Lips:చలికాలంలో పెదవుల పగుళ్లు ఇబ్బంది పెడుతున్నాయా? ఈ చిట్కాలు పాటించండి!
Lips:మన శరీరంలోని చర్మం అంతా ఒక రకంగా ఉంటే, పెదవుల మీద ఉండే చర్మం మాత్రం చాలా పల్చగా, సున్నితంగా ఉంటుంది.
Lips
చలికాలం చాలామందికి ఇష్టం అయినా వింటర్ సీజన్ ప్రారంభం కాగానే వేధించే ప్రధాన సమస్య పెదవుల పగుళ్లు అంటేనే భయపడతారు. ఫేస్ ఎంత అందంగా ఉన్నా, పెదవులు (lips)పొడిబారి, పగుళ్లతో కనిపిస్తే ఆ అందమే తగ్గిపోతుంది.
అసలు చలికాలం అనే కాదు నార్మల్‌గా కూడా పెదవులు ఎందుకు పగులుతాయో చాలామందికి తెలీదు. మన శరీరంలోని చర్మం అంతా ఒక రకంగా ఉంటే, పెదవుల మీద ఉండే చర్మం మాత్రం చాలా పల్చగా, సున్నితంగా ఉంటుంది. అక్కడ నూనెను ఉత్పత్తి చేసే గ్రంథులు ఉండవు.
అందుకే చల్లని గాలి తగిలినప్పుడు, నీళ్లు ఎక్కువగా తాగనప్పుడు పెదవులు(lips) త్వరగా తేమను కోల్పోయి ఎండిపోతాయి. చాలామందికి పెదవులు ఆరిపోయినప్పుడు నాలుకతో తడుపుకునే అలవాటుంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. లాలాజలంలోని ఎంజైమ్స్ పెదవుల మీద ఉన్న తేమను ఇంకాస్త త్వరగా ఆవిరి చేస్తాయి, దానివల్ల పెదవులు మరింత ఎక్కువగా పగులుతాయి.

దీనికి అద్భుతమైన పరిష్కారం మన వంటిట్లోనే ఉంది. మొదటిది తేనె , పంచదార మిశ్రమం. ఒక చెంచా పంచదారలో కొంచెం తేనె కలిపి పెదవులపై నెమ్మదిగా రుద్దాలి. దీనిని స్క్రబ్బింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల పెదవుల మీద పేరుకుపోయిన డెడ్ స్కిన్ పోయి, కొత్త చర్మం వస్తుంది. ఆ తర్వాత దానిని కడిగేసి కొంచెం బాదం నూనె రాసుకుంటే వెంటనే మంచి రిజల్ట్ వస్తుంది.
రెండవది పాల మీగడ. రాత్రి పడుకునే ముందు కానీ, ఉదయం పూట అయినా కానీ స్వచ్ఛమైన పాల మీగడను పెదవులకు రాసుకుంటే, రెండు, మూడు గంటల్లోనే మృదువుగా మారుతాయి. నెయ్యి కూడా దీనికి బాగా పనిచేస్తుంది.అలాగే బొడ్డులో కొంచెం నెయ్యి రాసుకోవడం వల్ల కూడా పెదవుల పగుళ్లు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
అలాగే రోజ్ వాటర్ , గ్లిజరిన్ మిశ్రమం పెదవులు(lips) పగలడాన్ని తగ్గించడమే కాదు నలుపును కూడా తగ్గించి సహజమైన గులాబీ రంగును తెస్తుంది. రోజూ రాత్రి పూట ఈ మిశ్రమాన్ని రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
దీనికి తోడు దాహం వేయదని చలికాలంలో మనం నీళ్లు తాగడం బాగా తగ్గిస్తాం. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురై పెదవులు పగులుతాయి. కాబట్టి రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు అయినా తాగడం మర్చిపోవద్దు.
అలాగే రసాయనాలు ఎక్కువగా ఉండే లిప్ స్టిక్స్ వాడటాన్ని తగ్గించి, నాణ్యమైన బామ్స్ లేదా ఇంట్లో చేసిన కొబ్బరి నూనెను వాడాలి. ఈ చిట్కాలను రెగ్యులర్ గా పాటిస్తే ఈ చలికాలమే కాకుండా ఎప్పుడూ పెదవులపై మీ చిరునవ్వు ఎంతో అందంగా మెరుస్తుంది.



