Fish eyes: చేప కళ్లను పక్కన పెట్టేస్తున్నారా? వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తప్పక తింటారు!
Fish eyes: చేపలు మాత్రమే కాదు, చేప కళ్లు కూడా అనేక రకాల అద్భుతమైన పోషక ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Fish eyes
చేపలు సహజంగానే అత్యంత పౌష్టికాహారం అన్న విషయం తెలిసిందే. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్, అలాగే విటమిన్ డి, సెలీనియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, శరీరంలో వాపు (Inflammation) తగ్గుతుంది, కండరాల వృద్ధికి కీలకంగా పని చేస్తాయి. అయితే, చేపలు మాత్రమే కాదు, చేప కళ్లు కూడా అనేక రకాల అద్భుతమైన పోషక ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చేప కళ్ల(Fish eyes)లో ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉంటాయి. వీటితో పాటు, విటమిన్ ఏ, విటమిన్ బి12, విటమిన్ ఈ, అలాగే జింక్, ఐరన్ వంటి అనేక ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాల కలయిక మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
కళ్లు, మెదడు, రోగనిరోధక శక్తికి కీలకం.. చేప కళ్లు తినడం వలన కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. చేప కళ్లలో ఉండే కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరుకు మద్దతునిచ్చి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీని కారణంగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

చేప కళ్ల(Fish eyes)ల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల, ఇది కంటి సమస్యలను దూరం చేసి, దృష్టిని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మనకు నైట్ బ్లైండ్‌నెస్ (రేచీకటి) వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, అలాగే చేప కళ్ళు రక్తపోటును (Blood Pressure) తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.అంతేకాదు చేప కళ్లు తింటే శరీరంలో ఏర్పడే వాపులు, నొప్పులు తగ్గుతాయి.
చేప కళ్లు(Fish eyes) మన రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, సమర్థవంతంగా పనిచేసేలా తోడ్పడతాయి. ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థను నిర్వహించడానికి ఇది చాలా ముఖ్యం. అంతేకాకుండా, చేప కళ్ళలో ఉండే విటమిన్ డి కారణంగా శారీరక ఆరోగ్యం మెరుగుపడి, ప్రశాంతమైన నిద్రను కలిగిస్తుంది. ఈ పోషకాలు డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.
అలాగే, చర్మ ఆరోగ్యం, ఎముకల దృఢత్వం పెరుగుతాయి, రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, ఆటిజం వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి కూడా చేపల కళ్లు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చివరిగా, చేప కళ్లలో ఉండే పోషకాలతో క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుందని చెబుతున్నారు.