Goji Berry: గోజి బెర్రీ పేరు తెలుసా? ఇమ్యూనిటీ బూస్ట్‌లో బెస్ట్
Goji Berry: చైనా ప్రజలు గోజి బెర్రీ పండును, ఆకులను, కొమ్మలను కూడా ఆహారంలో భాగంగా చేసుకున్నారు.

Goji Berry
గోజి బెర్రీ… ఎర్రగా, ద్రాక్ష సైజులో ఉండే ఈ పండు ఇప్పుడు మనదేశంలో కూడా అందుబాటులో ఉంది. టిబెట్, నేపాల్, పశ్చిమ చైనాలో ఎక్కువగా దొరికే ఈ పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని సూపర్ ఫ్రూట్‌గా పిలుస్తారు.
గోజి బెర్రీ(Goji Berry)ని వోల్ఫ్ బెర్రీ అని కూడా పిలుస్తారు. రెండువేల సంవత్సరాల క్రితం చైనాలో ఈ పండును మొదటిసారిగా గుర్తించారు. ఒక డాక్టర్ ఒక గ్రామంలో అందరూ వంద సంవత్సరాలు పైబడి ఆరోగ్యంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయి, దాని గురించి రీసెర్చ్ చేశాడు.
అప్పుడు ఆ గ్రామంలోని బావి చుట్టూ గోజి బెర్రీ(Goji Berry) మొక్కలు కనిపించాయి. వాటి పండ్లు నీళ్లలో పడి, ఆ నీరు తాగడం వల్ల వారు ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కనుగొన్నారు. అప్పటినుంచి చైనా ప్రజలు ఈ పండును, ఆకులను, కొమ్మలను కూడా ఆహారంలో భాగంగా చేసుకున్నారు.

గోజి బెర్రీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వయసు ఛాయలను తగ్గిస్తుంది. అలాగే, ఇది ఒక గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్. చర్మ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మరియు గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
ఈ పండు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, కార్డియోవాస్క్యులర్ డిసీజ్‌ల నుంచి కాపాడుతుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉన్న ఈ పండు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
గోజి బెర్రీలో ఉండే పాలిసాకరైడ్స్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి డయాబెటిస్‌ను నివారిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి జలుబు, ఫ్లూ నుంచి రక్షిస్తాయి.