HealthLatest News

Antibiotics : ఫీవర్ రాగానే యాంటీబయాటిక్ మింగుతున్నారా?..అది మీ ఒంటికి డేంజరస్ పాయిజన్ అని తెలుసా

Antibiotics : ఫీవర్ అనేది ఒక జబ్బు కాదు, అది బాడీలో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పడానికి మన బాడీ ఇచ్చే ఒక వార్నింగ్ సిగ్నల్ మాత్రమే.

Antibiotics

వర్షాకాలం స్టార్ట్ అవగానే చాలామందిని జ్వరం, జలుబు, తగ్గని నీరసం వేధిస్తున్నాయని చాలామంది చెబుతారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరిగిపోయి డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటివి విజృంభిస్తే.. మరోవైపు గాలిలోని తేమ వల్ల ఫ్లూ, టైఫాయిడ్, లెప్టోస్పిరోసిస్, స్క్రబ్ టైఫస్ వంటి వైరల్ అండ్ ఇన్ఫెక్షన్లు దండెత్తుతాయి.

అయితే, ఒళ్లు కాస్త వేడిగా అనిపించగానే కంగారుపడి మెడికల్ షాప్‌కి పరిగెత్తి యాంటీబయాటిక్స్(Antibiotics) మింగే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఫీవర్ అనేది ఒక జబ్బు కాదు, అది బాడీలో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పడానికి మన బాడీ ఇచ్చే ఒక వార్నింగ్ సిగ్నల్ మాత్రమే . అందుకే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా జ్వరం రాగానే యాంటీబయాటిక్స్ ఎడాపెడా వాడితే, అది మీ ఇమ్యూన్ సిస్టమ్‌ను నాశనం చేసే పెద్ద ప్రమాదంగా మారుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ గట్టిగా హెచ్చరిస్తున్నారు.

రెయినీ సీజన్‌లో వచ్చే ఏ ఫీవర్‌కైనా స్టార్టింగ్‌లో ఒకే లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ ఒక్కో వ్యాధికి ఇచ్చే ట్రీట్మెంట్ ప్రాసెస్ వేరుగా ఉంటుంది. త్వరగా రికవరీ అవ్వాలనే ఆత్రంలో చాలామంది హై డోస్ యాంటీబయాటిక్స్ వేసుకుని.. ఫీవర్ చిటికెలో తగ్గిపోవాలని అనుకుంటారు.

మెడికల్ షాపుల్లో డాక్టర్ చీటీ లేకుండానే ఈ మెడిసిన్స్ అన్నీ ఈజీగా దొరకడం, ఇంట్లో పాతవి, మిగిలిపోయిన పిల్స్ ఉండటంతో జనాలు వీటిని ఎడాపెడా వాడుతున్నారు. నిజానికి యాంటీబయాటిక్స్ అనేవి కేవలం బ్యాక్టీరియాని చంపడానికి పనిచేసే మెడిసిన్స్ మాత్రమే.

వైరస్‌ల వల్ల వచ్చే ఫ్లూ, డెంగ్యూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లపై ఇవి అస్సలు పనిచేయవు. బ్యాక్టీరియా తీవ్రత, బాడీ కండిషన్‌ని బట్టి ఏ యాంటీబయాటిక్(Antibiotics) ఇవ్వాలో డాక్టర్లు డిసైడ్ చేస్తారు. అంతే తప్ప అన్నింటికీ కూడా ఒకటే టాబ్లెట్ వాడకూడదు. మలేరియాకు యాంటీమలేరియల్ డ్రగ్స్ మాత్రమే పని చేస్తాయి.

డాక్టర్ సలహా లేకుండా సొంతంగా ఇలాంటివి వాడటం వల్ల వాంతులు, వికారాలు, తీవ్రమైన కడుపునొప్పి, మోషన్స్, అలర్జీలు వంటివి రావొచ్చు. ఇవన్నీ ఒకెత్తయితే, ఈ అలవాటు వల్ల యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) అనే డేంజరస్ ప్రాబ్లెమ్ వస్తుంది. అంటే మన ఒంట్లోని బ్యాక్టీరియా ఈ మెడిసిన్స్‌కు అలవాటు పడిపోయి, స్ట్రాంగ్‌గా మారిపోతుంది.

దీనివల్ల ఫ్యూచర్‌లో నిజంగా ఏదైనా సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏ యాంటీబయాటిక్ కూడా బాడీపై పనిచేయదు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా యాంటీబయాటిక్స్ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Antibiotics
Antibiotics

అందుకే ఫీవర్ వచ్చిన వెంటనే కంగారుపడి ఇష్టం వచ్చినట్లుగా టాబ్లెట్లు మింగకుండా, ముందు బాడీకి మంచి రెస్ట్ ఇవ్వాలి. కొబ్బరినీళ్లు, నీళ్లు, సూప్‌ల రూపంలో లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. సాధారణ వైరల్ జ్వరాలు 3 నుంచి 5 రోజుల్లో అవే తగ్గుతాయి.

ఒకవేళ ఫీవర్ 3 రోజులు అయినా తగ్గకుండా ఉన్నా, శ్వాస ఆడకపోవడం, ఆగకుండా వాంతులు, కడుపునొప్పి, బ్లీడింగ్, యూరిన్ తగ్గిపోవడం, విపరీతమైన కండరాల నొప్పులు వంటివి ఉంటే మాత్రం వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి సీబీసీ, డెంగ్యూ ఎన్‌ఎస్1 వంటి బ్లడ్ టెస్టులన్నీ చేయించుకోవాలి. మెయిన్‌గా ప్రోపర్ డయాగ్నోసిస్ లేకుండా సొంత వైద్యం చేసుకోవడమనేది ఎప్పుడూ కూడా ప్రాణాల మీదికే తెస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Mammogram : మామోగ్రామ్స్ వెనుక మెడికల్ మాఫియా ఉందా?..బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టులపై వైరల్ అవుతోన్నపోస్టులపై నిజాలేంటి?

Related Articles

Back to top button