Zaynich : ప్రపంచాన్నే కాపాడుతున్న మన మెడిసిన్.. ఏంటీ మేడ్ ఇన్ ఇండియా బ్రహ్మాస్త్రం?
Zaynich : ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగాన్ని పట్టిపీడిస్తున్న యాంటీబయోటిక్ రెసిస్టెన్స్..పేషెంట్లు వాడే మందులకు లొంగకుండా రోజురోజుకూ బలాన్ని పుంజుకుంటూ ప్రాణాంతకంగా మారుతుంది.
Zaynich
మనం ఇప్పటివరకూ వాడుతున్న యాంటీబయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాలు.. ఎంతోమందిని మృత్యువు అంచుకు తీసుకెళ్తున్నాయి. ఇలా వరల్డ్ వైడ్‌గా వైద్యరంగానికి సవాల్ విసురుతున్న సూపర్ బగ్స్ మహమ్మారికి ఎట్టకేలకు ఒక పరిష్కారం దొరికింది.
అది అమెరికా, చైనా వంటి దేశాల లేబొరేటరీలో కాదు, మన భారతదేశంలోని ముంబై గడ్డపైన ఇది రూపుదిద్దుకుంది. ఏ మందుకూ లొంగకుండా.. అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియాగా పేరుబడ్డ భూతాన్ని మట్టికరిపించే మేడ్ ఇన్ ఇండియా అద్భుత ఔషధంగా గుర్తింపు పొందింది.
ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగాన్ని పట్టిపీడిస్తున్న యాంటీబయోటిక్ రెసిస్టెన్స్..పేషెంట్లు వాడే మందులకు లొంగకుండా రోజురోజుకూ బలాన్ని పుంజుకుంటూ ప్రాణాంతకంగా మారుతుంది.
ఈ సూపర్ బగ్స్‌కు చెక్ పెట్టడానికి ..ముంబైకి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ వాక్‌హార్డ్ సుమారు దశాబ్ద కాలంగా కష్టపడి అభివృద్ధి చేసిన సరికొత్త సూపర్ యాంటీబయోటిక్ డ్రగ్.. జైనిచ్ (Zaynich)కు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US FDA) తో పాటు ఇండియా డ్రగ్ కంట్రోలర్ (CDSCO) నుంచి అఫీషియల్‌గా పర్మిషన్స్ లభించాయి.
దీంతో భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త మెడికల్ మాలిక్యూల్‌ను భారత్‌లోనే కనిపెట్టి, క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసి, గ్లోబల్ లెవెల్ అప్రూవల్ సాధించిన తొలి ఇండియన్ డ్రగ్‌గా జైనిచ్ రికార్డ్ క్రియేట్ చేసింది.
కొన్నాళ్లుగా సాధారణ యాంటీబయోటిక్స్ గ్రామ్-నెగెటివ్ రకం సూపర్ బగ్స్‌పై అస్సలు పనిచేయకపోవడంతో ఏటా లక్షలాది మంది కేవలం ఇన్ఫెక్షన్ల వల్లే చనిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఐసీయూలలో చేరే రోగులకు ఇచ్చే లాస్ట్ వెపన్‌గా పిలిచే.. కార్బాపెనెం (Carbapenem) వంటి పవర్‌ఫుల్ యాంటీబయోటిక్ మందులను కూడా తట్టుకుని జీవించే సూపర్ బగ్స్ విపరీతంగా పెరిగిపోవడంతో మరణాలు కూడా అదే విధంగా పెరిగిపోయాయి.
ఇలాంటి సమయంలో భారత్ కనిపెట్టిన జైనిచ్ ఒక అద్భుత సంజీవినిగా నిలిచింది. మార్కెట్‌లో దొరికే యాంటీబయోటిక్స్ బ్యాక్టీరియాలోని ఏదో ఒక ప్రోటీన్‌ను మాత్రమే టార్గెట్ చేస్తాయి. కానీ ఈ జైనిచ్ మెడిసిన్ ఒకేసారి బ్యాక్టీరియాలోని 3 వేర్వేరు ప్రోటీన్లపై ఏకకాలంలో దాడి చేస్తుంది. దీనివల్ల బ్యాక్టీరియా దీని నుంచి తప్పించుకోలేదు సరే కదా, దానికి రెసిస్టెన్స్ పవర్‌ను కూడా అస్సలు పెంచుకోలేదు.
ఈ మేడ్ ఇన్ ఇండియా డ్రగ్ చూపించిన రిజల్ట్స్ అంతర్జాతీయ వైద్య నిపుణులను కూడా ఆశ్చర్యపరిచాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI), న్యుమోనియా వంటి సమస్యలతో ఐసీయూలో చావుబతుకుల మధ్య ఉన్న రోగులపై.. అత్యవసర పరిస్థితుల్లో ఈ మెడిసిన్‌ను వాడినప్పుడు 89 శాతం మంది రోగులు పూర్తిగా కోలుకున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో ప్రూవ్ అయింది.

ఇప్పటివరకు మార్కెట్‌లో ఉన్న అత్యుత్తమ గ్లోబల్ మెడిసిన్ కంటే ఈ జైనిచ్(Zaynich) 20 శాతం ఎక్కువ సమర్థతను చూపించడం విశేషం. ఏ మందుకూ తగ్గని అత్యంత ప్రమాదకరమైన ఎక్స్‌డీఆర్ (XDR) సూపర్ బగ్స్ ఇన్ఫెక్షన్ల బారిన పడిన పేషెంట్స్ ప్రాణాలను కాపాడటంలో ఇది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తోందని డాక్టర్లు నిర్ధారించారు.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 9 బిలియన్ డాలర్ల అడ్వాన్స్‌డ్ యాంటీబయోటిక్స్ మార్కెట్‌పై కేవలం అమెరికా, యూరప్ దేశాల ఫార్మా కంపెనీలదే కంప్లీట్ డామినెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు జైనిచ్ విజయంతో గ్లోబల్ మెడికల్ మ్యాప్‌లో భారత్ నయా రికార్డ్‌ను క్రియేట్ చేసింది.
Mosquitoes : దోమలు కొందరినే ఎందుకు కుడతాయి? బ్లడ్ గ్రూప్‌తో సంబంధమే లేదా?





