Nestle CEO: నెస్లే సీఈఓ కెరీర్ క్లోజ్ ..నేటి కార్పొరేట్ పాఠాలుగా లారెంట్ ఫ్రెక్సీ, యాండీ బ్రయన్
Nestle CEO: పదేళ్లపాటు పాటు అంచెలంచెలుగా ఎదిగి, ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ కంపెనీకి నెస్లే సీఈఓగ అయిన లారెంట్ ఫ్రెక్సీ..ఒకే ఒక పొరపాటుతో తన కెరీర్, ఇమేజ్‌తో పాటు ఫ్యూచర్ కూడా పోగొట్టుకున్నారు.

Nestle CEO
కార్పొరేట్ ప్రపంచం అంటే కేవలం లాభాలు, ప్రణాళికలు మాత్రమే కాదు, కొన్నిసార్లు అది హఠాత్తుగా కుప్పకూలిపోయే కెరీర్లు, ప్రతిష్టలకు కూడా వేదికగా మారుతుంది. అలాంటి ఒక షాకింగ్ సంఘటనే నెస్లే సీఈఓ(Nestle CEO) లారెంట్ ఫ్రెక్సీ పతనం. పదేళ్లపాటు పాటు అంచెలంచెలుగా ఎదిగి, ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ కంపెనీకి నెస్లే సీఈఓగ అయిన లారెంట్ ఫ్రెక్సీ..ఒకే ఒక పొరపాటుతో తన కెరీర్, ఇమేజ్‌తో పాటు ఫ్యూచర్ కూడా పోగొట్టుకున్నారు.
ఫ్రెక్సీ పతనం ఒక సాధారణ ఆఫీస్ ఎఫైర్ కాదు, అది నెస్లే(Nestle CEO) కంపెనీ నియమాలను ఉల్లంఘించడమే. నెస్లే యొక్క కార్పొరేట్ పాలసీలో ఒక ముఖ్యమైన నియమం ఉంది. ఏ ఉద్యోగి అయినా, వారి వ్యక్తిగత సంబంధాల వల్ల సంస్థ ప్రతిష్ట దెబ్బతింటే, ఎంత పెద్ద స్థానంలో ఉన్నా కఠిన చర్య తప్పదు అని. ఫ్రెక్సీ తన కిందిస్థాయి ఉద్యోగితో పెట్టుకున్న సంబంధం కంపెనీ ఇమేజ్‌కు డ్యామేజ్ కలిగించడంతో, ఇంటర్నల్ ఎంక్వైరీ జరిగింది. ఆ దర్యాప్తులో నిర్దారణ కాగానే, బోర్డు ఫ్రెక్సీని తొలగించడం తప్ప వేరే మార్గం లేదని భావించింది.
ఫ్రెక్సీ పతనం కేవలం ఒక వ్యక్తిగత వైఫల్యం కాదు, ఇది నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి.

నైతిక విలువలు (Corporate Ethics) రెడ్ లైన్.. ఇప్పుడు పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు కూడా తమ ఎంప్లాయ్ వ్యక్తిగత జీవితంలో జరిగే తప్పులను కూడా తేలికగా తీసుకోవడం లేదు. ఒక లీడర్ ప్రైవేట్ జీవితంలో కూడా ఒక రోల్ మోడల్‌గా ఉండాలని ఆశిస్తున్నాయి.
ఈ సోషల్ మీడియా యుగంలో ఒక చిన్న తప్పు కూడా నిమిషాల్లో ప్రపంచానికి తెలిసిపోతుంది. ఉన్నత స్థానంలో ఉన్నవారికి ఇది మరింత రిస్కీ.
ఇమేజ్ అండ్ లీడర్షిప్ (Leadership & Image).. ఒక కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇమేజ్, ఆ కంపెనీ ఇమేజ్‌తో ముడిపడి ఉంటుంది. అందుకే, ఒక లీడర్ తన వ్యక్తిగత ప్రవర్తనతో కంపెనీని ప్రభావితం చేయకుండా ఉండాలి.
Smartphone: స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతుందా? ఈ చిట్కాలు మీ కోసమే
ఇదే తరహా సంఘటన ఇటీవల ఆస్ట్రానమర్ సీఈఓ యాండీ బ్రయన్ విషయంలో కూడా జరిగింది. ఒక కచేరీలో ఆయన హెచ్ఆర్ అధిపతిని కౌగిలించుకున్న వీడియో బయటపడగానే, ఆయన కెరీర్ ఒక్క రోజులో ముగిసింది. ఇటు కుటుంబంలోనూ, అటు కెరీర్లోనూ ఒక్కసారిగా కోలుకోలేని దెబ్బ తగిలింది.
పవర్ అండ్ ప్లేస్ ఒకరి వ్యక్తిగత నియంత్రణను తగ్గిస్తాయి. కానీ, నేటి ప్రపంచం కెమెరా, సోషల్ మీడియా యుగం. ఒక చిన్న పొరపాటు క్షణాల్లో ఒక పెద్ద వివాదంగా మారుతుంది. అందుకే, ఫ్రెక్సీ పతనం ఒక వార్నింగ్ బెల్ లాంటిది. కార్పొరేట్ సింహాసనం బంగారు కుర్చీ కాదు, అది ఒక ముళ్ల కుర్చీ. ఒక తప్పు అడుగు వేసినా చరిత్రలో నిలిచే పతనానికి దారితీస్తుంది.
అయితే టాప్ పొజిషన్లో ఉన్నవారు తమ కెరీర్లు నాశనం అవుతాయని తెలిసి కూడా ఇలాంటి పనులు ఎందుకు చేస్తారనే దానిపై మానసిక విశ్లేషకులు కొన్ని ముఖ్యమైన కారణాలను వివరిస్తున్నారు. అధికారం వల్ల వచ్చే అహం ఒక ప్రధాన కారణం. “నేను పెద్ద స్థానంలో ఉన్నాను, కాబట్టి నా నిర్ణయాలు ఎవరూ ప్రశ్నించరు” అనే భావనతో రిస్కులు తీసుకుంటారు. అలాగే, తమ వృత్తిలో అనుభవించే ఒంటరితనం, ఒత్తిడి కూడా ఒక కారణం. తమ భావోద్వేగ సంబంధాల కోసం తమతో సన్నిహితంగా ఉండే సహోద్యోగులపై ఆధారపడతారు.
ఏది ఏమయినా లారెంట్ ఫ్రెక్సీ, యాండీ బ్రయన్లకు జరిగిన రెండు సంఘటనలు ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు నైతిక విలువలు, కార్పొరేట్ ఎథిక్స్ విషయంలో చాలా కఠినంగా ఉన్నాయి. అగ్రస్థానంలో ఉన్నా, ఒక తప్పు ప్రవర్తన కెరీర్‌ను క్షణాల్లో ముగించేస్తుందని మరోసారి ప్రూవ్ అయింది.
2 Comments