Mosquitoes: దోమలు వారిని మాత్రమే ఎందుకు కుడతాయో తెలుసా?
Mosquitoes: ఎంతమంది ఉన్నా కొందరిని మాత్రమే దోమలు ఎక్కువగా కుడుతూ ఉండటం గమనిస్తాం. అలా వారిని మాత్రమే ఎక్కువగా కుట్టడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Mosquitoes
ప్రతి ఇంట్లో దోమలు(Mosquitoes) ఒక సాధారణ సమస్య. వర్షాకాలం వచ్చిందంటే చాలు, వాటి సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, మెదడువాపు వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. అయితే, ఎంతమంది ఉన్నా కొందరిని మాత్రమే దోమలు ఎక్కువగా కుడుతూ ఉండటం గమనిస్తాం. అలా వారిని మాత్రమే ఎక్కువగా కుట్టడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, దోమలు నలుపు, ఎరుపు, ముదురు నీలం వంటి ముదురు రంగుల దుస్తులకు ఎక్కువగా ఆకర్షితులవుతాయి. రాత్రిపూట దోమలకు చూపు సరిగా ఉండదు. అలాంటి సమయంలో ముదురు రంగులు వేసుకున్నవారు వాటికి సులభంగా కనిపిస్తారు. అందువల్ల, దోమల బారి నుంచి తప్పించుకోవాలంటే లేత రంగుల దుస్తులు ధరించడం మంచిది.

దోమలు కార్బన్ డయాక్సైడ్ వాసనకు సులభంగా ఆకర్షితులవుతాయి. మనం శ్వాస తీసుకుని వదిలేటప్పుడు వచ్చే కార్బన్ డయాక్సైడ్ వాసనను అవి కొంత దూరం నుంచే పసిగట్టగలవు. అంతేకాకుండా, మన శరీరం నుంచి వచ్చే లాక్టిక్ యాసిడ్, అమ్మోనియా, యూరిక్ యాసిడ్ వంటి చెమట వాసనలు కూడా దోమలకు చాలా ఇష్టం. ఈ వాసనలను పసిగట్టి అవి మన దగ్గరకు వస్తాయి. అందుకే వ్యాయామం చేసిన తర్వాత లేదా శరీరం ఎక్కువగా వేడెక్కినప్పుడు దోమలు ఎక్కువగా కుడతాయి.
ఆశ్చర్యకరంగా, దోమలు ‘O’ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని ఇతర గ్రూపుల వారి కంటే రెండింతలు ఎక్కువగా కుడతాయి. దోమ(Mosquitoes)ల్లోని ప్రత్యేక వాసన పసిగట్టే గుణం వల్ల అవి బ్లడ్ గ్రూప్‌ను గుర్తించగలవు. వాటికి ‘O’ బ్లడ్ గ్రూప్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఆ గ్రూప్ ఉన్నవారిని ఎక్కువగా కుడుతాయి. అంతేకాకుండా, చేతులు ,కాళ్లపై ఎక్కువగా స్వేద గ్రంధులు ఉండటం వల్ల ఈ భాగాలను అవి ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటాయి.
దోమల(mosquitoes) బెడద నుంచి తప్పించుకోవడానికి లేత రంగు దుస్తులు ధరించడం, పరిశుభ్రంగా ఉండటం, రాత్రిపూట దోమల నివారణ సాధనాలను ఉపయోగించడం మంచిది.