Just InternationalLatest News

Trump: విదేశీ విద్యార్థులకు గోల్డ్ కార్డ్..  గ్రీన్ కార్డు ఎక్కువ లాభాలంటున్న ట్రంప్

Trump: అమెరికాలోని అత్యుత్తమ యూనివర్సీటల నుండి గ్రాడ్యుయేషన్ పొందిన విద్యార్థులను ఇక్కడి కంపెనీలు ఉద్యోగులుగా నియమించుకోవచ్చని ట్రంప్ ప్రకటించారు

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరూ చెప్పలేరు. మొన్నటి వరకూ భారత్ తో సహా విదేశీ విద్యార్థులు, ఉద్యోగులను శతృవులుగా చూసిన ట్రంప్ (Trump)ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. అమెరికాలో చదువుకునే టాలెంటెడ్ స్టూడెంట్స్ ను వారి స్వదేశాలకు వెళ్లకుండా అక్కడే ఉంచేందుకు కొత్త వీసా విధానాన్ని తీసుకొచ్చారు.

దీని పేరే గోల్డ్ కార్డ్… అమెరికాలోని అత్యుత్తమ యూనివర్సీటల నుండి గ్రాడ్యుయేషన్ పొందిన విద్యార్థులను ఇక్కడి కంపెనీలు ఉద్యోగులుగా నియమించుకోవచ్చని ట్రంప్ ప్రకటించారు, ఇక్కడ చదువుకున్న ప్రతిభావంతులైన వారంతా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లాల్సి రావడం అవమానంగా ఉందంటూ అభివర్ణించారు. టాప్ వర్సిటీల నుంచి అత్యుత్తమ స్థాయిలో చదువుకుని బయటకు వచ్చిన స్టూడెంట్స్ కు ఈ గోల్డ్ కార్డ్ వస్తుందని ట్రంప్ వెల్లడించారు. అయితే దీని కోసం కొంత మొత్తం చెల్లించాల్సి వస్తుందని తెలిపారు.

ట్రంప్(Trump) తీసుకొచ్చిన ఈ కొత్త వీసా విధానం వెనుక పెద్ద ప్లానే ఉంది. అద్భుత నైపుణ్యం కలిగిన విద్యార్థులను ఇతర దేశాలకు వెళ్లకుండా అమెరికాలోనే ఉద్యోగ సేవలు అందించేలా ట్రంప్ ప్లాన్ చేశారు.దీని ద్వారా చక్కని నైపుణ్యం ఉన్న విద్యార్థులతో ఇక్కడి కంపెనీలు మరింత వృద్ధి సాధిస్తాయన్నది ట్రంప్ అభిప్రాయం. అలాగే దీని వెనుక అమెరికా ఖజానాను నింపుకునే ఎత్తుగడ కూడా ఉంది.

trump
trump

ఈ గోల్డ్ కార్డ్ పొందేందుకు వ్యక్తిగతంగా స్టూడెంట్స్ రూ.9 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక వారిని నియమించుకునే కార్పొరేట్ సంస్థలు కూడా ఏకంగా రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఒక్కో స్టూడెంట్ ద్వారా 27 కోట్ల వరకూ ఆదాయం రావడంతో పాటు టాలెంటెడ్ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ ఉండేలా పక్కాగా ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. ఈ గోల్డ్ కార్డ్ ద్వారా అమెరికా ఖజానాకు భారీగా ఆదాయం వస్తుందనీ, ఆ డబ్బును దేశ అభివృద్ధికి ఉపయోగిస్తామని ట్రంప్ చెప్పారు.

అమెరికా కంపెనీలు ఉద్యోగిని నియమించుకున్న తర్వాత.. చాలా ప్రోసెస్ ఉంటుంది. అక్కడి ప్రభుత్నం నిర్వహించే తనిఖీ ప్రక్రియకు హాజరు కావాలి. దీనికి 15 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది తనిఖీల్లో ఆ ఉద్యోగి కచ్చితంగా అమెరికాలో ఉండేందుకు అర్హుడేనా అన్నది నిర్థారిస్తారు. ఈ ఫాస్ట్ ట్రాక్ గోల్డ్ కార్డ్ వీసాతో భవిష్యత్తులో అమెరికా పౌరసత్వం కూడా త్వరగానే వస్తుందని చెబుతున్నారు.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button