Just Andhra PradeshJust Political

Lokesh: పవన్ సవాల్‌ను స్వీకరించిన లోకేష్

 Lokesh: శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి లోకేష్( Lokesh) . . కొత్తచెరువు జడ్పీ స్కూలులో మెగా పేరెంట్ టీచర్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు టీచర్‌గా అవతారమెత్తగా..అదే కార్యక్రమంలో మాట్లాడిన లోకేష్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సవాల్‌ను స్వీకరించినట్లు చెప్పారు.

Lokesh: శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి లోకేష్( Lokesh) . . కొత్తచెరువు జడ్పీ స్కూలులో మెగా పేరెంట్ టీచర్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు టీచర్‌గా అవతారమెత్తగా..అదే కార్యక్రమంలో మాట్లాడిన లోకేష్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సవాల్‌ను స్వీకరించినట్లు చెప్పారు.

Lokesh:

నిజానికి రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు విమర్శల కోసమే వినిపిస్తాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కనిపించినకొత్త ఒరవడి హాట్ టాపిక అయింది. తెలంగాణలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసిరితే, కేటీఆర్ సిద్ధమని ప్రకటించిన వేడి చల్లారకముందే, ఏపీలో అందుకు భిన్నమైన, సానుకూల సవాల్ ఒకటి తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విసిరిన ఒక వినూత్న ఛాలెంజ్‌ను మంత్రి నారా లోకేష్ స్వీకరించరు. ఇది ఏపీ రాజకీయాల్లో అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లు అయిందని విశ్లేషకులు చెబుతున్నారు.

మెగా మీటింగ్‌లో కీలక పరిణామాలు

ఈరోజు అంటే జులై 10న ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా రంగంలో ఒక చరిత్ర సృష్టించినట్లుగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కొత్తచెరువు జెడ్పీ స్కూల్ వేదికగా జరిగినకార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకే పాల్గొన్నారు. విద్యార్థులు తయారుచేసినతల్లికి వందనంపోస్టర్‌లు, కళారూపాలను పరిశీలించిన తర్వాత, నేరుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు. ప్రోగ్రెస్ కార్డులు అందజేసి, విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సీఎం ఆకాంక్షించారు.

పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ స్వీకరించిన లోకేశ్: కోటి మొక్కల లక్ష్యం ..!

వేదికపై నుంచే మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా, అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. పాఠశాలల్లో కేవలం అకడమిక్స్ మాత్రమే కాకుండా, క్రీడలు, యోగా వంటి వాటికీ ప్రాధాన్యత ఇస్తున్నామని, రాజకీయాలకుమాత్రం తావు లేదని గట్టిగా చెప్పారు. ఏపీ వ్యాప్తంగా ఒకేరోజుభారీ పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడం తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ‘షైనింగ్ స్టార్స్ప్రోగ్రామ్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని లోకేష్ వివరించారు. గతంలో నాణ్యత లేని యూనిఫామ్‌లు ఇచ్చేవారని, కానీ తమ ప్రభుత్వం అలాంటి తప్పులు చేయదని హామీ ఇచ్చారు. ప్రతి విజయం వెనుక గురువు పాత్ర ఎంత ముఖ్యమో, మనకు బాధ్యత నేర్పే తల్లి పాత్ర కూడా అంతే గొప్పదని, అందుకేతల్లికి వందనంపథకం తీసుకొచ్చామని లోకేష్ తెలిపారు.

అక్కడే ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. “అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని గౌరవ ప్రధాని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపునకు మరింత స్ఫూర్తినిస్తూ, కోటి మొక్కలు నాటాలని మన ప్రియమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సవాల్(Green Challenge) విసిరారు. పవన్ అన్న ఛాలెంజ్‌ను నేను సంపూర్ణంగా స్వీకరిస్తున్నానని చెప్పారు. విద్యాశాఖ ద్వారాకోటి మొక్కల నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతాంఅని నారా లోకేశ్ ప్రకటించారు. ఈ ప్రకటన పవన్-లోకేష్ మధ్య ఉన్న సామరస్యానికి, అభివృద్ధి లక్ష్యంగా కలిసి పనిచేయాలనే సంకల్పానికి నిదర్శనంగా మారిందన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. .

సీఎం చంద్రబాబుటీచర్’గా.. సుస్థిర అభివృద్ధిపై పాఠాలు

కాగా మరోవైపు ఇదే కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేసి, టీచర్‌గా అవతారమెత్తారు. విద్యార్థులకు సహజ వనరుల ప్రాముఖ్యత గురించి పాఠాలు చెప్పారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలంటే వనరులను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాలను కూడా జాగ్రత్తగా వాడుకోవాలని, దీని ద్వారా వాటిని ఇతరులు తిరిగి ఉపయోగించుకోవచ్చని సూచించారు. విద్యుత్, నీరు వంటి వనరులను కూడా బాధ్యతాయుతంగా వాడుకోవడం సామాజిక బాధ్యత అని వివరించారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ప్రోత్సహించారు. “నారా లోకేష్ బాగా చదువుకుని ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి అయ్యారుఅని ఉదహరిస్తూ, ప్రజలకు మంచి చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని సీఎం యువతకు పిలుపునిచ్చారు.

మొత్తంగారెండు సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త దృక్పథాన్ని, అభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటును స్పష్టంగా చాటుతున్నాయి. ఇద్దరు యువ నాయకుల మధ్యసానుకూల సవాల్, భవిష్యత్ కార్యాచరణకు ఒక మంచి సంకేతంగా మారినట్లు అయింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button