HealthJust LifestyleLatest News

Hyperactivity disorder: మీ పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా? హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్ కావొచ్చు..లేట్ చేయకండి

Hyperactivity disorder: పిల్లలను అల్లరి ఎక్కువ అని లేబుల్ చేయకుండా, వారిని అర్థం చేసుకుని, సరైన దిశలో ప్రోత్సహిస్తే వారు కూడా ప్రపంచంలో ఎంతోమంది ప్రతిభావంతులుగా, విజయవంతమైన వ్యక్తులుగా ఎదగగలరు.

  1. హైపర్యాక్టివిటీ డిజార్డర్

ఒక స్కూలులో మిగతా పిల్లలు బడిలో టీచర్ చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటుంటే, రిషి మాత్రం కిటికీలోంచి బయట ప్రపంచాన్ని చూసేవాడు. రిషి చేతిలో పెన్సిల్ పుస్తకంపై కాకుండా, బళ్లపై అడ్డదిడ్డంగా గీతాలు గీస్తూ ఉండేది. అలాగే ఇంట్లో హోమ్‌వర్క్ మొదలుపెట్టి, సగం పూర్తి చేయకుండానే వేరే ఆట వస్తువుతో ఆడుకోవడం మొదలుపెట్టేవాడు. ఏంటి రిషీ, నిమిషం కూడా ఊరుకోలేవా?” అని అమ్మ అరిచేది.నాన్న అల్లరి ఎక్కువ అవుతుందని కోప్పడేవాడు.

రిషికి తానెందుకు ఇలా ఉన్నాడో అర్థమయ్యేది కాదు. తన ప్రయత్నాలు విఫలమవుతున్నాయని, తాను ఎందుకూ పనికిరానని బాధపడేవాడు. చిన్న వయసులో ఈ సమస్యలు చిన్నవిగా అనిపించినా, వయసు పెరిగేకొద్దీ క్లాసులో వెనుకబడటం, పరీక్షల్లో తప్పులు చేయడం, సరిగా కలవలేకపోవడం దశ మొదలయ్యాయి. ఈ నిరాశ అతన్ని ఒంటరిగా మార్చింది.

జ్యోతిర్లింగం: ఓం ఆకారంలో వెలసిన శివుడి అద్భుత క్షేత్రం..నాలుగవ జ్యోతిర్లింగం

ఒకరోజు ఆఫీసు నుంచి అలసి వచ్చిన నాన్నకి టీచర్ నుంచి ఫోన్ వచ్చింది. “మీ అబ్బాయి ఏ పని పూర్తి చేయలేదు. తరచూ దారి మళ్లిపోతున్నాడు.” అని ఆమె ఫిర్యాదు చేశారు. నాన్నకి కోపం వచ్చిందా, తన బిడ్డను అర్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబ డాక్టర్ని సంప్రదించారు.

రిషి లక్షణాలన్నీ విన్న డాక్టర్, “మీ అబ్బాయి ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (హైపర్యాక్టివిటీ డిజార్డర్)అనేడీ సంబంధిత పరిస్థితిని వివరించారు. ఈ లక్షణాలకు కారణం మెదడులోని డోపమైన్, నోర్‌ఎపినెఫ్రిన్ వంటి కెమికల్స్ అసమతుల్యత. అవి మన ఆలోచనలను, ఫోకస్‌ను నియంత్రిస్తాయి. వాటి లోపం వల్లే పిల్లల మెదడు ఎప్పుడూ ఉంటుంది, కానీ ఒకచోట నిలబడదు. అలాగే, ఇది ఒక రకంగా జన్యుసంబంధమైన ప్రభావం కూడా.

హైపర్యాక్టివిటీ డిజార్డర్
హైపర్యాక్టివిటీ డిజార్డర్

ఈ (హైపర్ యాక్టివిటీ డిజార్డర్) విషయం తెలిసిన తర్వాత ఆది తల్లిదండ్రులు అతనిని అర్థం చేసుకున్నారు. కోప్పడతం మానేసి, కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారు. కౌన్సెలర్ సూచనలతో, రిషికి ఒక నిర్దిష్ట దినచర్యను ఏర్పాటు చేశారు. చిన్న చిన్న పనులను కూడా పూర్తి చేసినప్పుడు ప్రశంసించారు. ఉదాహరణకు, ఈరోజు నీ హోమ్‌వర్క్ సగం పూర్తి చేశావు, రేపు మిగిలినది చేద్దాం అని ప్రోత్సహించారు. ఈ ప్రశంసలు రిషిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.

రేషన్ కార్డులు: స్మార్ట్ రేషన్ కార్డులు..పంపిణీకి తేదీలు ఖరారు,మీ జిల్లాలో ఎప్పుడు?

ADHD అనేది పూర్తిగా నయం కాకపోయినా, దానిని నియంత్రించగలిగేదని రిషి నేర్చుకున్నాడు. అతను తన ప్రత్యేకమైన మెదడు పనితీరును బలహీనతగా కాకుండా, ఒక బలంగా మార్చుకున్నాడు. అతని సృజనాత్మకత, ఒక్కచోట ఆగని ఆలోచనలు, ఒక కొత్త డిజైన్‌ను రూపొందించడంలో ఎంతో సహాయపడ్డాయి. ఆ తర్వాత అతను గొప్ప ఆర్కిటెక్ట్‌గా మారి, ఎన్నో భవనాలను డిజైన్ చేసి ప్రశంసలు అందుకున్నాడు.

హైపర్యాక్టివిటీ డిజార్డర్
హైపర్యాక్టివిటీ డిజార్డర్

చివరికి, ఆది జీవితం మనకు ఒక సందేశం ఇస్తుంది. ADHD ఉన్న పిల్లలను అల్లరి ఎక్కువ అని లేబుల్ చేయకుండా, వారిని అర్థం చేసుకోవడం, దిశలో ప్రోత్సహిస్తే వారు కూడా ప్రపంచంలో ఎంతోమంది ప్రతిభావంతులుగా, విజయవంతమైన వ్యక్తులుగా ఎదగగలరని. ఎందుకంటే, అది ఒక బలహీనత కాదు, కేవలం వేరొక రకమైన శక్తి మాత్రమేనని తల్లిదండ్రులు గ్రహించాలి.

సరైన సమయంలో గుర్తించి, సహాయం చేస్తే ఈ పిల్లలు కూడా విజయవంతమైన జీవితం గడపగలరు. నిజానికి ప్రపంచంలో ఎన్నో సృజనాత్మక వ్యక్తులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు చిన్నప్పుడే ADHDతో బాధపడ్డారని రికార్డులు ఉన్నాయి. కాబట్టి ఇది బలహీనత కాదు, కేవలం వేరొక రకమైన మెదడు పని విధానం మాత్రమే. దానికి సరైన దిశ చూపించడమే తల్లిదండ్రులు, టీచర్లు, సమాజం చేయాల్సిన పని.

Personality Disorders: పర్సనాలిటీ డిజార్డర్స్..మీ ప్రవర్తన వెనుక ఉన్న నిజం

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button