Heart: తిండి మారితేనే గుండెకు బలం..గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునే రహస్యం!
Heart: గుండెకు ముప్పు కలిగించే ప్రధాన శత్రువులలో ఉప్పు (Sodium) ఒకటి. ఉప్పు అధికంగా వాడటం వల్ల బీపీ (రక్తపోటు) పెరగడంతో పాటు అనేక గుండె సంబంధిత రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.

Heart
వయసుతో సంబంధం లేకుండా నేడు చాలా మంది గుండె(Heart) పోటుతో మృత్యువాత పడుతున్నారు. గుండె జబ్బులు కేవలం వ్యాయామం చేయకపోవడం వల్ల మాత్రమే కాకుండా, మనం తినే ఆహారంలో పోషక విలువలు లేకపోవడం వల్ల కూడా వస్తాయి. అందుకే, మన ఆహార అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గుండె పనితీరును మెరుగుపరచుకోవచ్చు.
సాధారణంగా తీసుకునే భారతీయ ఆహారంలో కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలు) అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు తగు మోతాదులో సమతుల్యం చేయాలి. పిండి పదార్థాలను తగ్గించి, ప్రోటీన్లు అధికంగా ఉండే పప్పులు, చిక్కుళ్లు, గుడ్లు, చేపలు వంటి ఆహార పదార్థాలను చేర్చుకోవడం వల్ల శరీరానికి తగినంత ప్రోటీన్ అంది, గుండె కండరాలు బలంగా తయారవుతాయి. కేవలం క్యాలరీలు ఎక్కువగా ఉండే పదార్థాల కంటే, మినరల్స్, విటమిన్లు, మరియు ఫైబర్ ఉండే ఆహారం గుండెకు ఎప్పుడూ మంచిది.

గుండెHeart)కు ముప్పు కలిగించే ప్రధాన శత్రువులలో ఉప్పు (Sodium) ఒకటి. ఉప్పు అధికంగా వాడటం వల్ల బీపీ (రక్తపోటు) పెరగడంతో పాటు అనేక గుండె సంబంధిత రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. వైద్య నిపుణుల సలహా ప్రకారం, రోజుకు 5 గ్రాములకు తక్కువ మోతాదులోనే ఉప్పు తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా, సహజంగా ఉప్పు తక్కువగా ఉండే ఆకుకూరలు వండే సమయంలో ఉప్పు లేకుండా వంట చేయడం లేదా చాలా తక్కువగా వాడటం అలవాటు చేసుకోవాలి.
ఆహారపు అలవాట్లలో మార్పులతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మరియు 40 ఏళ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరం. దీని వల్ల శరీరంలో జీవక్రియలు, మరియు అవయవాల పనితీరు ఎలా ఉందో ముందుగానే తెలుసుకోవచ్చు. ముఖ్యంగా, గుండె(Heart) ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ముందుగానే తెలుసుకోవడం ద్వారా, తగు జాగ్రత్తలు తీసుకుని, గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.