Just EntertainmentLatest News

Vijay: దళపతి విజయ్‌కు వరుస షాకులు..

Vijay : విజయ్‌కు అటు కుటుంబం నుంచి, ఇటు ఇండస్ట్రీ నుంచి ఊహించని షాకులు తగులుతుండటం ఫ్యాన్స్‌లో ఆందోళనకు గురిచేస్తోంది.

Vijay

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ ప్రస్తుతం తన లైఫ్‌లో చాలా టఫ్ సిచ్యువేషన్‌ ఎదుర్కొంటున్నారు. అటు రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన పర్సనల్, సినీ లైఫ్‌లో వరుసగా ఎదురవుతున్న పరిణామాలు ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఆయనకు అటు కుటుంబం నుంచి, ఇటు ఇండస్ట్రీ నుంచి ఊహించని షాకులు తగులుతుండటం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

ముఖ్యంగా విజయ్(Vijay) కుమారుడు జాసన్ సంజయ్ తీసుకున్న డెసిషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తన తండ్రి పేరులోని మొదటి అక్షరం V ని తొలగించి.. తన తల్లి సంగీత పేరులోని S ని చేర్చుకుని.. విజయ్ పట్ల తన నిరసనను ఓపెన్‌గానే చాటుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో తండ్రిని అన్‌ఫాలో చేసిన సంజయ్, ఇప్పుడు పేరు మార్పుతో తన దారి వేరని క్లారిటీ ఇచ్చేశారు.

ఓ వైపు కుటుంబ కలహాలు ఇలా ఉండగా, విజయ్ నటించిన చివరి మూవీగా ప్రచారం పొందుతున్న జననాయగన్ చుట్టూ కూడా సమస్యలు ముసురుకున్నాయి. నిజానికి ఈ మూవీ 2026 సంక్రాంతి బరిలో నిలవాల్సింది. కానీ సెన్సార్ పరమైన అడ్డంకులు, ఇతర కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది.

ప్రస్తుతం రివైజింగ్ కమిటీ పరిశీలనలో ఉన్న ఈ జననాయగన్ మూవీ రిలీజ్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ నుంచి ..ఈ మూవీ ప్రొడ్యూసర్లకు గట్టి దెబ్బ తగిలిందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం కుదుర్చుకున్న సుమారు 120 కోట్ల రూపాయల భారీ డీల్‌ను అమెజాన్ రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూవీ రిలీజ్‌పై క్లారిటీ లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సినీ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ మూవీ నిర్మాతలు భారీ మొత్తంలో ఆర్థిక నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది.

Vijay
Vijay

మరోవైపు విజయ్ (Vijay) పర్సనల్ లైఫ్ కూడా వివాదాలతో సతమతమవుతోన్న సంగతి తెలిసిందే. తన భార్య సంగీతతో డైవోర్స్ వ్యవహారం కోర్టు మెట్లెక్కడం, మరో నటితో విజయ్‌కు ఉన్న సంబంధాలే దీనికి రీజన్‌ అని వస్తున్న వార్తలు ఆయన ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. రాజకీయాల్లో బలంగా తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న సమయంలో, ఈ స్థాయిలో సమస్యలు చుట్టుముట్టడం విజయ్‌కు పెద్ద ఛాలెంజింగ్‌గా మారింది.

కాగా ఈ నెల ఏప్రిల్ 20న విజయ్ డైవోర్స్ విషయంలో కోర్టు విచారణలో ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అటు తన లాస్ట్ మూవీ రిలీజ్‌తో పాటు ఇటు పొలిటికల్ ఫ్యూచర్, మరోవైపు విచ్ఛిన్నమవుతున్న కుటుంబ బంధం.. ఇలా అన్ని వైపుల నుంచి విజయ్‌ పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఈ వివాదాల సుడిగుండం నుంచి విజయ్ ఎలా బయటపడతారన్న విషయంతో పాటు .. రాబోయే ఎన్నికల్లో తమిళనాడు ప్రజల నుంచి ఎటువంటి మద్దతు పొందుతారో వేచి చూడాల్సిందే.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button