Just LifestyleHealthLatest News

Music:మ్యూజిక్ థెరపీ.. మీ మూడ్‌ని మార్చే సంగీత మంత్రం

Music: మీరు బాధలో ఉన్నప్పుడు విచారకరమైన సాంగ్స్ వింటే, మీ మెదడు ఆ బాధను ఇంకా ఒక పెద్ద సుడిగుండంలా మార్చేస్తుంది.

Music

సంగీతం అనేది కేవలం ఎంటర్‌టైన్మెంట్ కాదు, అది ఒక పవర్‌ఫుల్ భావోద్వేగ నియంత్రణ సాధనం. మనం వినే పాటల తీరును బట్టే మన ఆలోచనలు , ప్రపంచాన్ని చూసే విధానం రూపుదిద్దుకుంటాయి. సైకాలజీ పరిశోధనల ప్రకారం, మనం ఎంచుకునే మ్యూజిక్(Music) మన సబ్-కాన్షియస్ మైండ్ మీద డైరక్టుగా ప్రభావం చూపిస్తుంది.

మీరు బాధలో ఉన్నప్పుడు మరింత విచారకరమైన సాంగ్స్ వింటే, మీ మెదడు ఆ బాధను ఇంకా ఒక పెద్ద సుడిగుండంలా మార్చేస్తుంది. ఇది మిమ్మల్ని మరింత నిరాశలోకి నెట్టేలా చేస్తుంది . అలా కాకుండా మూడ్ బాగోలేనపుడు, బాధలో ఉన్నప్పుడు జోష్ ఫుల్ అండ్ ఫాస్ట్ బీట్ సాంగ్స్ వింటే, మెదడులోని ఒత్తిడి హార్మోన్లు తగ్గి, కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది.

నిజానికి సంగీతానికి భాషతో పనిలేదు. ఎందుకంటే అది డైరక్టుగా మన అంతర్మనస్సుతో మాట్లాడుతుంది. ఉదయాన్నే ప్రశాంతమైన మెలోడీ మ్యూజిక్ వినడం వల్ల రోజంతా ఏకాగ్రత పెరుగుతుందని మానసిక నిపుణులు అంటారు. పని చేసేటప్పుడు తక్కువ శబ్దం ఉన్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వినడం వల్ల క్రియేటివిటీ మెరుగుపడుతుంది.

Music
Music

మనస్తత్వవేత్తలు కూడా మానసిక రోగులకు మ్యూజిక్ థెరపీనే సిఫార్సు చేస్తారు. ఎందుకంటే సంగీతం వల్ల మెదడులో ‘డోపమైన్’ , ‘ఆక్సిటోసిన్’ వంటి ప్రేమను, సంతోషాన్ని ఇచ్చే హార్మోన్లను రిలీజ్ అవుతాయి. అంతేకాదు మ్యూజిక్ జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుందట.

కాబట్టి, మీకు చిరాకుగా ఉన్నప్పుడు లేదా ఏదైనా సాధించాలనే పట్టుదల కావాలన్నప్పుడు, సరైన మోటివేషనల్ సాంగ్స్, మెలోడీ సంగీతాన్ని ఎంచుకోండి. అది మీ మెదడును వెంటనే రిఫ్రెష్ చేసి, మీ పనితీరును మెరుగుపరుస్తుంది. మ్యూజిక్ ఒక దివ్యౌషధం వంటిది, దానిని సరైన విధంగా వాడితే..మీ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉండటంతో పాటు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button