Chandrababu: ఆటో డ్రైవర్లకు చంద్రబాబు దసరా కానుక
Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'సూపర్ సిక్స్ - సూపర్ హిట్' పేరుతో నిర్వహించిన ఎన్డీయే తొలి బహిరంగ సభలో, కేవలం ఎన్నికల హామీల గురించి చెప్పడానికే కాకుండా, ప్రజలకు దసరా పండుగ కానుకలను కూడా ప్రకటించి ఆశ్చర్యపరిచారు.

Chandrababu
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అరుదైన ఉత్సాహం నింపింది అనంతపురం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ పేరుతో నిర్వహించిన ఎన్డీయే తొలి బహిరంగ సభలో, కేవలం ఎన్నికల హామీల గురించి చెప్పడానికే కాకుండా, ప్రజలకు దసరా పండుగ కానుకలను కూడా ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చాటిచెప్పారు. ముఖ్యంగా, లక్షలాది మంది ఆటో డ్రైవర్లకు రూ. 15 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించి, వారి ముఖాల్లో నవ్వులు పూయించారు.
రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. మనకు అన్నం పెట్టేది అన్నదాత. ఆర్థిక కష్టాలు ఉన్నా రైతన్నకు అండగా నిలిచాం కాబట్టే ‘అన్నదాత సుఖీభవ’ సూపర్ హిట్ అయిందని చంద్రబాబు అన్నారు. ఏడాదికి రూ. 20,000 ఇస్తామని హామీ ఇవ్వగా, ఇప్పటికే తొలి విడతగా 47 లక్షల మంది రైతులకు రూ. 7,000 చొప్పున రూ. 3,173 కోట్లు జమ చేశామని గుర్తు చేశారు. ఏ రైతుకూ యూరియా కొరత రాకుండా చూసుకుంటాను. మనం అడిగిన వెంటనే కేంద్రం యూరియా అందిస్తోందని హామీ ఇచ్చి, రైతులకు కేంద్రం సహకారం ఉందని స్పష్టం చేశారు.

గతంలో దీపం పథకంతో మహిళల వంటింటి కష్టాలు తీర్చామని గుర్తు చేసిన సీఎం.. ఇప్పుడు మళ్లీ దీపం 2 పథకం ద్వారా ప్రతి ఏటా 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం అని చెప్పారరు. ఇప్పటికే రూ. 1,704 కోట్లు ఖర్చు చేసి 2.45 కోట్ల సిలిండర్లు మహిళలకు ఇచ్చామని. ప్రతి ఇంటిలో వెలుగులు నింపాం కాబట్టే ‘దీపం 2’ సూపర్ హిట్ అయ్యిందని చంద్రబాబు(Chandrababu) సగర్వంగా ప్రకటించారు.
ఇది రాజకీయాల కోసం కాదు, ఓట్ల కోసం కాదు. బాధ్యత గల ప్రభుత్వంగా ఇచ్చిన మాట నెరవేర్చామని చెప్పడానికే ఇక్కడకు వచ్చాం” అని చంద్రబాబు(Chandrababu) అన్నారు. పేదల కోసం అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి, ఇప్పటివరకు 5.60 కోట్ల భోజనాలు అందించామని తెలిపారు. ఆటో డ్రైవర్లకు రూ. 15,000 ఆర్థిక సాయం, బీసీలకు విద్యుత్ రాయితీలు, మత్స్యకారులకు సాయం, నాయి బ్రాహ్మణులకు జీతాలు పెంపు, అర్చకులు, ఇమామ్లు, పాస్టర్లకు గౌరవ వేతనం పెంచడం వంటి అనేక సంక్షేమ పథకాలను వివరించారు. ముఖ్యంగా, ఎస్సీల చిరకాల ఆకాంక్ష అయిన వర్గీకరణను ఎవరికీ నష్టం లేకుండా పూర్తి చేశామని చెప్పడం సభలో ప్రధానాంశంగా నిలిచింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పేదల జీవితాలను మార్చేలా సంస్కరణలు తెస్తున్నాయని, ఇది ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రసంగం ఎన్డీయే కూటమిపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
One Comment