Diabetes : నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? డయాబెటిస్‌కు, నిద్రకు ఉన్న లింక్ తెలిస్తే షాకే..
Diabetes : వైద్య రంగంలో జరిగిన తాజా పరిశోధనల ప్రకారం.. ఎవరైనా సరే కేవలం 4 రోజుల పాటు సరిగ్గా నిద్రపోకపోయినా , వారి నిద్రలో నాణ్యత లోపించినా సరే బాడీలో ఇన్సులిన్ నిరోధకత పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి
Diabetes
చాలామంది రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేనప్పుడు.. ఉదయాన్నే విపరీతమైన నీరసంగా అన్పించడం, ఆకలిగా అనిపించడం జరుగుతున్నా కూడా.. దాన్ని ఒక సాధారణ అలసటగా భావించి లైట్ తీసుకుంటారు. కానీ వైద్యులు మాత్రం ఇలాంటి లక్షణాలను మీ శరీరం మీకు పంపుతున్న ముందస్తు హెచ్చరికలుగా పరిగణించాలని చెప్తున్నారు.
వైద్య రంగంలో జరిగిన తాజా పరిశోధనల ప్రకారం.. ఎవరైనా సరే కేవలం 4 రోజుల పాటు సరిగ్గా నిద్రపోకపోయినా , వారి నిద్రలో నాణ్యత లోపించినా సరే బాడీలో ఇన్సులిన్ నిరోధకత పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితి కనుక ఇలాగే ముదిరితే అది భవిష్యత్తులో ఒబెసిటీ, మధుమేహం(Diabetes) వంటి దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
మనం రాత్రి సమయంలో ప్రశాంతంగా గాఢ నిద్రలో ఉన్నపుడే మన శరీరం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించే ప్రక్రియను మెల్లగా సాగిస్తుంది. అయితే ఎప్పుడైతే మన నిద్రకు భంగం కలుగుతుందో, అప్పుడు ఈ సహజ ప్రక్రియ కంప్లీట్‌గా స్తంభించిపోతుంది.
దీనివల్ల బాడీలోని కణాలు ఇన్సులిన్ హార్మోన్‌కు సరిగ్గా రెస్పాండ్ అవ్వవు. దీంతో గ్లూకోజ్.. కణాల్లోకి చేరలేక రక్తంలోనే ఎక్కువ కాలం నిలిచిపోతుంది. మెడికల్ టెర్మినాలజీలో ఇలా గ్లూకోజ్ బ్లడ్‌లోనే నిలిచిపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది భవిష్యత్తులో డయాబెటిస్(Diabetes) వ్యాధి రావడానికి, పెరగడానికి కూడా ప్రధాన కారణం అవుతుంది.
ఇక రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోని వారికి ఉదయం లేచిన వెంటనే విపరీతంగా ఆకలి వేయడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. నిద్ర లేకపోవడం వల్ల ఒంట్లో ఆకలిని, తృప్తిని కంట్రోల్ చేసే ఘ్రెలిన్, లెప్టిన్ అనే హార్మోన్ల బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింటుంది.
అందుకే ఉదయం లేచిన వెంటనే విపరీతమైన ఆకలి వేయడంతో పాటు, సాధారణ ఆహారం కంటే ఎక్కువగా తీపి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఉన్న జంక్ ఫుడ్స్ తినాలనే క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్నప్పుడు ఆటోమేటిక్‌గా బ్లడ్ షుగర్ లెవెల్స్ మరింత అస్థిరంగా మారిపోతాయి.
ఈ నిద్రలేమి సమస్య మెటబాలిజంపై చూపే నెగెటివ్ ఇంపాక్ట్‌ను కొన్ని స్పష్టమైన లక్షణాల ద్వారా గుర్తించొచ్చు. రోజంతా అలసటగా ఉండటం, మధ్యాహ్నం సమయానికి ఒంట్లో ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయినట్లు అన్పించడం, స్వీట్స్ తినాలనే కోరిక పెరగడం, డైట్ కంట్రోల్లో ఉన్నప్పుడు వెయిట్ తగ్గకపోవడం సరికదా ఇంకా బరువు పెరిగిపోతుండటం వంటివి జరిగితే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలి.
ముఖ్యంగా రాత్రి షిఫ్ట్‌లలో పనిచేసే ఉద్యోగులు,లేట్ నైట్ పడుకునేవాళ్లు, ఎప్పుడూ విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొనేవారు, ఫ్యామిలీలో ఆల్రెడీ డయాబెటిస్(Diabetes) హిస్టరీ ఉన్నవారు ఈ విషయంలో చాలా కేర్ ఫుల్‌గా ఉండాలి.

ఈ రిస్క్ నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిద్రపోవడమనేది చాలా చాలా అవసరం. ప్రతిరోజూ పడుకునే సమయం అలాగే లేచే సమయం ఒకేలా ఉండేటట్టుగా మెయింటైన్ చేయాలి.
నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందే మొబైల్, ల్యాప్‌టాప్ వంటి డిజిటల్ స్క్రీన్లకు దూరంగా ఉండేలా అలవాటు చేసుకోవాలి. అలాగే రాత్రిపూట లేట్ నైట్ డిన్నర్ అలాగే, హెవీ డిన్నర్స్ చేయకుండా లైట్ ఫుడ్ తీసుకోవడం వంటివి చేయాలి.
TMC : బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ బాంబ్..40 ఏళ్ల నమ్మకస్తుడి సంచలన రాజీనామా వెనుక ఏం జరిగింది?





