Peddi : 9 రోజుల్లోనే పెద్ది సృష్టించిన అరాచకం .. 400 కోట్ల క్లబ్ వైపు చరణ్ మాస్ ర్యాంపేజ్..
Peddi : ఈ క్రేజీ వసూళ్లతో ఈ ఏడాది సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన నంబర్ వన్ మూవీగా పెద్ది నిలిచింది
Peddi
థియేటర్లలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ మాస్ సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవ్వాల్సిందే అన్నట్లుగా సీన్ కనిపిస్తోంది. బుచ్చిబాబు సానా డైరెక్షన్లో చరణ్ నటించిన పెద్ది(Peddi)మూవీ థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 4న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ, ఫస్ట డే నుంచే ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.
థియేటర్లకు జనాలు క్యూ కడుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తోంది. జూన్ 13 నాటికి ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా 9 రోజులు పూర్తి చేసుకుంది. ఈ తొమ్మిది రోజుల్లోనే ఈ చిత్రం ట్రేడ్ వర్గాల ఊహకు అందని రీతిలో భారీ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను తిరగరాసింది.
కేవలం 9 రోజుల్లోనే పెద్ది(Peddi) మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా రూ. 366 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ క్రేజీ వసూళ్లతో ఈ ఏడాది సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన నంబర్ వన్ మూవీగా పెద్ది నిలిచింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
మూవీ చూసిన ప్రతి ఒక్కరూ రామ్‌చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు టేకింగ్ అదిరిపోయాయని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదే ఊపు కొనసాగితే మరో 2,3 రోజుల్లోనే ఈ మూవీ చాలా ఈజీగా 400 కోట్ల క్లబ్లో చేరిపోవడం గ్యారెంటీ అని సినీ క్రిటిక్స్ గట్టిగా చెబుతున్నారు. వీకెండ్స్ రాబోతుండటంతో కలెక్షన్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా ఈ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ఇక జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, రవి కిషన్ లాంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించి సినిమా రేంజ్‌ను పెంచేశారు. మొత్తానికి రామ్‌చరణ్ బాక్సాఫీస్ దగ్గర రేపిన ఈ పెద్ది(Peddi) తుపాన్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదన్న టాక్ నడుస్తోంది.
#Peddi is SOUTH INDIA'S NO.1 GROSSER OF 2026 🔥🔥
— PEDDI (@PeddiMovieOffl) June 13, 2026
Collects a gross of over 366 CRORES WORLDWIDE in 9 days ❤🔥
🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/hVo5QJIBaQ
TTD : శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేస్తున్నారా? టీటీడీ రిలీజ్ చేసిన కొత్త అప్డేట్ ఇదే..





