Jowar Roti : డయాబెటిస్ నుంచి కొలెస్ట్రాల్ వరకు.. జొన్న రొట్టెలతో ఆరోగ్య మంత్రం
Jowar Roti : పూర్వీకులు ఎలాంటి వ్యాధులు లేకుండా బలంగా, ఆరోగ్యంగా జీవించడానికి వారి ఆహారపు అలవాట్లే ముఖ్య కారణం. వారు ఎక్కువగా రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు వంటి సంప్రదాయ ఆహారాలను తినేవారు.

Jowar Roti: పూర్వీకులు ఎలాంటి వ్యాధులు లేకుండా బలంగా, ఆరోగ్యంగా జీవించడానికి వారి ఆహారపు అలవాట్లే ముఖ్య కారణం. వారు ఎక్కువగా రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు వంటి సంప్రదాయ ఆహారాలను తినేవారు. ఈ ఆధునిక కాలంలో మనం రుచికరమైన ఫాస్ట్ ఫుడ్స్ వైపు మోజు పెంచుకుని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం.
Health mantra with Jowar Roti
చిరుధాన్యాలు అయిన జొన్న రొట్టెలు(Jowar Roti) కనుక రోజూ తింటే మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. జొన్నలు (Sorghum) ఒక పోషకాహార ధాన్యం. మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే వీటిని అస్సలు లైట్ తీసుకోరు.
గుండె ఆరోగ్యం .. కొలెస్ట్రాల్ నియంత్రణ
జొన్నల్లో పీచుపదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి, జొన్న రొట్టెలను క్రమం తప్పకుండా తినడం మీ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.
డయాబెటిస్ నియంత్రణ
జొన్నల్లో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ లేకపోవడం వల్ల ఇది డయాబెటిస్ (మధుమేహం) వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి చాలా మంచి ఆహారం. జొన్నల్లోని పీచుపదార్థం రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరిగేలా చేసి, డయాబెటిస్‌ను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఎముకల ఆరోగ్యం
జొన్నలు ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ B3 (నియాసిన్) వంటి విటమిన్లు, ఖనిజాలు మరియు మైక్రో న్యూట్రియంట్స్‌తో నిండి ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో, ఎముకల సాంద్రతను పెంచడంలో, బోలు ఎముకల వ్యాధి (osteoporosis) వంటి సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
బరువు తగ్గడంలోనూ సహాయం
సజ్జల (Millet) లాగే, ఇది కూడా గ్లూటెన్ రహిత పిండి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. జొన్నల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి ఆహారం విచ్ఛిన్నమై జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని (సటిటీ) ఎక్కువసేపు కలిగిస్తుంది, తద్వారా ఇతర ఆహారం తీసుకోవాలనే కోరిక తగ్గుతుంది. ఇది సహజంగా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
జీర్ణవ్యవస్థకు బెస్ట్ ఫ్రెండ్
జొన్నల్లోని అధిక పీచుపదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది మరియు జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అంతేకాకుండా, జొన్నల్లోని పోషకాలు, ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి. ఇది రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన శక్తిని అందించి, అలసటను తగ్గిస్తుంది. జొన్నల్లోని ఐరన్ ,ఇతర ఖనిజాలు రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి, దీని ద్వారా శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
మొత్తంగా, జొన్నరొట్టెలు మీ ఆహారంలో చేర్చుకోవడం ది బెస్ట్ అనే చెప్పొచ్చు. ఆధునిక జీవనశైలిలో ఎదురయ్యే అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలోనూ.. మెరుగైన ఆరోగ్యాన్ని పొందడంలో ఇవి మీకు ఎంతగానో సహాయపడతాయి. ఇంకెందుకు ఆలస్యం మీ డైలీ రొటీన్ ఫుడ్ కు బై చెప్పి జొన్న రొట్టెలను తింటూ హెల్దీగా ఉండండి
Good information to healthy life
Nice article