Just TechnologyLatest News

Smartphone: స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతుందా? ఈ చిట్కాలు మీ కోసమే

Smartphone: ఫోన్‌ను నేరుగా సూర్యకాంతి పడే చోట ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో ఫోన్ వాడడం తప్పనిసరి అయితే, దానిపై ఏదైనా నీడ పడేలా చూసుకోవడం మంచిది.

Smartphone

స్మార్ట్‌ఫోన్‌లు వేడెక్కడం ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. కొన్నిసార్లు ఫోన్‌లు అధికంగా వేడెక్కి పేలిపోయిన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. మీ స్మార్ట్‌ఫోన్ (Smartphone)వేడెక్కకుండా, దాని బ్యాటరీ జీవితాన్ని పెంచుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం.

సూర్యరశ్మి నుంచి రక్షణ..ఎండలో స్మార్ట్‌ఫోన్‌ను నేరుగా వాడడం వల్ల అది ఇంకా వేడెక్కుతుంది. కాబట్టి ఫోన్‌ను నేరుగా సూర్యకాంతి పడే చోట ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో ఫోన్ వాడడం తప్పనిసరి అయితే, దానిపై ఏదైనా నీడ పడేలా చూసుకోవడం మంచిది.

ఒరిజినల్ ఛార్జర్ వాడండి..ఛార్జర్ పాడైతే మార్కెట్‌లో లభించే ఏ ఛార్జర్‌నైనా కొనడం చాలామంది చేసే తప్పు. ప్రతి ఫోన్ తయారీదారుడు దాని బ్యాటరీకి అనుగుణంగా ఛార్జర్‌ను రూపొందిస్తారు. కాబట్టి ఎల్లప్పుడూ కంపెనీకి చెందిన ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే వాడాలి. ఒరిజినల్ ఛార్జర్ పాడైతే, అదే కంపెనీకి చెందిన మరొక ఒరిజినల్ ఛార్జర్‌నే కొనుగోలు చేయాలి.

అతిగా ఛార్జింగ్ చేయవద్దు..చాలామంది రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ సామర్థ్యం దెబ్బతింటుంది. బ్యాటరీ 90 నుండి 100 శాతం ఛార్జ్ అయిన తర్వాత ఛార్జర్‌ను తొలగించడం మంచిది. ఇప్పుడు వస్తున్న స్మార్ట్‌ఫోన్లలో ‘ఆటోమేటిక్ పవర్ సప్లై’ ఫీచర్ ఉంటుంది. దీనిని ఆన్ చేసుకుంటే, ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఛార్జింగ్ ఆగిపోతుంది.

Smartphone
Smartphone

అవసరం లేని ఫీచర్‌లను ఆఫ్ చేయండి..బ్లూటూత్, లొకేషన్ సర్వీసెస్ వంటి ఫీచర్లను చాలామంది ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచుతారు. స్మార్ట్ వాచ్‌లను, బ్లూటూత్ హెడ్‌సెట్‌లను ఎక్కువగా వాడడం వల్ల ఈ ఆప్షన్లను ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు. అవసరం లేనప్పుడు ఈ ఫీచర్‌లను టర్న్ ఆఫ్ చేయడం వల్ల ఫోన్‌పై లోడ్ తగ్గడమే కాకుండా, బ్యాటరీ జీవితం పెరుగుతుంది.

అనవసరమైన యాప్స్ డిలీట్ చేయండి..మీరు వాడని యాప్స్ ఫోన్‌లో ఉన్నాయా? అయితే వాటిని వెంటనే డిలీట్ చేయడం మంచిది. ఎందుకంటే ఆ యాప్స్ మీరు ఉపయోగించకపోయినా, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఫోన్‌ను వేడెక్కిస్తాయి. వాటిని డిలీట్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ పెరగడంతో పాటు, ఫోన్ స్టోరేజ్ స్పేస్ కూడా ఆదా అవుతుంది.

స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించండి..స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉంటే బ్యాటరీ త్వరగా ఖర్చవుతుంది. కాబట్టి వీలైనంత వరకు బ్రైట్‌నెస్‌ను తక్కువగా ఉంచాలి. దీనికోసం ఇప్పుడు ఫోన్‌లలో ఉన్న ‘ఆటోమేటిక్ స్క్రీన్ బ్రైట్‌నెస్’ మోడ్‌ను ఉపయోగించుకోవడం మంచిది. ఈ చిన్నపాటి జాగ్రత్తలతో మీ ఫోన్‌ను సురక్షితంగా, బ్యాటరీ జీవితాన్ని పెంచుకోవచ్చు.

Pawan Kalyan:‘ఉస్తాద్ భగత్ సింగ్’ న్యూ లుక్ .. పవన్ కళ్యాణ్ బర్త్‌డే ట్రీట్ అదిరింది..

Related Articles

Back to top button