Poha: అటుకులతో ఆరోగ్యం..ఇలా చేస్తే టేస్ట్ అండ్ హెల్త్ మీదే
Poha: పోహా ఉప్మా అనేది అల్పాహారం లేదా స్నాక్స్‌గా తక్కువ సమయంలోనే తయారుచేయగలిగే ఆహారం. కొంతమంది అటుకులు, పాలులో వేసుకుని చక్కెర వేసుకుని తింటారు . అలా తిన్నాకూడా మంచిదే.

Poha
అటుకులు (Poha), వీటిని పోహా అని కూడా పిలుస్తారు, పోషక విలువలు ఎక్కువగా ఉండే అద్భుతమైన ఆహార పదార్థం. ఆరోగ్యకరమైన అల్పాహారం (Breakfast) కోసం చూస్తున్న వారికి, డైట్ ఫాలో అయ్యే వారికి అటుకులతో చేసిన వంటకాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
వంద గ్రాముల అటుకులలో దాదాపు 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాకుండా, అటుకులలో ఐరన్ (ఇనుము) సమృద్ధిగా ఉంటుంది. ఐరన్ అధికంగా ఉండే పోహా తీసుకోవడం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాలు (Red Blood Cells) వృద్ధి చెందుతాయి.

పోహాలో ఉండే ప్రో బయోటిక్స్ (Probiotics) పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు సహాయపడి, గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. అటుకులు గ్లూటెన్ (Gluten) లేకుండా ఉంటాయి,వీటిలో క్యాలరీలు తక్కువగానే ఉంటాయి. అందుకే డైట్ ఫాలో అయ్యే వారికి ఇది ఆదర్శవంతమైన అల్పాహారం.
పోహా ఉప్మా(Poha) అనేది అల్పాహారం లేదా స్నాక్స్‌గా తక్కువ సమయంలోనే తయారుచేయగలిగే ఆహారం. కొంతమంది అటుకులు, పాలులో వేసుకుని చక్కెర వేసుకుని తింటారు . అలా తిన్నాకూడా మంచిదే.
అలాగే లావుగా ఉండే అటుకులతో చేసిన ఉప్మా ఎంతో రుచిగా ఉంటుంది. వెజిటెబుల్స్ (కూరగాయలు), నట్స్ (పల్లీలు వంటివి) కలిపి చేసుకున్న 100 గ్రాముల పోహా ఉప్మాతో సుమారు 110 కేలరీల శక్తి, దాదాపు 18.8 గ్రాముల కార్బోహైడ్రేట్లు, మరియు 5-7 గ్రాముల వరకు ఫైబర్ వంటి పోషకాలు అందుతాయి. రోజువారీ శక్తి అవసరాలకు ఇది మంచి ఎంపిక.
One Comment