Tech shame : ఆఫీసులో Gen Zకి కొత్త టెన్షన్.. మరి సొల్యూషన్ ఉందా?
Tech shame : ప్రొఫెషనల్ లైఫ్‌లో టెక్నాలజీని సరిగా వాడలేకపోవడాన్ని Gen Z యువత తమ ఇన్‌ఎబిలిటీగా ఫీల్ అవుతున్నారు.

Tech shame : కొత్తగా జాబ్ లైఫ్‌లోకి ఎంటరవుతున్న యువత.. హుషారుగా, స్పీడ్‌గా దూసుకుపోవాల్సింది పోయి, ఇప్పుడు ‘టెక్ షేమింగ్’తో బాధపడుతున్నారని ఓ రీసెంట్ స్టడీ వెల్లడించింది. అసలు ‘టెక్ షేమింగ్’ అంటే ఏమిటి? దీని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? దీనికి సొల్యూషన్ ఉందా? ఇలాంటి డౌట్స్ చాలామందిలో వినిపిస్తున్నాయి.
Tech shame
కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు వాటిని వాడటం అప్పటి జనరేషన్‌కు పెద్ద ఛాలెంజ్‌గా ఉండేది. టెక్నాలజీ చేంజెస్‌ని అందుకోవడంలో కాస్త ఇబ్బంది పడినా, తర్వాత అలవాటు పడిపోయారు. ఆ తర్వాత వచ్చిన జనరేషన్స్ అయితే కంప్యూటర్ల విషయంలో సూపర్ ఎక్స్‌పర్ట్స్‌గా మారారు. అయితే, ఇప్పుడు 1995-2012 మధ్య పుట్టిన ‘జనరేషన్ Z’ (Gen Z) తరంవారు.. లేటెస్ట్ టెక్నాలజీకి బాగా అలవాటు పడినవారే అయినా, ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు మాత్రం కొన్ని టెక్నికల్ ఇష్యూస్‌తో ఇబ్బందులు పడుతున్నారట. దీన్నే ‘టెక్ షేమ్’ (Tech shame)అని పిలుస్తున్నారు.
Gen Zకే ఎందుకు ఈ ‘టెక్ షేమ్’?
లాసల్లే ఏజెన్సీ అనే సంస్థ చేసిన సర్వేలో Gen Z యువత ఎక్కువగా ఆఫీసుల్లో ఈ సమస్యను ఫేస్ చేస్తున్నట్లు తేలింది. ఈ ‘టెక్ షేమ్’ అనే పదాన్ని మొదట కంప్యూటర్లు తయారుచేసే హెచ్‌పీ కంపెనీ ఉపయోగించింది. ప్రొఫెషనల్ లైఫ్‌లో వాడే ఎక్విప్‌మెంట్స్‌ను యూజ్ చేయడంలో యువత ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారని చెప్పడానికి ఈ పదాన్ని వాడారు. హెచ్‌పీ ప్రకారం, ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ టెక్నాలజీ రిలేటెడ్ సమస్యను(Workplace Challenges) ఎదుర్కొంటున్నారు.
లాసల్లే ఏజెన్సీ చెప్పిన దాని ప్రకారం, ప్రొఫెషనల్ లైఫ్‌లో టెక్నాలజీని సరిగా వాడలేకపోవడాన్ని Gen Z యువత తమ ఇన్‌ఎబిలిటీగా ఫీల్ అవుతున్నారు. పైగా, ఏదైనా డౌట్ వస్తే తోటి ఎంప్లాయిస్‌ని అడగడానికి మొహమాట పడుతున్నారట. అంతేకాదు, ఈ విషయంలో అవతలివారు ఏదైనా కామెంట్ చేస్తే, దాన్ని షేమ్‌గా ఫీల్ అవుతున్నారు. అందుకే దీన్ని ‘టెక్ షేమ్’గా పిలుస్తున్నారని లాసల్లే ఏజెన్సీ వివరించింది.
Gen Z తరం యువత ఇప్పుడిప్పుడే ఉద్యోగ జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు. చిన్నతనం నుంచీ లేటెస్ట్ మొబైల్ ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి గ్యాడ్జెట్స్‌ను యూజ్ చేయడంలో వీరు మిగిలిన వారి కంటే ముందుంటారు. కానీ, ప్రొఫెషనల్ లైఫ్‌లో మాత్రం వీరు వెనుకంజలో ఉన్నారని సర్వేల్లో బయటపడింది. వీరు ముఖ్యంగా పాత తరం కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫ్యాక్స్ మెషిన్‌లు వంటివి వాడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ప్రొఫెషనల్ లైఫ్‌లో వాడాల్సిన డిజిటల్ టూల్స్‌ని సరైన రీతిలో వాడలేకపోతున్నారని తెలుస్తోంది. గత ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జాబ్స్‌లోకి ఎంటర్ అయిన ఫ్రెషర్స్‌లో దాదాపు సగం మంది ఇలా టెక్నాలజీ పరంగా ఇబ్బందిపడ్డారని లాసల్లే ఏజెన్సీ సర్వే చెబుతోంది.
ఈ టెక్ షేమింగ్ సమస్య చిన్న విషయంగానే కనిపించినా.. Gen Z యూత్ మాత్రం ఇది తమ సెల్ఫ్ రెస్పెక్ట్‌కు భంగం కలిగించే అంశంగానే భావిస్తున్నట్లు సైకాలజిస్టులు చెబుతున్నారు. ఈ టెక్ షేమింగ్ వల్ల ఒంటరిగా ఫీల్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా టెక్ షేమింగ్ ఇబ్బంది అన్ని ఏజ్‌ల వారికీ సంబంధించిందే అయినా సరే.. Gen Z ఎంప్లాయిస్‌పై మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
ఈ టెక్ షేమింగ్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టడానికి.. కొత్తగా జాబ్‌లో చేరే వ్యక్తులపై మేనేజర్ స్థాయి వ్యక్తులు ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. వారికి తగిన ట్రైనింగ్ ఇవ్వడం, డౌట్స్ అడగడానికి ఫ్రీ వాతావరణం క్రియేట్ చేయడం, టీమ్ లీడర్‌లు సపోర్టివ్‌గా ఉండటం వంటివి ఈ సమస్యను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. టెక్నాలజీని నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ అని గుర్తించడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఓపెన్‌గా ఉండటం చాలా ముఖ్యమన్న విషయాన్ని కూడా మర్చిపోకూడదు.