NBK 111 : బాలయ్య బర్త్ డే బ్లాస్టర్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న NBK 111 గ్లింప్స్
NBK 111 : బాలకృష్ణ మూవీలన్నింటి కంటే పూర్తిగా భిన్నంగా, సరికొత్త న్యూ-ఏజ్ స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్గా NBK 111 మూవీ రూపుదిద్దుకుంటోంది
NBK 111
నందమూరి నటసింహం బాలకృష్ణ క్రేజ్, ఆయన మూవీలకు ఉండే మాస్ ఫాలోయింగ్ గురించి టాలీవుడ్లో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం బాలయ్య వరుస విజయాలతో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నారు.
గతంలోనే అఖండ, అఖండ 2 వంటి భారీ బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న బాలకృష్ణ, ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ తర్వాత మరోసారి బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్ సెట్ అవ్వడంతో నందమూరి ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా బాలయ్య బర్త్ డే కానుకగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ (NBK 111) కి సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేయగా, అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
బాలకృష్ణ మూవీలన్నింటి కంటే పూర్తిగా భిన్నంగా, సరికొత్త న్యూ-ఏజ్ స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా ముంబై మాఫియా లేదా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్టోరీ సాగుతుందని తాజాగా వచ్చిన గ్లింప్స్ చూస్తే క్లారిటీగా అర్థమవుతోంది.
దీనిలో బాలకృష్ణ లుక్ అత్యంత పవర్‌ఫుల్‌గా, ట్రెండీగా డిజైన్ చేశారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో బాలయ్యను స్క్రీన్ మీద ఎలివేట్ చేసిన విధానం ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఆకట్టుకుంటోంది. కొన్ని సెకన్ల డ్యురేషన్ మాత్రమే ఉన్న ఈ వీడియోనే థియేటర్లలో ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయం అనేలా విజువల్స్ ఉన్నాయి.
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ సరసన గ్లామరస్ బ్యూటీక్వీన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, వైవిధ్యభరిత నటుడు మంచు మనోజ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.

బాలకృష్ణ సినిమాలకు తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అదిరిపోయే లెవెల్ ఎనర్జీ ఇచ్చిన.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ మూవీకి మ్యూజిక్‌ను అందిస్తున్నారు. గ్లింప్స్‌లో వినిపించిన థమన్ బీజీఎం వేరే లెవెల్లో ఉండి వీడియో రేంజ్‌ను మార్చేసింది. మొత్తానికి NBK 111 గ్లింప్స్ బాలయ్య ఫ్యాన్స్‌కు ఒక ఊరమాస్ బర్త్ డే ట్రీట్ అని చెప్పాలి.
బాలకృష్ణ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ ఇండస్ట్రీలో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు టైటిల్‌ను కూడా అఫీషియల్‌గా ప్రకటించడానికి మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది.
Dagadarthi Airport : ఆంధ్రా ప్రజలకు గుడ్ న్యూస్..దగదర్తి ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర అనుమతులు క్లియర్





