vitamin D:విటమిన్ D లోపాన్ని ఇలా గుర్తించండి..
Vitamin D:విటమిన్ D మాత్రం ఎక్కువగా సూర్యరశ్మి నుంచే లభిస్తుంది. అందుకే దీనిని "సూర్యరశ్మి విటమిన్ అని కూడా అంటారు.

Vitamin D
మనిషి శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ D (Vitamin D)చాలా ముఖ్యమైనది. ఇది కేవలం ఎముకల బలానికే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా, ఇతర విటమిన్లు ఆహారం ద్వారా లభిస్తాయి, కానీ విటమిన్ D మాత్రం ఎక్కువగా సూర్యరశ్మి నుంచే లభిస్తుంది. అందుకే దీనిని “సూర్యరశ్మి విటమిన్ అని కూడా అంటారు.
మన శరీరానికి అవసరమైన(Vitamin D) విటమిన్ D2, D3 కాంప్లెక్స్‌లు సూర్యరశ్మి ద్వారా తయారవుతాయి. సూర్యరశ్మి మన చర్మంపై పడినప్పుడు, అందులోని అతినీలలోహిత కిరణాలు చర్మంలోని కొవ్వును విటమిన్ D గా మారుస్తాయి. కాబట్టి, ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల పాటు ఎండలో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఎక్కువసేపు ఎండలో ఉండటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.
విటమిన్ D చేసే మేలు ఏంటంటే..రోజుకు సుమారు 10 గ్రాముల విటమిన్ D(Vitamin D) మన శరీరానికి అవసరం. ఇది ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, వివిధ రకాల వ్యాధులు మన దగ్గరకు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా, ఇది కాల్షియం , ఫాస్ఫేట్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది, తద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి. క్యాన్సర్, రికెట్స్, బోలు ఎముకల వ్యాధి, క్షయ వంటి వ్యాధులు రాకుండా ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. గాయాలు త్వరగా మానడానికి కూడా విటమిన్ D ఎంతగానో ఉపయోగపడుతుంది.

విటమిన్ D (vitamin D)లోపిస్తే ఏమవుతుందంటే.. విటమిన్ D లోపం ఏర్పడితే, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల సులభంగా జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. వెన్నునొప్పి, తరచుగా అలసట, జుట్టు రాలడం, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా, ఎముకల్లో కాల్షియం తగ్గిపోయి, ఎముకలు, కండరాల నొప్పులు కూడా వస్తాయి. మానసికంగా కూడా ఒత్తిడి, నిస్సత్తువ వంటి సమస్యలు ఎదురవుతాయి.
గర్భిణులకు విటమిన్ D అత్యవసరం..సాధారణ వ్యక్తులతో పోలిస్తే, గర్భిణీ స్త్రీలకు విటమిన్ D మరింత ముఖ్యం. గర్భిణులు ప్రతిరోజూ కొంత సమయం ఎండలో గడపడం వల్ల కడుపులోని బిడ్డ ఎదుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ D తగినంత ఉన్న గర్భిణులకు పుట్టే పిల్లలు అరుదుగా అనారోగ్యానికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, ప్రసవ సమయంలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఇది సహాయపడుతుంది.
మీరు చిన్న పనులకే అలసిపోతున్నట్లు అనిపించినా, తరచుగా వెన్నునొప్పి, మెడనొప్పి, లేదా నిస్సత్తువతో బాధపడుతున్నా, అది విటమిన్ D లోపానికి సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే విటమిన్ D స్థాయిలను పెంచుకునే ప్రయత్నం చేయడం చాలా అవసరం.