HealthJust LifestyleLatest News

Health:మీరు తినే ఆహారమే.. మీ ఆరోగ్యం

Health:సరైన ఆహారంతో మన శరీరం ఆరోగ్యంగా ఉంటే, మనసు కూడా ఉత్సాహంగా ఉంటుంది.

Health

ఆహారం కేవలం కడుపు నింపడానికి మాత్రమే కాదు, మన శరీరానికి, మెదడుకు శక్తినిచ్చే ఇంధనం. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది, అండ్ మనసు ప్రశాంతంగా ఉంటుంది.

  • అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బరువు పెరగడం, అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే సమతుల్యమైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
  • రోజూ వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. వీటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి.
Health
Health
  •  కండరాల పెరుగుదలకు, శరీర నిర్మాణానికి ప్రోటీన్ చాలా అవసరం. పప్పులు, పాలు, గుడ్లు, చేపలు, మాంసం వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.
  • బ్రౌన్ రైస్, రాగి, జొన్నలు, సజ్జలు వంటి వాటిలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
  • రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  • జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, స్ట్రీట్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
  • సరైన ఆహారంతో మన శరీరం ఆరోగ్యంగా(Health) ఉంటే, మనసు కూడా ఉత్సాహంగా ఉంటుంది.

Insomnia:నిద్రలేమితో బాధపడుతున్నారా? ఇది మీకోసమే

Related Articles

Back to top button