Eating disorders:ఈటింగ్ డిజార్డర్స్.. శరీరానికి, మనసుకు జరిగే హానికరమైన పోరాటం గురించి తెలుసా ?
Eating disorders:ఈ సమస్య మెదడులో జరిగే ఒక రసాయన యుద్ధం. ఆకలిని, మూడ్‌ను నియంత్రించే సెరోటోనిన్ , ఆనందాన్ని ఇచ్చే డోపమైన్ వంటి కెమికల్స్‌లో అసమతుల్యత ఏర్పడినప్పుడు ఈ సమస్య మొదలవుతుంది.

Eating disorders
మీ మెదడు మీ శరీరానికి ఆకలి లేకపోయినా తినమని ఆదేశిస్తే లేదా ఎంత సన్నగా ఉన్నా మీరు లావుగా ఉన్నారని భ్రమింపజేస్తే ఎలా ఉంటుంది? అలాంటి మానసిక పోరాటమే ఈటింగ్ డిజార్డర్స్Eating disorders). ఇది కేవలం తినే అలవాట్ల గురించి కాదు. ఇది మనసు మన శరీరంపై చూపే ఆధిపత్యం. ఈ పోరాటంలో మనసు ఎలా గెలుస్తుంది? దీని నుంచి ఎలా బయటపడాలో ఒకసారి చూద్దాం. .
ఈ సమస్య మొదట చాలా చిన్నదిగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో చూసే పర్ఫెక్ట్ బాడీ ఫోటోలు మనసులో ఒక ఆలోచనను నాటుతాయి. బరువు తగ్గితేనే అందంగా కనిపిస్తాను. ఈ ఆలోచన క్రమంగా ఆహారాన్ని ఒక అడ్డంకిగా చూడటం మొదలుపెట్టి, ఒక్కో మెట్టుగా మనల్ని ఒక లోతైన అగాధంలోకి తోస్తుంది.

వైద్యపరంగా చూస్తే, ఈ సమస్య మెదడులో జరిగే ఒక రసాయన యుద్ధం. ఆకలిని, మూడ్‌ను నియంత్రించే సెరోటోనిన్ , ఆనందాన్ని ఇచ్చే డోపమైన్ వంటి కెమికల్స్‌లో అసమతుల్యత ఏర్పడినప్పుడు ఈ(Eating disorders) సమస్య మొదలవుతుంది.
అనొరెక్సియా నర్వోసా (Anorexia Nervosa)లో బరువు తక్కువగా ఉన్నా, తాను లావుగా ఉన్నాననే భావనతో ఆహారం పూర్తిగా మానేయడం ఒక గెలుపులా అనిపిస్తుంది.
బులీమియా నర్వోసా (Bulimia Nervosa)లో ఒకేసారి ఎక్కువగా తిని, ఆ తర్వాత వాంతులు చేసి లేదా అతిగా వ్యాయామం చేసి ఆ ఫీలింగును తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఇక, బింజ్ ఈటింగ్ డిజార్డర్స్ (Binge Eating Disorder)లో ఆకలి లేకపోయినా తినడం ఆపుకోలేకపోవడం, తర్వాత తనపై ద్వేషాన్ని పెంచుకోవడం వంటివి జరుగుతాయి.
AP : వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త ..త్వరలోనే వివరాలు

ఈ సమస్యలు శరీరానికి చాలా హానికరమైనవి. పోషకాహార లోపం వల్ల శరీరం బలహీనపడుతుంది, హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది, గుండె సమస్యలు, ఎముకల బలహీనత వంటివి వస్తాయి. మానసికంగా డిప్రెషన్, ఆందోళన మరింత పెరుగుతాయి.
ఈ సమస్యల నుంచి బయటపడటం పూర్తిగా సాధ్యమే. సరైన చికిత్స, అంటే మానసిక చికిత్స, పోషకాహార నిపుణుల మార్గదర్శనం, అవసరమైతే మందులు వాడటంతో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా అవసరం ..ఈటింగ్ డిసార్డర్స్ అనేవి బలహీనతకు సంకేతం కాదు, అది ఒక వ్యాధి. దానిని గుర్తించి, సరైన సహాయం తీసుకుంటే, మళ్లీ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
One Comment