Just LifestyleHealthLatest News

Fasting:బాడీకే కాదు మెదడుకూ ఫాస్టింగ్ అవసరమేనట..ఎలా చేయాలో తెలుసా మరి.?

Fasting: నిరంతరం వచ్చే లైకులు, కామెంట్లు, మెసేజులతో మన మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని అస్తవ్యస్తం చేస్తాయట.

Fasting

మనమంతా ఇప్పుడు ఒక అద్భుతమైన సాంకేతిక యుగంలో ఉన్నాం. కానీ అదే సమయంలో కంటెన్యూగా సోషల్ మీడియా ప్రవాహంలో మునిగి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. పొద్దున లేవగానే పక్కనే ఉన్న మనుషుల ముఖం చూడటం కంటే.. ఫోన్ స్క్రీన్‌ను చూడటానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఇంటర్నెట్ మనల్ని వదలడం లేదు.

అయితే దీనివల్ల మన మెదడు ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్‌కు గురై మొద్దుబారిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికోసం ఒక పరిష్కారాన్ని తీసుకువచ్చారు.అదేంటంటే ఆహారం మానేయడం వల్ల శరీరానికి ఉపవాసం ఎలా మేలు చేస్తుందో.. మెదడుకు ఇంటర్నెట్ మానేయడం వల్ల అంటే డిజిటల్ ఫాస్టింగ్ (Fasting)వల్ల అలా మెదడకు పునరుజ్జీవం వస్తుందని అంటున్నారు.

వారంలో కనీసం ఒక్క రోజైనా స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా, నోటిఫికేషన్లకు దూరంగా ఉండటమే డిజిటల్ ఫాస్టింగ్‌ ప్రక్రియ. నిరంతరం వచ్చే లైకులు, కామెంట్లు, మెసేజులతో మన మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని అస్తవ్యస్తం చేస్తాయట. దీనివల్ల మనలో సహనం తగ్గిపోవడంతోనే , ఏ విషయం మీద కూడా నిమిషం కంటే ఎక్కువ సేపు ఏకాగ్రత పెట్టలేకపోతున్నామని అంటున్నారు.

అయితే బాగా అలవాటు పడిన మనసు కదా..డిజిటల్ ఫాస్టింగ్(Fasting) మొదలుపెట్టినప్పుడు మొదట్లో చాలా అసహనంగా ఉంటుంది. మనల్ని అందరూ మర్చిపోయారేమో అన్న భయం (FOMO – Fear Of Missing Out) కూడా కలగొచ్చు. కానీ మెల్లమెల్లగా మెదడు ప్రశాంతతను పొందుతుంది. ఫోన్ పక్కన పెట్టినప్పుడు మనకు దొరికే ఆ ఖాళీ సమయమే.. మనలోని క్రియేటివిటిని పెంచే ఆలోచనలకు పునాది అవుతుంది.

Fasting
Fasting

కళ్లెదురుగా ఉన్న మనుషులతో నేరుగా మాట్లాడటం,అలాగే ప్రకృతిని గమనించడం, మనతో మనం మౌనంగా గడపడం వల్ల మానసిక ఒత్తిడి మెల్లగా తగ్గుతుందన్న విషయాన్ని మీరే గుర్తిస్తారు. ఇది కేవలం టెక్నాలజీకి దూరం అవ్వడం కాదు, మనల్ని మనం తిరిగి కనుక్కోవడం. ఈ ఒక్క రోజు చేసిన పని మిగిలిన ఆరు రోజులు.. మనం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడేలా చేస్తుంది.

అంతేకాదు నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఆలోచనల్లో క్లారిటీ వస్తుంది. నిజానికి డిజిటల్ ప్రపంచం నుంచి విరామం తీసుకోవడం అంటే నిజమైన జీవితానికి దగ్గరవ్వడమే అన్న సత్యాన్ని తెలుసుకుంటారు. ఆదివారం పూట కానీ లేదా వారంలో నీకు నచ్చిన ఒకరోజు వైఫై ఆపేసి, పుస్తకాన్ని చేత పట్టుకుని కానీ తోటలో మొక్కలతో కానీ గడిపితే.. నీ మెదడు ఇచ్చే కృతజ్ఞతను నువ్వే అనుభూతి చెందుతావు అంటారు సైకాలజిస్టులు. ఇది కేవలం ఒక రోజు డిజిటల్ ఉపవాసం కాదు, మన మెంటల్ హెల్త్ కోసం మనం చేసే ఒక గొప్ప యజ్ఞం అవుతుంది .

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button