సండే ఫన్ డే టాస్క్‌లు ఇచ్చారు . కంటెస్టెంట్స్‌ను రెండు గ్రూపులుగా డివైడ్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్ పంచమన్నారు. ఝాన్సీ తన సాంగ్‌తో మెప్పించగా, త్రిగుణ్ అండ్ అమన్ బిగ్ బాస్ మీదే రైమింగ్ సాంగ్‌తో నవ్వించారు.

తర్వాత ముకేశ్, దేబ్జానీ కలసి వేసిన రొమాంటిక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బిగ్ బాస్ ఇంటి సభ్యులనే కాదు, ఆడియన్స్‌ను కూడా షాక్ అయ్యేలా చేసింది. వీరి తర్వాత చరణ్, వర్షిణి కిక్కిచ్చే మాస్ డ్యాన్స్‌తో హౌస్‌ను ఊపేసారు.

అంతా సరదాగా సాగుతుండగా మళ్లీ నామినేషన్స్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. సుధీర్ సేఫ్ అయ్యాడని కృష్ణుడు ఎలిమినేట్(Krishnudu Eliminated) అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో కృష్ణుడు ఈ వీక్ హౌస్ నుంచి వీడ్కోలు తీసుకుని బయటకు రావాల్సి వచ్చింది. అందరూ ఎమోషనల్ అవుతూ సెండ్ ఆఫ్ ఇచ్చారు.

దీనికి తాను ముందే అనుకున్నా అని.. తాను సరిగ్గా ప్లే చేయలేకపోతున్నానని, పర్సనల్‌గా హెల్త్ సమస్యలు కూడా ఇబ్బంది పెడుతున్నాయని, అందుకే వెళ్లిపోవడమే మంచిదంటూ కృష్ణుడు(Krishnudu Eliminated) ఎమోషనల్ అయ్యాడు. స్టేజ్ పైకి వచ్చాక నాగార్జున ఆయనతో హౌస్‌లోని నలుగురు పాజిటివ్, నలుగురు నెగిటివ్ పీపుల్ ఎవరని అడగ్గా.. దేబ్జానీ, సృష్టి, అమన్, ఝాన్సీని పాజిటివ్‌గా, సుధీర్,ముకేశ్,చరణ్,వర్షిణిని నెగిటివ్‌గా మార్క్ చేశాడు.

Krishnudu Eliminated
Krishnudu Eliminated

ఇక ఎపిసోడ్ లాస్ట్‌లో హౌస్‌లో బెస్ట్ ప్లేయర్ ఎవరనే పోల్ పెట్టగా వర్షిణి, రామ్ ప్రసాద్, సుధీర్, ఝాన్సీతో పాటు ఎక్కువమంది ముకేశ్ పేరునే చెప్పారు. మెజారిటీ ఓటింగ్ తెచ్చుకున్న ముకేశ్‌కి ఈ వారం బిగ్ బాస్ బెస్ట్ ప్లేయర్ స్టార్ బ్యాడ్జ్ దక్కింది.

ఈ వీకెండ్ రసవత్తర వార్ ఇలా ముగియగా, రాబోయే థర్డ్ వీక్‌లో టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్’పేరుతో కొత్త టాస్క్‌లు ఊపేయబోతున్నాయని నాగ్ ముందే అనౌన్స్ చేశారు. మరి మండే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య నామినేషన్స్ మంటలు ఏ స్థాయిలో మండుతాయో చూడాలి.

Prometheus : మానవ నాగరికత కంటే ముందే పుట్టిన చెట్టు..4,900 ఏళ్ల చరిత్ర ఒకే ఒక్క రోజులో ముగింపు..

Related Articles

Back to top button