HealthJust Lifestyle

Microwave oven: మైక్రో ఒవెన్‌ వాడుతున్నారా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Microwave oven: వండిన ఆహారాలను మళ్లీ మైక్రోవేవ్‌లో వేడి చేయడం వలన ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Microwave oven

మైక్రో ఒవెన్‌(Microwave oven)లో ఆహార పదార్థాలను వండటం, లేదా వేడి చేయడం చాలా సులభం. సమయాన్ని ఆదా చేయడంతో పాటు, ఫుడ్‌ను వెంటనే వేడివేడిగా తినే సౌకర్యాన్ని ఇది అందిస్తుంది. అయితే, వండిన ఆహారాలను మళ్లీ మైక్రోవేవ్‌(Microwave oven)లో వేడి చేయడం వలన ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మాంసం, కొన్ని రకాల కూరగాయల విషయంలో ఈ జాగ్రత్త మరింత అవసరం.

వండిన ఆహారాల విషయంలో జాగ్రత్త..వండిన తర్వాత చల్లబడిన అన్నాన్ని మైక్రోవేవ్‌లో ఎప్పుడూ వేడి చేయకూడదు. మైక్రోవేవ్ వేడి తగిలినప్పుడు, అన్నంలో పెరిగే బాసిల్లస్ సెరియస్ (Bacillus Cereus) అనే బ్యాక్టీరియా విడుదల చేసే విషపదార్థాల కారణంగా అన్నం విషతుల్యంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీయవచ్చు.

Microwave-oven
Microwave-oven

వండిన లేదా తాజా మాంసం, అలాగే గుడ్లను మైక్రో ఒవెన్‌లో వేడి చేసినప్పుడు వాటి ప్రోటీన్ విలువలు తగ్గిపోతాయి. మాంసంలోని ప్రోటీన్ల నిర్మాణంలో మార్పులు వచ్చి, అవి జీర్ణం కావడానికి కష్టంగా మారతాయి. కొన్ని సందర్భాల్లో, ఇది కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదముంది.

సాధారణంగా వండిన కూరల్ని మైక్రోవేవ్‌(Microwave oven)లో వేడి చేస్తారు. ఇలా చేయడం వలన కూరల్లోని విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ సి వంటి పోషకాలు తగ్గిపోయి, అవి పోషక విలువ లేని ఆహారంగా మారతాయి.

ప్లాస్టిక్ ప్లేట్ల వాడకం ప్రమాదకరం.. మైక్రోవేవ్‌(Microwave oven)లో ఆహార పదార్థాలను ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి చేయడం అత్యంత ప్రమాదకరం. వేడి చేసినప్పుడు ప్లాస్టిక్‌లోని పాలిమర్స్ , బైస్ఫెనాల్ A (BPA) వంటి రసాయనాలు ఆహారంలోకి సులభంగా కలిసిపోతాయి. ఇవి మానవ శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే, మైక్రోవేవ్ సేఫ్ గా ఉన్న గాజు లేదా సిరామిక్ పాత్రలను మాత్రమే ఉపయోగించడం మంచిది.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button