Mega House : మెగా రాయల్ హౌస్ ఇంటీరియర్స్ చూస్తే మైండ్ బ్లాకే ..జూబ్లీహిల్స్ ఇంద్రభవనం విశేషాలు
Mega : ఈ లగ్జరీ హౌస్‌లోనే రామ్ చరణ్ ... మెగాస్టార్ చిరంజీవి, సురేఖతో పాటు భార్య ఉపాసన, పిల్లలతో కలిసి ఉంటున్నారు.సుమారు 25,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మించబడింది
Mega House
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు సక్సెస్ ఎంజాయ్ చేస్తూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా డైరెక్షన్లో వచ్చిన ఆయన లేటెస్ట్ మూవీ పెద్ది బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. రిలీజైన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ ఏకంగా రూ.345 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఒకవైపు మూవీ ఇలా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతూ ఉంటే.. మరోవైపు రామ్ చరణ్ లగ్జరీ లైఫ్ స్టైల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లోని మోస్ట్ పాష్ ఏరియా అయిన జూబ్లీహిల్స్‌లో రామ్ చరణ్‌కు ఒక అద్భుతమైన లగ్జరీ ఇల్లు ఉందన్న విషయం తెలిసిందే.
ఈ లగ్జరీ హౌస్‌లోనే రామ్ చరణ్ … మెగాస్టార్ చిరంజీవి, సురేఖతో పాటు భార్య ఉపాసన, పిల్లలతో కలిసి ఉంటున్నారు.సుమారు 25,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఈ ఇల్లు నిర్మించబడింది. హైదరాబాద్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ సెలబ్రిటీ హోమ్‌గా దీనిని చెప్పుకుంటారు.
చిరంజీవి ఇంటిని కేవలం లగ్జరీ కోసమే కాకుండా.. ఫ్యామిలీ మెంబర్స్ ప్రైవసీకి, కంఫర్ట్‌కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఎంతో ప్లాన్డ్గా డిజైన్ చేశారు. ఇంటి బయట నుంచి చూస్తే వైట్ కలర్ కాంబినేషన్‌తో, చుట్టూ ఉన్న గ్రీనరీతో ఇల్లు ఎంతో ప్రశాంతంగా, క్లాస్‌గా కనిపిస్తుంది.
అందమైన గార్డెన్ ఏరియా మెగా ఇంటికి ఒక ఫ్రెష్ లుక్‌ను ఇస్తుంది. లోపలికి వెళ్తే మోడ్రన్ టెక్నాలజీతో పాటు రాజభవనాన్ని తలపించే రాయల్ లుక్ మనకు కనిపిస్తుంది. గోడలకు వాడిన లైట్ కలర్స్ ఇంటీరియర్స్ కు, ఈ ఇంటికి లగ్జరీ లుక్‌ను తీసుకొచ్చాయి.
ఇక లివింగ్ రూమ్‌లోకి అడుగు పెట్టగానే చెస్ బోర్డు (Chessboard) వంటి డిజైన్‌తో మెరిసిపోయే మార్బుల్ ఫ్లోరింగ్ అలాగే ప్రీమియం ఫర్నిచర్, పెద్ద పెద్ద షాండ్లియర్స్ మనల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి.
ఇంటి మెయిన్ హాల్‌కు ఆపోజిట్‌గా పెద్ద పెద్ద విండోస్, ఫ్రెంచ్ డోర్స్ పెట్టడం వల్ల రోజంతా ఇంట్లోకి నేచురల్ లైటింగ్, స్వచ్ఛమైన గాలి వస్తుంటాయి. ఇంట్లో ఉండే మల్టిపుల్ బాల్కనీలు ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్‌ను ఇస్తాయి. అలాగే గోడలపై ఉన్న ఆర్ట్ పెయింటింగ్స్ మెగా(Mega House) ఫ్యామిలీ టేస్ట్‌ను ప్రతిబింబిస్తాయి.
కేవలం లగ్జరీ మాత్రమే కాదు.. హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌కూ ఈ ఇంట్లో టాప్ ప్రయారిటీ కనిపిస్తుంది. ఉడెన్ ఫ్లోరింగ్‌తో అన్ని హంగులు ఉన్న ఒక పెద్ద హైటెక్ జిమ్‌తో పాటు అలాగే బయటకి వెళ్లకుండానే ఆడుకునేలా ఒక టెన్నిస్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయి.
సినీ ఇండస్ట్రీతో ఇంతటి బలమైన అనుబంధం ఉన్న ఫ్యామిలీ కాబట్టి.. అందరూ కలిసి సినిమాలు చూడటానికి వీలుగా ఒక ప్రైవేట్ హోమ్ థియేటర్ కూడా దీనిలో సెట్ చేశారు.

ప్రశాంతంగా కూర్చుని బుక్స్ చదువుకోవడానికి ఒక స్టడీ రూమ్, అలాగే అఫీషియల్ వర్క్స్ చేసుకోవడానికి వీలుగా న్యూట్రల్ కలర్ కాంబినేషన్లతో ఒక స్పెషల్ వర్క్ స్పేస్ కూడా ఉంది.
వీటన్నింటితో పాటు మెగా ఫ్యామిలీ యొక్క ఆధ్యాత్మిక విలువలను చాటిచెప్పేలా ఇంట్లో ఒక ప్రశాంతమైన పూజ గదిని కూడా ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు.
సింపుల్‌గా చెప్పాలంటే,ఈ మెగా స్టార్స్ జూబ్లీహిల్స్ ప్యాలెస్(Mega house) కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు.. రాయల్ లుక్, మోడ్రన్ ఫెసిలిటీస్ కలగలిసిన ఒక అద్భుతమైన కళాఖండం అనే చెప్పుకోవాలి..
Peddi Collections : థియేటర్లలో తిరుగులేని రియల్ ఛాంపియన్..ఆగని పెద్ది కలెక్షన్ల సునామీ





