Just Andhra PradeshJust PoliticalLatest News

Dagadarthi Airport : ఆంధ్రా ప్రజలకు గుడ్ న్యూస్..దగదర్తి ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర అనుమతులు క్లియర్

Dagadarthi Airport : నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని దగదర్తి దగ్గరలో ఈ సరికొత్త ఎయిర్‌పోర్ట్ రూపుదిద్దుకోనుంది. ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు 1,400 ఎకరాల భూమిని కేటాయించింది

Dagadarthi Airport

ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌పోర్ట్ రంగాన్ని స్ట్రాంగ్ చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా నెల్లూరు జిల్లా ప్రజల ఎన్నోఏళ్ల నాటి నిరీక్షణకు తెరదించుతూ దగదర్తి ఎయిర్ పోర్ట్(Dagadarthi Airport) నిర్మాణానికి సర్వం సిద్ధం చేసింది.

ప్రజా ట్రాన్స్‌పోర్ట్ మెరుగుపడటంతో పాటు లోకల్ ఇండస్ట్రియల్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఈ ఎయిర్‌పోర్ట్ ఎంతగానో ఉపయోగపడబోతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను మరో 10 రోజుల్లోనే ముగించి, కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థకు నిర్మాణ బాధ్యతలను అప్పగించడానికి అధికార యంత్రాంగం వేగంగా చర్యలు తీసుకుంటోంది.

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని దగదర్తి దగ్గరలో ఈ సరికొత్త ఎయిర్‌పోర్ట్ రూపుదిద్దుకోనుంది. ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు 1,400 ఎకరాల భూమిని కేటాయించింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (PPP) మోడల్‌లో సుమారు రూ. 648 కోట్ల భారీ అంచనా వ్యయంతో దీనిని నిర్మించబోతున్నారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైంది. టెండర్లు దాఖలు చేయడానికి జూన్ 12ను లాస్ట్ డేట్‌గా నిర్ణయించగా, జూన్ 17న టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లను ఓపెన్ చేయబోతున్నారు. ఈ బిడ్డింగ్‌లో అర్హత సాధించిన లక్కీ కంపెనీకి కేవలం 15 రోజుల్లోనే పనుల కేటాయింపు ప్రాసెస్ పూర్తి చేసి బాధ్యతలను అప్పగిస్తారు.

ఈ దగదర్తి ఎయిర్‌పోర్ట్(Dagadarthi Airport) ప్రాజెక్టుకు కేంద్ర హోంశాఖతో పాటు పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల నుంచి ఇప్పటికే అన్ని రకాల క్లియరెన్సులు, పర్మిషన్లు లభించాయి. టెండర్ల ప్రక్రియ క్లోజ్ అయిన వెంటనే గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ స్టార్ట్ చేసి, 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికే ఫస్ట్ పేజ్‌లో కంప్లీట్ చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టుకుంది. ఈ ఫస్ట్ ఫేజ్‌లోనే మెయిన్ రన్‌వే, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, కార్ పార్కింగ్, కస్టమర్ల కోసం షాపింగ్ ఏరియా వంటి లేటెస్ట్ మౌలిక వసతులను సిద్ధం చేయనున్నారు.

Dagadarthi Airport
Dagadarthi Airport

ఈ సరికొత్త ఎయిర్‌పోర్ట్ గనుక అందుబాటులోకి వస్తే కేవలం నెల్లూరు వాసులకే కాకుండా, పొరుగున ఉన్న ప్రకాశం, కడప జిల్లాల ప్రజలకు కూడా ప్రయాణ పరంగా ఎంతో బెనిఫిట్ కలగనుంది.

రోజుకు సుమారు 2,200 మంది ప్యాసింజర్లు ఇక్కడి నుంచి సేవలందుకునేలా చేయడంతో పాటు.. అలాగే డైలీ 27 విమానాలు రాకపోకలు సాగించేలా లేటెస్ట్ హంగులతో ఈ ఎయిర్‌పోర్ట్‌ను డిజైన్ చేస్తున్నారు. దగదర్తి ఎయిర్‌పోర్ట్ గాల్లోకి లేస్తే దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతి, లోకల్ యూత్‌కు ఉపాధి అవకాశాలు సరికొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Narendra Modi : నరేంద్ర మోదీ సరికొత్త రికార్డ్.. నెహ్రూ సుదీర్ఘ రికార్డు బద్దలు

Related Articles

Back to top button