Rajinikanth: 50 ఏళ్ల సినీ జీవితం.. చెక్కుచెదరని రజినీ మ్యాజిక్
Rajinikanth: ఐదు దశాబ్దాల ప్రయాణం ఆయనెలా ఒక సామాన్య వ్యక్తి నుంచి 'సూపర్ స్టార్'గా ఎదిగారో తెలియజేస్తుంది.

Rajinikanth
1970వ దశకం మధ్యలో బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేసిన శివాజీ రావు గాయక్వాడ్ అనే యువకుడికి సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాలనే ఒక కల ఉండేది. ఆ కలను సాకారం చేసుకోవడానికి, ఆయన పుణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు, రజినీకాంత్‌గా నటన జీవితం ఐదు దశాబ్దాలు(50 years) పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయన ప్రస్థానాన్ని మనం గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఈ ఐదు దశాబ్దాల ప్రయాణం ఆయనెలా ఒక సామాన్య వ్యక్తి నుంచి ‘సూపర్ స్టార్’గా ఎదిగారో తెలియజేస్తుంది.
1975లో దర్శకుడు కె. బాలచందర్ తన ‘అపూర్వ రాగాలు’ చిత్రంలో ఆయనకు విలన్ పాత్ర ఇచ్చినప్పుడు, శివాజీ రావు ‘రజనీకాంత్'(Rajinikanth)గా మారారు. మొదట్లో ‘మూడు ముదిచు’, ’16 వయతినిలే’ వంటి చిత్రాలలో నెగెటివ్ పాత్రలు పోషిస్తూ, తన ప్రత్యేకమైన స్టైల్, నడక, డైలాగ్ డెలివరీతో ఏదో అట్రాక్షన్ ఉందయ్యా ఈ కుర్రాడిలా అనేంతగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
1978లో ‘భైరవి’ సినిమాతో రజనీకాంత్ (Rajinikanth) తొలిసారి హీరోగా మారారు. ఆ తర్వాత అభిమానులు ఆయనకు ‘సూపర్ స్టార్’ అనే బిరుదుని ఇచ్చారు. 1980వ దశకంలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాలను సమర్థవంతంగా పోషిస్తూ ఏ జానర్‌లోనైనా విజయం సాధించారు. 1990ల నాటికి ‘అన్నామలై’, ‘భాషా’ వంటి సినిమాలు ఆయనను ఒక మాస్ ఐకాన్‌గా మార్చాయి. ‘ముత్తు’ సినిమా జపాన్‌లో కూడా విజయవంతమై, ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చింది.
Also Read: Coolie, War 2: బాక్సాఫీస్ ఫైట్..కూలీ, వార్ 2 స్పెషల్ షోస్ టైమింగ్స్, టికెట్ ధరలివే
2000వ దశకంలో ‘శివాజీ’, ‘ఎందిరన్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలతో యువతకు చేరువయ్యారు. 2010లో ‘కబాలి’, ‘కాలా’ వంటి చిత్రాలలో ప్రయోగాత్మక పాత్రలు పోషించి, వయసు పెరిగినా తన (Rajinikanth) క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. ‘జైలర్’ (2023)లో డార్క్ హ్యూమర్, పవర్ఫుల్ యాక్షన్‌తో మరో ఘన విజయాన్ని అందుకుని, ఇప్పుడు ‘కూలీ‘ చిత్రంతో అభిమానులను అలరిస్తున్నారు.

ఒక బస్ కండక్టర్ నుంచి భారతీయ సినీ చరిత్రలో అతిపెద్ద ఐకాన్‌గా ఎదిగిన రజినీకాంత్(Rajinikanth) కథ, కేవలం విజయాల పరంపర మాత్రమే కాదు; అది నిరంతర శ్రమ, కాలానికి తగ్గట్టుగా మారే తత్వం, ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఒక మనిషి గాథ. ఆయన 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవడానికి ఇదే సరైన సమయం.