Soubin Shahir: కూలీలో రజినీనే డామినేట్ చేసిన క్యారెక్టర్.. అంతగా సౌబిన్‌లో ఏముంది?
Soubin Shahir: మంజుమ్మల్ బాయ్స్ నిర్మాతగా, నటుడిగా అప్పుడు..కూలీ(Koolie) వంటి పెద్ద కథల్లో రజినీకాంత్, నాగార్జున వంటి బిగ్ స్టార్ల మధ్య ఇప్పుడు తనదైన ముద్ర వేసేశాడు.

Soubin Shahir
కూలీ (Coolie) సినిమాలో రజినీకాంత్, నాగార్జున వంటి దిగ్గజాల మధ్య నిలబడి కూడా తనకంటూ ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకోవడం నిజంగా సాహసమే. కానీ..ఈ సాహసాన్ని చాలా సులువుగా, మామూలుగా చేసి చూపించేశాడు..సౌబిన్ షాహిర్.
మలయాళ సినిమా పరిశ్రమలో సౌబిన్ షాహిర్ (Soubin Shahir) ఒక పేరు కాదు, ఒక కొత్త ఒరవడి. అతని నటనలో ఒక సహజమైన మాయాజాలం ఉంటుంది. ఈ మాయాజాలాన్నే కూలీ(Coolie)లో మరోసారి చూశారు ఆడియన్స్.
సౌబిన్ పెద్ద యాక్షన్ హీరోల్లాగా భారీ పోరాటాలు చేయడు. కానీ, అతనిలోని కంటెంట్ మాత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. అతను తన పాత్రలను పూర్తిస్థాయిలో కంట్రోల్ చేయడు..కానీ ఆ పాత్రకు భావోద్వేగాలు, ఆలోచనలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఇస్తాడు.
గ్లామర్, అదిరిపోయే డ్యాన్సులతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటులకు భిన్నంగా, సాధారణ ప్రేక్షకులతో మాట్లాడే నటుడు సౌబిన్. అందుకే అతను ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంటాడు.
‘కూలీ'(Coolie) సినిమాలో సౌబిన్ పాత్ర ఒక పెద్ద సీన్‌తో మొదలవకుండా, చిన్న చిన్న మూమెంట్స్‌తో ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. ఆ చిన్న చిన్న సన్నివేశాలలోనే అతను ఆ సినిమాకు ఆకర్షణగా నిలిచాడని విమర్శకులు కూడా ప్రశంసించారు.
సౌబిన్ చెప్పినట్లుగా, “నేను నటించే ప్రతి పాత్రలో ఉన్నతమవుతాను. కానీ నటనా ‘బూస్ట్’ అనేది హీరోగా కావడంలో కాదు, నిజమైన, ఆప్యాయమైన భావాలను వెలికితీయడంలోనే ఉంటుంది.” అతని నటనలో హాస్యం, కోపం, బాధ, ప్రేమ అన్నీ ఒకే మనిషిలో భాగంలాగా కరిగిపోతాయి. అందుకే తెరపై అతను చేసే ప్రతీదీ చాలా నిజాయితీగా, సహజంగా కనిపిస్తుంది.
కొన్ని సన్నివేశాల్లో అతని చూపు, మాట, అందులో కనిపించే శ్రద్ధ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. పక్కన ఉన్న స్టార్ హీరోలను కూడా కొన్నిసార్లు డామినేట్ చేసేలా అతని నటన ఉంటుందని మలయాళ, టాలీవుడ్ పరిశ్రమ ఎప్పుడో గుర్తించింది.
సాధారణంగా ఒక సినిమాలో హీరోకే ప్రాముఖ్యత ఉంటుంది. కానీ కూలీ(Coolie)లో రజినీకాంత్ , నాగార్జున వంటి పెద్ద స్టార్స్ సమక్షంలో కూడా సౌబిన్ తనకంటూ ఒక బలమైన గుర్తింపును సృష్టించుకున్నాడు.
అసలు సౌబిన్(Soubin Shahir) సినీ కెరీర్ ప్రయాణం చాలా డిఫరెంట్‌గా స్టార్టయింది. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ, ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చారు. ‘ప్రేమం’ సినిమాలో కామెడీ మాస్టర్‌గా, చార్లీలో ఒక్క చూపుతో, మహేశింటే ప్రతికారంలో ఇద్దరి మధ్య తడబాటుతో కూడిన పాత్రలో, కమ్మటిపాదంలో డిఫరెంట్ మూడ్‌లో ఇలా ప్రతి పాత్రలోనూ తన ప్రత్యేకతను చూపిస్తూ ప్రేక్షకుల్ని ఓన్ చేసుకోవడం సౌబిన్ స్పెషాలిటీగా మార్చుకున్నాడు.

ఆ తర్వాత దర్శకుడిగానూ మారిన సౌబిన్..పరావ అనే సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. పక్షుల కథగా అనిపించినా, మానవ సంబంధాల లోతును, గుండె చప్పుడును చూపించి తన ప్రతిభను చాటుకున్నాడు. మరోవైపు ‘సుడాని ఫ్రమ్ నైజీరియా’ సినిమాలో ఒక మామూలు మనిషిని అద్భుతమైన కోచ్‌గా, మనిషి మనసుల్లోకి ప్రవేశించే పాత్రలో నటించి ఉత్తమ నటుడిగానూ గుర్తింపు పొందారు.
‘కుంబలంగి నైట్స్’ సినిమాలో అతని నటన మనకు ఎంతో నచ్చింది. అక్కడ అతని నటన మాటల్లో కాదు, చూపుల్లో, నిట్టూర్పుల్లో, భావోద్వేగాల్లో కనిపిస్తుంది. చిన్న పాత్రే అయినా, మాస్ క్యారెక్టర్ అయినా, హీరో పాత్ర అయినా, సౌబిన్ తన పాత్రలో ఒదిగిపోయి పరకాయ ప్రవేశం చేస్తాడు.
పాన్-ఇండియా దిశగా మంజుమ్మల్ బాయ్స్ నిర్మాతగా, నటుడిగా అప్పుడు..కూలీ(Coolie) వంటి పెద్ద కథల్లో రజినీకాంత్, నాగార్జున వంటి బిగ్ స్టార్ల మధ్య ఇప్పుడు తనదైన ముద్ర వేసేశాడు.
అందుకే సౌబిన్ షాహిర్ అంటే.. తనదైన పద్ధతిలో జీవిస్తూ, ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉండే నటుడు. తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్.
Also read: Free bus: ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు నుంచే..ఏపీ ప్రభుత్వానికి భారమెంత?