Curd:చలికాలంలో పెరుగు తింటే జలుబు చేస్తుందా?
Curd:చలికాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వస్తాయని పెరుగును పక్కన పెట్టేస్తుంటారు.
Curd
శీతాకాలం రాగానే చాలామంది ఆహార నియమాలను మార్చుకుంటారు.. ముఖ్యంగా పెరుగు (Curd) తినడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వస్తాయని అనుకుని పెరుగును పక్కన పెట్టేస్తుంటారు. అయితే నిజంగానే చలికాలంలో పెరుగు అస్సలు తినకూడదా? దీనివల్ల ఆరోగ్యం పాడవుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తుంటాయి. అయితే డాక్టర్లు ఇది నిజం కాదంటున్నారు. ఎందుకంటే సైన్స్ పరంగా చూస్తే, పెరుగు ఒక గొప్ప ప్రోబయోటిక్ (Probiotic). ఇది మనిషి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి, కాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి. మరి జలుబు ఎందుకు వస్తుందంటే, పెరుగును తినడం వల్ల జలుబు రాదు.. ఫ్రిజ్ లో ఉన్న చల్లటి పెరుగును నేరుగా తినడం వల్ల జలుబు వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఎందుకంటే చల్లటి పెరుగు తినడం వల్ల గొంతులోని శ్లేష్మ పొరలు ప్రభావితమై జలుబు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే, శీతాకాలంలో పెరుగును ఫ్రిజ్ లో పెట్టకుండా, గది ఉష్ణోగ్రత (Room Temperature) వద్ద పెట్టి తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే ఆయుర్వేదం ప్రకారం, పెరుగు అభిష్యంది లక్షణాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది శరీరంలో శ్లేష్మాన్ని పెంచుతుంది. అందుకే రాత్రిపూట పెరుగు తినడం శీతాకాలంలో మంచిది కాదు. ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో పెరుగు, మజ్జిగ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇంకా చెప్పాలంటే, పెరుగులో చిటికెడు మిరియాల పొడి లేదా శొంఠి పొడి కలిపి తీసుకుంటే చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. కాబట్టి పెరుగును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, సరైన పద్ధతిలో తీసుకుంటే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Venezuela:చమురు దోచుకునేందుకే ఈ ప్లాన్..ట్రంప్‌పై వెనిజులా ప్రెసిడెంట్ ఫైర్



