Black Tea: తెల్ల జుట్టును నల్లగా మార్చే సీక్రెట్ టీ ..మీకోసమే
Black Tea: తెల్ల జుట్టు సమస్యను తేలికగా తగ్గించే బ్లాక్ టీ ప్యాక్స్ గురించి తెలుసుకోండి. సహజసిద్ధంగా జుట్టును బలంగా, నిగనిగలాడేలా మార్చుకోండి!

Black Tea:
బిజీ లైఫ్‌స్టైల్, మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం కారణంగా చాలామందికి చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, తెల్లబడటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి చాలామంది హెయిర్ డై, కెమికల్ కలర్స్ వాడుతుంటారు. కానీ, వాటిలో ఉండే రసాయనాలు జుట్టును మరింతగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో, మీ తెల్ల జుట్టును తిరిగి నల్లగా మార్చడానికి, సహజసిద్ధమైన, ప్రభావవంతమైన పరిష్కారం బ్లాక్ టీ. దీనిని ఎలా ఉపయోగించవచ్చో వివరంగా చూద్దాం.
బ్లాక్ టీ(black tea)లో ఉండే టానిక్ యాసిడ్ (gray hair) తెల్ల జుట్టుకు సహజమైన రంగును అందిస్తుంది. అంతేకాకుండా, ఇది జుట్టును బలంగా, మృదువుగా, మెరిసేలా చేస్తుంది. జుట్టు (hair) ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బ్లాక్ టీ అద్భుతంగా పనిచేస్తుంది. హెయిర్ డైలలో ఉండే కెమికల్స్ జుట్టును పొడిగా మార్చేస్తాయి, కానీ బ్లాక్ టీతో అలాంటి సమస్య ఉండదు.

1. బ్లాక్ టీ (Black Tea) డికాషన్ : ఇది చాలా ఈజీ అయిన పద్ధతి. ముందుగా, రెండు కప్పుల నీటిలో నాలుగు నుండి ఐదు చెంచాల టీ పొడి వేసి బాగా మరిగించాలి. నీరు ఒక కప్పుకు సగానికి తగ్గే వరకూ మరిగించిన తర్వాత, ఆ డికాషన్‌ను వడకట్టి చల్లార్చాలి. ఈ డికాషన్‌ను మీ జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పూర్తిగా పట్టించాలి. అరగంట తర్వాత, షాంపూ వాడకుండా మామూలు నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు, మూడు నెలల పాటు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

2. బ్లాక్ టీ (Black Tea) ప్లస్ కాఫీ మిశ్రమం : మీ తెల్ల జుట్టు(Gray hair)కు మరింత నల్లటి రంగు కావాలంటే, బ్లాక్ టీతో పాటు కాఫీని కలపడం మంచిది. రెండు కప్పుల నీటిలో మూడు చెంచాల టీ పొడి మరియు మూడు చెంచాల కాఫీ పొడి వేసి మరిగించాలి. ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత, బ్రష్ సహాయంతో జుట్టుకు పట్టించి అరగంట సేపు ఉంచి, తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఈ మిశ్రమం జుట్టుకు లోతైన నల్లటి రంగు( hair black)ను ఇస్తుంది.
3. బ్లాక్ టీ(Black Tea), వాము, అండ్ హెన్నా ప్యాక్ : ఈ పద్ధతి జుట్టుకు రంగు ఇవ్వడంతో పాటు, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. రెండు గ్లాసుల నీటిలో రెండు చెంచాల టీ పొడి, రెండు చెంచాల వాము (ఓమ గింజలు) వేసి మరిగించాలి. ఈ నీటిని వడకట్టి చల్లారాక, అందులో రెండు చెంచాల హెన్నా పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్‌ను జుట్టుకు పట్టించి అరగంట పాటు ఉంచి, ఆ తర్వాత షాంపూ లేకుండా మామూలు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

ఈ సహజ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడం వల్ల తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడటమే కాకుండా, మీ జుట్టు నిగనిగలాడుతూ ఆరోగ్యంగా (health) ఉంటుంది.
Also read: Kingdom : కింగ్‌డమ్ మూవీపై రష్మిక మాస్ ట్వీట్..
Airline: చావు కళ్ల ముందుకు వస్తే .. అక్కడ జరిగింది అదే..