Just LifestyleHealthLatest News

Behavior : ఎదుటివారిని ఆప్షన్‌లా చూసే మనుషులు.. సైకాలజీ ఏం చెబుతోంది?

Behavior : తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ఎదుటి వ్యక్తిలోనే లోపం ఉందని నమ్మిస్తారు.

Behavior

మన లైఫ్ జర్నీలో మనకు రకరకాల మనుషులు తారసపడుతుంటారు. కొందరితో బంధం నీళ్లలా స్వచ్ఛంగా సాగిపోతుంటే, మరికొందరి ప్రవర్తన(Behavior) మాత్రం ఎప్పటికీ అర్థం కాని పజిల్‌లా ఉంటుంది. వారు మనకు, మన మనసుకో కావాలనిపించినప్పుడు అస్సలు కనిపించరు. కానీ కనిపించినపుడు మాత్రం అసలు వారిద్దరి మధ్య ఏమీ జరగనట్లే, వారి మధ్య ఎలాంటి గ్యాప్ లేనట్లే మాట్లాడతారు.

మనుషుల బిహేవియర్‌(Behavior)లో కనిపించే ఈ అయోమయ ధోరణిని సైకాలజీలో ఎమోషనల్ కన్వీనియెన్స్ లేదా సిచ్యుయేషనల్ అవైలబిలిటీ అని పిలుస్తారు. అంటే వారికి అవసరమైనప్పుడయినా, లేదా వారి మూడ్ బాగున్నప్పుడు మాత్రమే అవతలి వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం.

ఇదే విషయాన్ని మరికాస్త లోతుగా పరిశీలిస్తే, ఇలాంటి వారిని ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ లేదా కన్వినీయెంట్ రిలేషన్ షిప్స్ మెయింటైన్ చేసేవారు అంటారు. వీరు తమకు తోచినప్పుడు బాగా పలకరిస్తారు, నచ్చినప్పుడు క్లోజ్ గా ఉంటారు, కానీ పని అయిపోగానే లేదా తమ మూడ్ మారిపోగానే బిజీ అనే ఒక చిన్న మాటతో పెద్ద గోడ కట్టేస్తారు.

నిజానికి బిజీగా ఉండటం అంటే పనులు మానుకోవడం కాదు. ఏ పనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో వారే నిర్ణయించుకుంటారు. కాబట్టి ఎవరైనా బిజీ అని చెబుతున్నారంటే, ఆ సమయంలో వారికి మనకంటే వేరే పనో లేదా వేరే వ్యక్తికో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అర్థం. ఇక్కడ అవకాశవాదం అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు, మన మనసుకు వాళ్లు కావాలనిపించినప్పుడు అందుబాటులో ఉండరు. ఈ బిహేవియర్‌ను సైకాలజీలో అవాయిడెంట్ అటాచ్మెంట్ స్టైల్ అని కూడా అంటారు.

Behavior
Behavior

ఇలాంటివారిలో అత్యంత విచిత్రమైన విషయం కూడా కనిపిస్తుంది. నిందను తిరిగి అవతలి వారి మీదే వేయడం. అంటే నువ్వే బిజీ అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు అనో, లేదంటే నువ్వే పట్టించుకోలేదనో అంటారు. ఇలా అనడాన్ని గ్యాస్ లైటింగ్ లేదా ‘డిఫ్లెక్షన్’ అంటారు. అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ఎదుటి వ్యక్తిలోనే లోపం ఉందని నమ్మించడం అన్నమాట.

నిజానికి ఇదొక రకమైన ఎమోషనల్ మానిప్యులేషన్. ఒకవేళ ఎవరికైనా ఒక వ్యక్తి మీద గౌరవం, ప్రేమ ఉంటే వారు ఎంత బిజీగా ఉన్నా కనీసం ఒక చిన్న మెసేజ్ అయినా చేస్తారు. ఇక్కడ సమస్య సమయం కానే కాదు కేవలం వారి వారి ప్రయారిటీ మాత్రమే. మనుషులు ఎవరైనా సరే తమకు నచ్చినట్లుగా ఉండటం తప్పు కాదు కానీ, దానికోసం ఎదుటి వారి భావాలను గౌరవించకపోవడం మాత్రం కరెక్ట్ కాదంటారు సైకాలజిస్టులు. ఇలాంటి వారిని సైకాలజీ పరంగా ఎమోషనల్లీ అన్ అవైలబుల్ పీపుల్ అని కూడా అంటారని చెబుతారు.

ఇలాంటి వారు తమ చుట్టూ ఒక గోడను నిర్మించుకుంటారు, ఆ గోడలోకి ఎవరిని ఎప్పుడు ఆహ్వానించాలో, ఎప్పుడు బయటకు పంపాలో కేవలం తమ స్వార్థం ప్రకారం ఆలోచిస్తారు. అందుకే ఇలా ఎవరైతే వారి మూడ్ కి తగ్గట్టుగా మిమ్మల్ని వాడుకుంటారో, వారికి మీ లైఫ్‌లో ఎంతవరకు చోటివ్వాలో ఒక గీత గీసుకోండి. లేదంటే అవతలి వారి అవును-కాదు అనే ఆటలో మీ మనసు గాయపడుతుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button