Bigg Boss: బిగ్ బాస్ 9హౌస్ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ ప్రియా శెట్టి
Bigg Boss: తొలి వారం శ్రేష్టి వర్మ, రెండో వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న రీతూ చౌదరి, హరిత హరీష్, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కల్యాణ్ పడాల లలో, ప్రియా, హరీష్ చివరిలో నిలిచారు.

Bigg Boss
నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్(Bigg Boss) సీజన్ 9 మూడో వారం కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు రాగా, ఈ వారం హౌస్ నుంచి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది. మొదటి నుంచి అందరూ అనుకుంటున్నట్లుగానే ఈ వారం కామనర్ ప్రియా శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది.
కామనర్‌గా హౌస్(Bigg Boss)లోకి అడుగుపెట్టిన ప్రియా శెట్టి, తాను డాక్టర్ చదివినా, నటి కావాలన్నది తన కల అని చెప్పారు. తొలిరోజుల్లో తనదైన ఆటతో ఆకట్టుకున్నా కూడా, ఆమె దుందుడుకు స్వభావం, పదేపదే గొడవలకు కాలు దువ్వడం, మరియు అడ్డగోలుగా వాదించడం ప్రేక్షకులకు కాస్త చిరాకు తెప్పించాయి.
మొదటి రోజు నుంచీ ప్రియా తన ఆవేశంతో కూడిన స్వభావంతో హౌస్‌లో రచ్చ చేసింది.ముఖ్యంగా టాస్క్‌ల విషయంలో ఆమె వ్యవహరించిన తీరు, అలాగే సంచాలక్‌గా ఆమె చేసిన తప్పులు ఆమెపై నెగెటివిటీని పెంచాయి. గతవారం నాగార్జున ఇచ్చిన సలహాలతో ఆమె తన ఆటతీరును మార్చుకోవడానికి ప్రయత్నించినా, అప్పటికే ఆమెపై ఉన్న నెగిటివిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రభావం ఓటింగ్‌లో స్పష్టంగా కనిపించింది.

తొలి వారం శ్రేష్టి వర్మ, రెండో వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న రీతూ చౌదరి, హరిత హరీష్, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కల్యాణ్ పడాల లలో, ప్రియా, హరీష్ చివరిలో నిలిచారు. వీరిద్దరిలో హరీష్ కంటే ప్రియకు ఓట్లు తక్కువ రావడంతో ఆమె ఎలిమినేషన్ ఖాయమైంది.
ప్రియా ఎలిమినేషన్ ప్రకటించగానే, డేంజర్ జోన్‌లో ఆమెతో పాటు ఉన్న కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. హౌస్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు, హరీశ్‌కు అందరూ చెప్పేది వినమని, తనూజకు ఎప్పుడూ అలగకు అని ప్రియ సలహా ఇచ్చారు.డాక్టర్ చదివిన ప్రియా శెట్టి, నటి కావాలన్న తన కలను నెరవేర్చుకోవడం కోసం, పెళ్లి సంబంధాలు కూడా ఆపేసి బిగ్ బాస్‌కు వచ్చానని హౌస్‌లోకి అడుగుపెట్టేటప్పుడు చెప్పారు.
మూడు వారాల పాటు హౌస్‌లో ఉన్న ప్రియా శెట్టి ఎంత పారితోషికం తీసుకున్నారనే వివరాలు కూడా బయటకు వచ్చాయి. బిగ్ బాస్‌కి ప్రియా శెట్టి వారానికి దాదాపు రూ. 60 వేల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన ప్రియా మూడు వారాలకు గాను మొత్తం రూ. 1 లక్ష 80 వేలు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.