Sunscreen : ఎస్పీఎఫ్ 30, ఎస్పీఎఫ్ 50 ఏది బెటర్? మీ స్కిన్‌కి ఏ సన్‌స్క్రీన్ సెట్ అవుతుంది?
Sunscreen : ఎస్పీఎఫ్ 30 , ఎస్పీఎఫ్ 50 లలో ఏది బెస్ట్ అనే కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. నిజానికి ఎస్పీఎఫ్ నెంబర్ పెరిగే కొద్దీ సన్ ప్రొటెక్షన్ పెరుగుతుందనేది నిజమే
Sunscreen
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్లో లేక మనకున్న ఐడియా వల్లో కానీ, సన్‌స్క్రీన్(Sunscreen) బాటిల్‌పై ఎస్పీఎఫ్ నెంబర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది అనే ఫిక్స్డ్ మైండ్‌సెట్‌తో మనమంతా ఉంటాం.
మార్కెట్లో కనిపించే సన్‌స్క్రీన్(Sunscreen) లోషన్లలో ఎస్పీఎఫ్ 30 , ఎస్పీఎఫ్ 50 లలో ఏది బెస్ట్ అనే కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. నిజానికి ఎస్పీఎఫ్ నెంబర్ పెరిగే కొద్దీ సన్ ప్రొటెక్షన్ పెరుగుతుందనేది నిజమే.
అయితే ఆ రెండింటి మధ్య ఉన్న అసలైన తేడాను తెలుసుకుంటే మీ స్కిన్ టైప్ , లైఫ్‌స్టైల్‌కు తగ్గట్టుగా సరైన సన్‌స్క్రీన్ లోషన్‌ను ఎంచుకోవడం ఈజీ అవుతుందని నిపుణులు అంటున్నారు.
ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అని అర్థం. ఇది సూర్యుని నుంచి వచ్చే యూవీఏ, యూవీబీ కిరణాల నుంచి మన స్కిన్‌ను ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుందో తెలియజేస్తుంది. ఈ యూవీఏ, యూవీబీ కిరణాల వల్లే సాధారణంగా స్కిన్ క్యాన్సర్, సన్‌బర్న్ , చర్మంపై ముడతలు రావడం వంటి సమస్యలు వస్తాయి.
అయితే నిజానికి చాలామంది అనుకునే దానికి భిన్నంగా ఎస్పీఎఫ్ 30 ,ఎస్పీఎఫ్ 50 మధ్య ప్రొటెక్షన్ విషయంలో పెద్దగా తేడా ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఎస్పీఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ 97 శాతం యూవీబీ కిరణాలను అడ్డుకుంటే, ఎస్పీఎఫ్ 50 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ 98 శాతం కిరణాలను బ్లాక్ చేస్తుంది. అంటే ఈ రెండింటి మధ్య కేవలం ఒక్క శాతం మాత్రమే తేడా ఉంటుంది.
రోజూ ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లేవారికి , తక్కువ సమయం ఎండలో గడిపేవారికి ఎస్పీఎఫ్ 30 సరిపోతుంది. ఇది స్కిన్‌కి మంచి ప్రొటెక్షన్ ఇవ్వడమే కాకుండా ఫేస్‌పై చాలా లైట్‌వెయిట్‌గా అనిపిస్తుంది.
అందుకే మేకప్ కింద వేసుకోవడానికి కూడా ఎస్పీఎఫ్ 30 కంఫర్టబుల్‌గా ఉంటుంది. మార్కెట్లో చాలా ఈజీగా, తక్కువ బడ్జెట్లోనే దొరికే ఈ సన్‌స్క్రీన్ అన్ని రకాల చర్మతత్వాల వారికి సెట్ అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటూ డైలీ కేర్ ఆశించేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
మరోవైపు ఎస్పీఎఫ్ 50 సన్‌స్క్రీన్ లోషన్ అయితే ఎండలో ఎక్కువ గంటలు తిరిగే వారికి, స్విమ్మింగ్, బీచ్‌లకు వెళ్లేవారికి చాలా అవసరం. ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారికి , తెల్లగా ఉండి చర్మం త్వరగా కందిపోయే వారికి అంటే సన్‌బర్న్ అయ్యేవారికి ఇది ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది.

ఎస్పీఎఫ్ నెంబర్ ఎంత ఎక్కువగా ఉంటే అది అంత ఎక్కువ సమయం పనిచేస్తుందని అనుకోవడం ఒక పెద్ద అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. ఎస్పీఎఫ్ 30 అయినా, 50 అయినా ఎండలో ఉన్నప్పుడు ప్రతి రెండు గంటలకు ఒకసారి కచ్చితంగా మళ్లీ రాసుకోవాల్సిందే.
అలాగే స్విమ్మింగ్ చేసినా, బాగా చెమటలు పట్టి తుడుచుకున్నా కూడా సన్‌స్క్రీన్(Sunscreen)ను మళ్లీ అప్లై చేయాలి. ఎండలోకి వెళ్లే 15-20 నిమిషాల ముందే ముఖంతో పాటు చెవులు, మెడ, చేతులు, పాదాలకు కూడా లోషన్‌ను తగిన పరిమాణంలో అప్లై చేయాలి. సన్‌స్క్రీన్‌తో పాటు ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవడానికి గొడుగు, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్ వాడటాన్ని కూడా అలవాటు చేసుకోవాలి.
Mamata Banerjee : బెంగాల్ రాజకీయాల్లో కలకలం..మమతా బెనర్జీ ఇంట్లో సీఐడీ సోదాలు..





