Just Internationaljust AnalysisLatest News

Great Green Wall : ఆఫ్రికా రచిస్తున్న బిగ్గెస్ట్ వండర్ గ్రేట్ గ్రీన్ వాల్.. రాళ్లతో కాదు చెట్లతో నిర్మిస్తున్న ప్రాకృతిక గోడ

Great Green Wall : ఒకప్పుడు సహారా ఎడారి దక్షిణ అంచునున్న సాహెల్ ప్రాంతం పచ్చని అడవులు, సమృద్ధిగా పండే పంటలతో కళకళలాడేది. కానీ మనిషి స్వార్థం, అడవుల నరికివేయడం, వర్షాలు తగ్గడం వంటి వల్ల నేలలో సారం పూర్తిగా నశించి ఎడారిగా మారిపోయింది.

Great Green Wall

రాళ్లతో కట్టిన గ్రేట్ వాల్‌ ఆఫ్ చైనా గోడలు రాజ్య సరిహద్దులను కాపాడితే, చెట్లతో నిర్మిస్తున్న గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఆకుపచ్చ గోడ ఏకంగా ఆఫ్రికా ఖండం ఉనికినే కాపాడుతోంది.

వేల మైళ్ల భూమిని మెల్లమెల్లగా మింగేస్తున్న సహారా ఎడారి దండయాత్రను అడ్డుకోవడానికి.. గ్రేట్ గ్రీన్ వాల్ పేరుతో ఆఫ్రికా చేపట్టిన బిగ్గెస్ట్ ప్లాన్ ఇప్పుడు ఎంతోమందిని విస్మయ పరుస్తుంది. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్న ఈ పచ్చని యజ్ఞం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ కోసం అందరూ నెట్టింట్లో తెగ వెతుకుతున్నారు.

ఒకప్పుడు సహారా ఎడారి దక్షిణ అంచునున్న సాహెల్ ప్రాంతం పచ్చని అడవులు, సమృద్ధిగా పండే పంటలతో కళకళలాడేది. కానీ మనిషి స్వార్థం, అడవుల నరికివేయడం, వర్షాలు తగ్గడం వంటి వల్ల నేలలో సారం పూర్తిగా నశించి ఎడారిగా మారిపోయింది. దీనివల్ల కరవు తాండవించి 9 వేల రకాల జంతు, వృక్ష జాతులు పూర్తిగా కనుమరుగయ్యాయి. బుర్కినా ఫాసో, చాద్, మాలి, నైజీరియా, ఇథియోపియా, సూడాన్ సహా 11 దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఈ విపత్తును అడ్డుకోవడానికి ఆఫ్రికన్ యూనియన్ 2 దశాబ్దాల క్రితం గ్రేట్ గ్రీన్ వాల్(Great Green Wall) ప్రాజెక్టును తూర్పున ఉన్న జిబౌటి నుంచి పశ్చిమాన ఉన్న సెనెగల్ వరకు స్టార్ట్ చేసింది. తొలి ప్రయత్నం విఫలమవ్వడంతో, లోకల్ వాతావరణానికి తట్టుకునే పెద్ద చెట్లు, పొదలను పెంచడం మొదలుపెట్టారు.

Great Green Wall
Great Green Wall

2030 నాటికి 8 వేల కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పుతో పెద్ద అడవిని నిర్మించడమే వీరి టార్గెట్. ఇది పూర్తయితే 25 కోట్ల ఎకరాల ఎడారి నేల మళ్లీ సారవంతం అవుతుంది. 25 కోట్ల టన్నుల కర్బనాన్ని వాతావరణం నుంచి పీల్చుకోవడమే కాకుండా సుమారు కోటి మందికి ఉపాధి దక్కుతుంది.

నిధుల కొరత ఎదురవుతున్నా సరే.. 20 దేశాలు, అంతర్జాతీయ కంపెనీల సాయంతో ఈ ఆకుపచ్చ సమరం సాగుతోంది. చైనాతో పాటు భారతదేశం కూడా రాజస్థాన్‌లో థార్ ఎడారి విస్తరణను అడ్డుకోవడానికి 2023లో గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ అరావళి.. ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం విశేషంగా చెబుతున్నారు. ఈ గ్రేట్ గ్రీన్ వాల్(Great Green Wall) ఆఫ్ అరావళి పూర్తయితే భూగోళానికి సరికొత్త పచ్చని భవిష్యత్తు దక్కడం ఖాయం అని చెప్పొచ్చు.

Lac Bangles : చార్మినార్ చుట్టూ మెరిసే లక్క గాజుల సీక్రెట్..రాయల్ బ్యాంగిల్స్ హిస్టరీ తెలుసా?

Related Articles

Back to top button