coconut water : కొబ్బరి నీళ్లు అందరికీ మంచివి కావన్న విషయం తెలుసా?
coconut water : శరీరాన్ని చల్లబరచుకోవడానికి చాలామంది పండ్ల రసాలు, స్మూతీలు, కొబ్బరి నీటిని ఆశ్రయిస్తుంటారు. వీటిలో కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలామంది భావిస్తారు.

coconut water : శరీరాన్ని చల్లబరచుకోవడానికి చాలామంది పండ్ల రసాలు, స్మూతీలు, కొబ్బరి నీటిని ఆశ్రయిస్తుంటారు. వీటిలో కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలామంది భావిస్తారు. ఇది విటమిన్ C, విటమిన్ E, కాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉండటంతో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
coconut water
అంతేకాదు, శక్తిని అందించి, శరీరాన్ని డిటాక్స్ చేయడంలో, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా కొబ్బరి నీరు(coconut water) ప్రశంసలు అందుకుంటుంది. అయితే, ఈ పోషకాల పానీయం అందరికీ ఒకే విధంగా ప్రయోజనకరంగా ఉండదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది హానికరంగా మారే అవకాశం ఉందని నిపుణలు హెచ్చరిస్తున్నారు.
ఈ ఆరోగ్య సమస్యలున్న వారికి కొబ్బరి నీరు మంచిది కాదు..
కిడ్నీ వ్యాధుల(Kidney disease)తో బాధపడుతున్నవారు కొబ్బరి నీటికి దూరంగా ఉండాలి. ఇందులో పొటాషియం స్థాయిలు అధికంగా ఉంటాయి. కిడ్నీలు సరిగ్గా పనిచేయనివారిలో, ఈ పొటాషియం శరీరంలో పేరుకుపోయి హైపర్‌కలేమియా(Hyperkalemia) అనే పరిస్థితికి దారితీస్తుంది. ఇది గుండె లయను దెబ్బతీసి, తీవ్రమైన ప్రమాదానికి కారణం కావచ్చు.
మధుమేహగ్రస్తులు కొబ్బరి నీటిని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది సహజంగా తీపిని కలిగి ఉంటుంది, దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్(Glycemic index) , కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువే. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, తాగే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి.
కొబ్బరి నీటిలో ఉండే అధిక పొటాషియం, వృద్ధులలో గుండె పనితీరుపై ప్రభావం చూపవచ్చు. వారి శరీర జీవక్రియ యువకులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం.
కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల, కొన్ని సందర్భాల్లో అధిక రక్తపోటు ఉన్నవారికి రక్తపోటు మరింత పెరిగే అవకాశం ఉంటుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొంతమందికి కొబ్బరి నీరు తాగినప్పుడు చర్మంపై అలెర్జీ, దురద, మంట లేదా ఎరుపు రంగు దద్దుర్లు వంటి ప్రతికూల ప్రభావాలు కలుగవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే నిలిపివేయడం శ్రేయస్కరం.
ఆరోగ్యంగా ఉన్నవారు కూడా కొబ్బరి నీటిని పరిమిత పరిమాణంలోనే తీసుకోవాలి. సాధారణంగా రోజుకు అర గ్లాసు నుంచి ఒక గ్లాసు మించకుండా తాగడం మంచిది. అసలు ప్రతీ రోజు కొబ్బరి నీళ్లు తాగకుండా.. రోజు విడిచి రోజు తాగితే మంచిది. అయితే, ఏ ఆహారం లేదా పానీయం విషయంలోనైనా మితి మించితే అది ఆరోగ్యానికి హానికరం అవుతుంది. మీ ఆరోగ్యంపై మీకు ఏమైనా సందేహాలుంటే, వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.